iDreamPost
android-app
ios-app

Dejana Radanovic: ఇండియాపై నోరుపారేసుకున్న టెన్నిస్ స్టార్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!

  • Published Feb 16, 2024 | 9:08 PM Updated Updated Feb 16, 2024 | 9:08 PM

సెర్బియా టెన్నిస్ క్రీడాకారిణి రెజానా రాడనోవిచ్ భారతదేశంపై నోరుపారేసుకుంది. దీంతో నెటిజన్లు ఆమెను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. అసలేం జరిగిందంటే?

సెర్బియా టెన్నిస్ క్రీడాకారిణి రెజానా రాడనోవిచ్ భారతదేశంపై నోరుపారేసుకుంది. దీంతో నెటిజన్లు ఆమెను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. అసలేం జరిగిందంటే?

Dejana Radanovic: ఇండియాపై నోరుపారేసుకున్న టెన్నిస్ స్టార్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు!

క్రీడాకారులు తాము పాల్గొనే టోర్నీల కోసం వివిధ దేశాలు వెళ్లాల్సి వస్తుంది. దీంతో అక్కడి ప్రాంతాల్లో దొరికే ఫుడ్, వాతావరణం, హోటల్స్ లో బస లాంటి సౌకర్యాలు అన్ని దేశాల్లో ఒకే తీరుగా ఉండవు. ఒకవేళ బాగున్నా అవి కొంతమందికి నచ్చవు. తాజాగా ఓ టెన్నిస్ క్రీడాకారిని భారతదేశంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. భారతదేశంలో ఫుడ్, పరిశుభ్రత, ట్రాఫిక్ దారుణంగా ఉన్నాయంటూ కామెట్స్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ ప్లేయర్ ను ఓ ఆటాడుకుంటున్నారు. అసలేం జరిగిందంటే?

సెర్బియన్ టెన్నిస్ స్టార్ రెజానా రాడనోవిచ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్(ITF) టోర్నమెంట్ కోసం ఇండియాకు వచ్చింది. ఇక ఈ టోర్నీలో భాగంగా.. బెంగళూరు, పూణే, ఇండోర్, ముంబై లాంటి నగరాల్లో మ్యాచ్ లు ఆడింది. ఇక ఈ టోర్నమెంట్ లో వైదేహీ చౌదరి చేతిలో ఓడిపోయింది ఈ అమ్మడు. కాగా.. దేశం విడిచి పోతూపోతూ ఇండియాపై నోరుపారేసుకుంది. ఇండియాలో ఫుడ్, నీట్ నెస్, ట్రాఫిక్ పై కామెంట్స్ చేసింది. ఫుడ్ బాగోదని, ఇక్కడి ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండవని, విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందని, ఇంకోసారి ఇక్కడి రాను అంటూ ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దీంతో దేశ పరువుకు భంగం కలిగించేలా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందని నెటిజన్లు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 252 ర్యాంకులో ఉన్న నువ్వు మా ఇండియన్ చేతిలో ఓడిపోయి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నావా? అంటూ తిట్టిపోస్తున్నారు. కాగా.. మరో పోస్ట్ చేసి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. మ్యూనిచ్ కు వెళ్లి అక్కడి ఫొటోను షేర్ చేసి.. ఇక్కడ ఎంతో హాయిగా ఉంది.. 3 వారాలు ఇండియాకు వెళ్ళొచ్చిన వారికే ఇది అర్ధం అవుతుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇండియన్స్ మరింతగా రెచ్చిపోయారు. ఇంకోసారి దేశంలో అడుగుపెట్టొద్దు.. పెట్టనివ్వం అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కౌంటర్లు ఎక్కువ కావడంతో.. తన తప్పు తెలుసుకుని దిగొచ్చింది. నేను మాట్లాడింది అక్కడి ప్రజల గురించి కాదు.. ప్రాంతాల గురించి, అక్కడి ప్రజలు నాతో ఎంతో స్నేహంగా ఉన్నారని మరో పోస్ట్ చేసి.. వివాదాన్ని సద్దుమణిగేలా చేసింది. మరి ఇండియాపై సెర్బియా టెన్నిస్ ప్లేయర్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IND vs ENG: ఓలీ పోప్ ఔట్ పై వివాదం.. ఔటా? నాటౌటా?