iDreamPost
android-app
ios-app

డైరెక్టర్లకు అమ్మాయిల సప్లై.. అసలు విషయం బయటపెట్టిన సీనియర్ ఆర్టిస్ట్!

  • Published Apr 19, 2024 | 6:22 PM Updated Updated Apr 19, 2024 | 6:22 PM

Senior Artist Vizag Jagadeeswari: సినిమా ఇండస్ట్రీ అంటే అవకాశాలు, హిట్టులు మాత్రమే కాదు.. ఆరోపణలు, విమర్శలు కూడా ఉంటాయి. కాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ వివాదాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిపై సీనియర్ ఆర్టిస్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Senior Artist Vizag Jagadeeswari: సినిమా ఇండస్ట్రీ అంటే అవకాశాలు, హిట్టులు మాత్రమే కాదు.. ఆరోపణలు, విమర్శలు కూడా ఉంటాయి. కాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ వివాదాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిపై సీనియర్ ఆర్టిస్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Published Apr 19, 2024 | 6:22 PMUpdated Apr 19, 2024 | 6:22 PM
డైరెక్టర్లకు అమ్మాయిల సప్లై.. అసలు విషయం బయటపెట్టిన సీనియర్ ఆర్టిస్ట్!

సినిమా ఇండస్ట్రీ అంటే రంగు రంగుల ప్రపంచం మాత్రమే కాదు అంటారు. అవకాశాలు, అవకాశాల పేరిట మోసాలు కూడా ఉంటాయని ఎంతో మంది చెప్పారు. కాస్టింగ్ కౌచ్, మీటూ అంటూ చాలానే ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. అవకాశం కావాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాలి అంటూ కొందరు తారలు నేరుగానే ఒప్పుకున్నారు. ఇంకొంతమంది అయితే కమిట్మెంట్ ఇచ్చినా అవకాశాలు రావు అంటూ చెబుతుంటారు. అయితే ఇవి మాత్రమే కాకుండా.. కొందరిపై మరికొన్ని ఆరోపణలు ఉంటాయి. అమ్మాయిలని సప్లయ్ చేసి ఛాన్సులు కొట్టేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తారు. అయితే అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వైజాగ్ జగదీశ్వరీ ఓపెన్ కామెంట్స్ చేశారు. అసలు తనపై ఆ ఆరోపణలు ఎందుకు వచ్చాయో వివరించారు.

తెలుగు ప్రేక్షకులకు వైజాగ్ జగదీశ్వరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో తెలుగు సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేశారు. అయితే ఆమెపై ఎక్కువగా అమ్మాయిల సప్లయ్ చేసేది అంటూ రూమర్స్ వచ్చేవి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉండేవి. అయితే వీటిపై స్వయంగా వైజాగ్ జగదీశ్వరి స్పందించారు. అసలు తనపై అలాంటి వార్తలు ఎందుకొచ్చాయో వివరణ ఇచ్చారు. అంతేకాకుండా.. అవన్నీ అవాస్తవమని, తనపై కావాలని అలాంటి ఆరోపణలు, విమర్శళు చేసేవాళ్లంటూ క్లారిటీ ఇచ్చింది. పైగా తన ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పుకొచ్చింది.

jagadeeswari

వైజాగ్ జగదీశ్వరి మాట్లాడుతూ.. “నేను డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లయ్ చేస్తానంటూ వచ్చిన ఆరోపణలు అన్నీ పచ్చి అబద్ధాలు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బోరబండలో ఉండేదాన్ని. అక్కడే తొమ్మిదేళ్లు నివాసం ఉన్నాను. అయితే నాకు సినిమా ఆఫర్లు వచ్చినా వెళ్లడానికి రూట్లు తెలిసేవి కాదు. అందుకే మా దగ్గర్లో ఉండే అమ్మాయిలతో కలిసి సినిమా సెట్స్ కి, ఆఫీసులకు వెళ్లేదాన్ని. అలా నాతో రావడం వల్ల వారికి కూడా ఖర్చులు తగ్గేవి. నేను లక్షలు సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. నాకు నా టాలెంట్, నటనను బట్టే అవకాశాలు దక్కాయి. అయితే నేను నల్లగా, లావుగా, ముఖం మీద మచ్చలు ఉన్నా మంచి అవకాశాలు వస్తున్నాయని కుళ్లుతో అలాంటి నిందలు నాపై వేశారు.

నేను అమ్మాయిలతో కలిసి వెళ్తున్నానని నాపై రూమర్స్ పుట్టించారు. నేను ఆరోజుల్లో చాలానే సంపాదించుకున్నాను. కానీ, జాగ్రత్త చేసుకోక అంతా పోగొట్టుకుని ఇప్పుడు ఇలా పేదరికంలో మగ్గిపోతున్నాను. ఆస్తులు మిగలకపోయినా లక్షల్లో కొన్న చీరలు ఉన్నాయి. నేను డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లయ్ చేయడం ఎవరైనా చూశారా? అసలు నాపై వచ్చిన విమర్శలు, ఆరోపణలను నిరూపిస్తే.. నేను అమ్మాయిలను సప్లయ్ చేశాను అని రుజువు చేస్తే నేనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోతాను” అంటూ వైజాగ్ జగదీశ్వరి కామెంట్స్ చేశారు. మరి.. తనపై వచ్చిన విమర్శలకు నటి ఇచ్చిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet