iDreamPost

SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ 2 స్కీమ్స్ పై వడ్డీ రేట్లు పెంపు

  • Published Jun 17, 2024 | 3:08 PMUpdated Jun 17, 2024 | 8:37 PM

దేశంలో అతిపెద్ద బ్యాంకు దిగ్గజం అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా తమ కస్టమర్లకు అదిరే శుభవార్త చెప్పింది. కాగా, ఎంపిక చేసిన టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. మరి ఆ వివరాలేంటో చూద్దాం.

దేశంలో అతిపెద్ద బ్యాంకు దిగ్గజం అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా తమ కస్టమర్లకు అదిరే శుభవార్త చెప్పింది. కాగా, ఎంపిక చేసిన టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. మరి ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Jun 17, 2024 | 3:08 PMUpdated Jun 17, 2024 | 8:37 PM
SBI కస్టమర్లకు గుడ్ న్యూస్..  ఆ 2 స్కీమ్స్ పై వడ్డీ రేట్లు పెంపు

దేశంలో ప్రముఖ అతిపెద్ద బ్యాంకు సెక్టార్ లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కూడా ఒకటి.అయితే ఈ బ్యాంకు దిగ్గజం తమ ఖాతాదారులకు ఎప్పటికప్పుడు పలు పథకాలను అందిస్తుందనే విషయం తెలిసిందే. ఇక ఈ పథకాల ద్వారా అధిక రాబడులను కూడా అందిస్తుంది. ఈ క్రమంలోనే చాలామంది తమ దగ్గర ఉన్న డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో ఈ స్టేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంటారు. అంతేకాకుండా.. మంచి రాబడి కావలనుకునే వారు సైతం ఈ స్టేట్ బ్యాంకు అందించిన స్కీమ్స్ లో డబ్బులను డిపాజిట్ చేస్తూ ఎక్కువ వడ్డీను పొందుతుంటారు.ఇక ఎప్పటిలానే.. తాజాగా స్టేట్ బ్యాంకు తమ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్తను చెప్పింది. ఇంతకి అదేమిటంటే..

అతిపెద్ద బ్యాంకు దిగ్గజం అయిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తాజాగా తమ కస్టమర్లకు అదిరే శుభవార్త చెప్పింది. కాగా,రూ. 3 కోట్ల లోపు ఉండే రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ కస్టమర్లకు సడెన్ సర్‌ప్రైజ్ అందించింది. అయితే కొత్తగా సవరించిన ఈ వడ్డి రేట్లను జూన్ 15, 2024 నుంచే అమలులోకి తీసుకొచ్చినట్లు ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది. ఇక  తాజా సవరణ ఆనంతరం ఎంపిక చేసిన టెన్యూర్ పై కస్టమర్లు అధిక వడ్డీ రేట్లు పొందుతారు. కాకపోతే ఈ వడ్డీ పెరిగిన టెన్యూర్ లో రూ.1 లక్ష జమ చేస్తే.. మెచ్యూరిటీ తర్వాత చేతికి ఎంత వస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

SBI

తాజాగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా డిపాజిట్లు పెంచేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే.. ఎంపిక చేసిన టెన్యూర్ పై 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లు పెంచింది. అంటే.. 180 రోజుల నుంచి 210 రోజుల టెన్యూర్‌పై 25 బేసిస్ పాయింట్లు వడ్డీ పెంచుతూ 6 శాతం నుంచి 6.25 శాతానికి వడ్డీ రేట్లు పెంచింది. దీంతో పాటు 211 రోజుల నుంచి ఏడాదిలోపు టెన్యూర్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ ఇస్తూ 6.25 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. ఇక ఆయా టెన్యూర్లపై సీనియర్ సిటిజన్లకు ఇప్పుడు అదనంగా 75 బేసిస్ పాయింట్లు వడ్డీ పొందవచ్చు. ఇలా చూసుకుంటే.. ఒక జనరల్ కస్టమర్ 180 రోజుల నుంచి 210 రోజుల టెన్యూర్ ఎంచుకుని రూ.1 లక్ష జమ చేస్తే.. దానికి 6.25 శాతం వడ్డీ లభిస్తుంది.

ఒకవేళ 210 రోజుల తర్వాత డబ్బులు తీసుకుంటే ఆపై మెచ్యూరిటీ తర్వాత చేతికి వడ్డీ రూ. 3,379 అందుతుంది. అలాగే వారు సీనియర్ సిటిజన్ అయితే వడ్డీ రేటు 6.75 శాతం వడ్డీ లభిస్తుంది. దీని ప్రకారం వడ్డీ రూ. 3,652 వరకు వస్తుంది. మరోవైపు 211 రోజుల నుంచి ఏడాదిలోపు టెన్యూర్ డిపాజిట్‍‌లో జనరల్ కస్టమర్ రూ.1 లక్ష జమ చేస్తే.. వారికి ఏడాది నాటికి  రూ. 6.50 శాతం వడ్డీ రేటుతో పాటు చేతికి వడ్డీ రూ. 6,208 అందుతుంది. ఇక సీనియర్ సిటిజన్ కు అయితే 7 శాతం వడ్డీ రేటుతో పాటు మెచ్యూరిటీ తర్వాత చేతికి రూ. 6,685 వరకు వడ్డీ లభిస్తుంది. ఇకపోతే ఇతర టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై  ఉండే వడ్డీ రేట్లపై మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. మరి, ఎస్బీఐ టెన్యూర్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లు పెంచడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి