iDreamPost

అసెంబ్లీలో రేపటిలోగా బలం నిరూపించుకోవాల్సిందే -సుప్రీం కోర్ట్

అసెంబ్లీలో రేపటిలోగా బలం నిరూపించుకోవాల్సిందే -సుప్రీం కోర్ట్

మధ్యప్రదేశ్ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ రేపు సాయంత్రం 5 గంటల్లోగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్ట్ తేల్చిచెప్పింది. బలపరీక్ష సమయంలో ఎలాంటి ప్రలోభాలు జరగకుండా మొత్తం ప్రక్రియను వీడియో లో రికార్డ్ చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బలపరీక్ష సమయంలో సభ్యులంతా చేతులు పైకెత్తడం ద్వారా సభ్యులకు కౌటింగ్ నిర్వహించి బలపరీక్షలో ఎవరు నెగ్గారనే విషయాన్ని నిర్ధారించాలని సుప్రీంకోర్ట్ ఆదేశించింది.

కాగా, జ్యోతిరాధిత్య సింధియాకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు 16 మంది కాంగ్రెస్ పార్టీ జారీచేసిన విప్ ని పాటించకుండా సభకు హాజరు కాకూడదనుకుంటే అది వారి వ్యక్తిగతమని, ఒకవేళ బలపరీక్షకు హాజరవ్వాలనుకుంటే మధ్యప్రదేశ్, కర్ణాటక ఇరు రాష్ట్రాల డీజీపీ వారికి పూర్తి భద్రత కల్పించాలని సుప్రీంకోర్ట్ ఆదేశించింది.

ఇదిలా ఉండగా మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుత బలబలాలను బట్టి 107 మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా ఉన్న బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి మార్గం సుగమమైనట్టుగానే భావించవచ్చు. అదేసమయంలో 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడడంతో కాంగ్రెస్ కి మద్దతిస్తున్న ఇతర సభ్యులను కలుపుకున్నా కాంగ్రెస్ బలం 100 దాటే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రేపు జరిగే విస్వాస పరీక్షలో కమలనాధ్ ప్రభుత్వం కుప్పకూలడం దాదాపు ఖాయమైనట్టే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి