iDreamPost

డిగ్రీ పాసైన వారికి లక్కీ ఛాన్స్.. 13,772 Bank ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లై చేసుకోండి

బ్యాంకు జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్. భారీ స్థాయిలో బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. డీగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను సాధించొచ్చు.

బ్యాంకు జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్. భారీ స్థాయిలో బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. డీగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలను సాధించొచ్చు.

డిగ్రీ పాసైన వారికి లక్కీ ఛాన్స్.. 13,772 Bank ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లై చేసుకోండి

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 13 వేలకు పైగా బ్యాంకు ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. బ్యాంక్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఇది లక్కీ ఛాన్స్. ప్రభుత్వ బ్యాంకుల్లో జాబ్ కొట్టి మంచి వేతనంతో లైఫ్ లో స్థిరపడిపోవచ్చు. మీరు డిగ్రీ పూర్తి చేసుకుని బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లైతే ఈ అవకాశాన్ని అస్సలు వదలకండి. ఇటీవల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ 9995 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దేశంలోని మొత్తం 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్, ఆఫీస్ అసిస్టెంట్, పీవో,మేనేజర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. మీరు డిగ్రీ పాసైతే చాలు బ్యాంకు ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.

ఐబీపీఎస్

ఐబీపీఎస్ ద్వారా 9995 ఉద్యోగాలతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 150 స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు , బ్యాంక్ ఆఫ్ బరోడాలో 627, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3000 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే 13,772 బ్యాంకు ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఐబీపీఎస్ రిలీజ్ చేసిన 9,995 గ్రూప్‌-ఎ ఆఫీస‌ర్ (స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌-బి ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,149 పోస్టులు భర్తీకానున్నాయి. అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. ఐబీపీఎస్ రిలీజ్ చేసిన పోస్టులకు దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 27, 2024. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు వయోపరిమితి 28 నుండి 18 సంవత్సరాలు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3,000 అప్రెంటిస్‌షిప్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ గతంలోనే ముగిసింది. తాజాగా మళ్లీ అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఈ ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్ రిక్రూట్ మెంట్ టెస్ట్ జూన్ 23న జరుగనున్నది.

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా 627 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కలిసి మొత్తం 627 ఖాళీలు ఉన్నాయి. రెగ్యూలర్ ప్రాతిపదికన 168 పోస్టులను, కాంట్రాక్ట్ ప్రాతిపదికన 459 పోస్టులను భర్తీ చేయనున్నది. పోస్టులను నుసరించి డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో జూలై 2 వరకు అప్లై చేసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

దిగ్గజ ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ (ఎస్ఓ)పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 150 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ, ఐఐబీఎఫ్‌ ఫారెక్స్‌ సర్టిఫికేట్‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో కనీసం రెండేళ్లు పని చేసిన అనుభవం ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 27. అభ్యర్థులు వయోపరిమితి 23 నుండి 32 సంవత్సరాలు కలిగి ఉండాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి