iDreamPost

ఈ ఫోటోలో చిన్నారి ఓ స్టార్ హీరోయిన్.. సౌందర్యకి కూడా ఈమె మార్గదర్శి!

ఈ ఫోటోలో క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ఒకప్పటి స్టార్ హీరోయిన్. తెలుగు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ చందమామ.. ప్రస్తుతం ఎలా ఉందంటే..?

ఈ ఫోటోలో క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ఒకప్పటి స్టార్ హీరోయిన్. తెలుగు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన ఈ చందమామ.. ప్రస్తుతం ఎలా ఉందంటే..?

ఈ ఫోటోలో చిన్నారి ఓ స్టార్ హీరోయిన్.. సౌందర్యకి కూడా ఈమె మార్గదర్శి!

ఇండస్ట్రీలో ఓ తరంలో తెలుగు భామల హవా నడిచింది . ఆ తర్వాత ఢిల్లీ, ముంబయి భామలు.. హైదరాబాద్ గల్లీ బాట పట్టడం మొదలు పెట్టారు. మన ముక్కు, మొహం కాకపోయినా.. కొత్త భామలు, గ్లామరస్ పాత్రల్లో మెప్పించడంతో ఎగబడి చూశారు సినిమా అంటే పిచ్చి ఉన్న తెలుగు జనం. ఇప్పుడు మలయాళ ముద్దుగుమ్మల టైమ్ నడుస్తోంది. చూసేందుకు చక్కగా కుందనపు బొమ్మల్లా, తెలుగు అమ్మాయిల్లా కనిపించడంతో ఓన్ చేసేసుకుంటున్నారు ఇక్కడ ప్రేక్షకులు. అంతే కాదు స్టార్ డమ్ ఇచ్చేస్తున్నారు. నిత్యామీనన్ మొదలుకుని, సంయుక్త మీనన్ వరకు టాలీవుడ్ ఇండస్ట్రీని తమ నటన, కట్టుబొట్టుతో కట్టిపడేశారు. కానీ వీరందరి కన్నాముందే ఓ భామ టాలీవుడ్ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసేసింది. ప్రముఖ స్టార్ హీరోయిన్ రాధ తర్వాత అంతే క్రేజ్ తెచ్చుకుంది.

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని చూశారు కదా.. చక్కగా లెహంగా వేసుకుని.. చిన్న తిలకం పెట్టుకుని తదేకంగా చూస్తున్న ఈ పాపను గుర్తుపట్టారా.. ఒకప్పటి స్టార్ హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ చేసి హీరోయిన్‌గా మారి పీక్స్ స్టేజీకి వెళ్లింది. ఆమె మల్టీటాలెంటర్, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. ఆమె పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. ఆమె మేనత్తలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నటి.. తెలుగులో టాప్ హీరోలతో ఆడిపాడింది. ఇటీవల కాలంలో వెండితెరకు కాస్త దూరమైంది ఆమె. దక్షిణాది అన్ని భాషలతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా నటించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ..ఇప్పటికి బ్రహ్మచారిగానే మిగిలిపోయింది. కానీ ఓ బిడ్డను దత్తత తీసుకుని పెంచుకుంటోంది.

ఇంతకు ఆమె ఎవరంటే.. భరతనాట్యం డ్యాన్సర్, ప్రముఖ స్టార్ నటి శోభన. భక్త ధ్రువ మార్కేండయతో తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టిన శోభన.. నాగార్జున తొలి సినిమా విక్రమ్ మూవీతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రముఖ నటీమణులు రాగిణి, పద్మిణి, లలితలు ఆమె మేనత్తలు. ఆ వెంకటేశ్ సరసన అజేయుడు, త్రిమూర్తులు, బాలకృష్ణ మువ్వగోపాలుడు మంచి మార్కులు పడ్డాయి కానీ.. తెలుగు వారికి క్రష్ అయ్యింది మాత్రం అభినందన. ఇందులో సాంగ్స్ ఇప్పటికి చార్ట్ బస్టర్సే. ఇక చిరంజీవితో రుద్రవీణ, రౌడీ అల్లుడు చేసింది. ఇవే కాకుండా ఏప్రిల్ ఒకటి విడుదల, అప్పుల అప్పారావు, కోకిల, కన్నయ్య కిట్టయ్య, రెండిళ్ల పూజారి, రక్షణ, సూర్య పుత్రులు చేసింది. ఇదే హీరోయిన్‌గా తెలుగులో ఆఖరి సినిమా.

ఆ తర్వాత గేమ్ అనే చిత్రంలో మోహన్ బాబు భార్యగా నటించింది. తమిళ్, తెలుగులో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన చంద్రముఖి ఫస్ట్ వర్షన్‌లో నటించింది శోభననే. ఆమెను చూసి ఆ తర్వాత కన్నడలో సౌందర్య చేసింది. ఈ ఇద్దరి తర్వాత జ్యోతిక అదరగొట్టింది. ఇలా సౌందర్య, జ్యోతికలు ఆ క్యారెక్టర్ అద్భుతంగా పండించేందుకు మార్గదర్శకంగా మారింది ఈ నటి.  ప్రస్తుతం భరత నాట్యం డ్యాన్స్ మీదే ఫోకస్ పెట్టింది శోభన. ఇప్పుడు దాదాపు నాలుగేళ్ల తర్వాత మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. మోహన్ లాల్ మూవీలో యాక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి