iDreamPost

Dunki: సైలెంట్​గా OTTలోకి షారుక్ బ్లాక్​బస్టర్ మూవీ.. ‘సలార్’ను ఢీకొట్టి మరీ..!

  • Published Feb 15, 2024 | 9:02 AMUpdated Feb 15, 2024 | 9:02 AM

రెబల్​స్టార్ ప్రభాస్ ‘సలార్’ మూవీని ఢీకొట్టి మరీ బ్లాక్​బస్టర్​గా నిలిలిన షారుక్ ఫిల్మ్ ఓటీటీలోకి వచ్చేసింది. పెద్దగా హడావుడి లేకుండా ఈ చిత్రం సైలెంట్​గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

రెబల్​స్టార్ ప్రభాస్ ‘సలార్’ మూవీని ఢీకొట్టి మరీ బ్లాక్​బస్టర్​గా నిలిలిన షారుక్ ఫిల్మ్ ఓటీటీలోకి వచ్చేసింది. పెద్దగా హడావుడి లేకుండా ఈ చిత్రం సైలెంట్​గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

  • Published Feb 15, 2024 | 9:02 AMUpdated Feb 15, 2024 | 9:02 AM
Dunki: సైలెంట్​గా OTTలోకి షారుక్ బ్లాక్​బస్టర్ మూవీ.. ‘సలార్’ను ఢీకొట్టి మరీ..!

ఓటీటీలోకి ప్రతి వారం చాలా సినిమాలు వస్తుంటాయి. అయితే వాటిల్లో కొన్ని మాత్రమే ఆడియెన్స్​ను ఆకట్టుకుంటాయి. థియేటర్లలో బిగ్ హిట్స్​గా నిలిచిన ఫిల్మ్స్​ను చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. వారి కోసం ఈ వారం కూడా పలు థియేట్రికల్ రిలీజెస్ వచ్చాయి. అందులో అన్నింటికంటే ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అంటే బాలీవుడ్ బాద్​షా షారుక్ నటించిన ‘డంకీ’ అనే చెప్పాలి. కింగ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా సైలెంట్​గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం స్పెషాలిటీ ఏంటంటే.. గతేడాది రెబల్​స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన ‘సలార్’కు పోటీగా రిలీజైంది. డిసెంబర్ 21న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది.

‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలతో 2023లో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ కొట్టిన షారుక్ ‘డంకీ’తో మరో సక్సెస్​ను అందుకన్నారు. అయితే ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాల స్థాయిలో ఇది విజయవంతం కాలేదు. బిగ్ ఎక్స్​పెక్టేషన్స్ మధ్య రిలీజైన ‘డంకీ’ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించినా.. ఆ రెండు మూవీస్ రేంజ్​లో ఆడియెన్స్​ను మెప్పించలేకపోయింది. అయితే ప్రభాస్ ‘సలార్’ మేనియాను తట్టుకొని రూ.470 కోట్లు కలెక్ట్ చేసింది. అలాంటి ‘డంకీ’ తాజాగా నెట్​ఫ్లిక్స్​లోకి వచ్చేసింది. వాస్తవానికి ఈ ఫిల్మ్ జనవరిలోనే ఓటీటీలోకి రావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వీలు కాలేదు. ఎలాంటి హడావుడి, కనీసం ప్రకటన కూడా లేకుండానే నేరుగా నెట్​ఫ్లిక్స్​లోకి వచ్చేసింది షారుక్ మూవీ.

Silently dunky into OTT

నెట్​ఫ్లిక్స్​లోనూ ‘సలార్​’తో పోటీపడనుంది ‘డంకీ’. ప్రభాస్ మూవీతో పాటు రణ్​బీర్ కపూర్ ‘యానిమల్’, సూపర్​స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’, న్యాచురల్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’ సినిమాలు నెట్​ఫ్లిక్స్ టాప్​-10లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు ‘డంకీ’తో షారుక్ అక్కడ హల్​చల్​ చేసేందుకు చూస్తున్నారు. థియేటర్లలో నార్త్ ఇండియాలో, బయటి దేశాల్లో మంచి సక్సెస్​ సాధించిన ఈ సినిమా ఓటీటీలోనూ సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమైంది. బిగ్ స్క్రీన్స్​లో ఈ ఫిల్మ్​ను మిస్సయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక, ‘డంకీ’ మూవీని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్​కుమార్ హిరానీ రూపొందించారు. ఈ సినిమాకు హిరానీతో పాటు షారుక్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ ఫిల్మ్​లో కింగ్ ఖాన్ సరసన తాప్సీ హీరోయిన్​గా యాక్ట్ చేసింది. మరి.. డీసెంట్ హిట్​గా నిలిచిన ‘డంకీ’ని ఓటీటీలో చూసేందుకు మీరు ఆసక్తిగా ఉన్నట్లయితే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Ooru Peru Bhairavakona Review: ఊరి పేరు భైరవకోన సినిమా రివ్యూ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి