iDreamPost

ప్రభాస్‌ని ఢీ కొట్టేది.. ఆ బాలీవుడ్ స్టార్ హీరోనా? ఏం స్కెచ్ సామి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ కల్కి 2898. జూన్ 27న రిలీజ్ కాబోతుంది. ఇవే కాకుండా డార్లింగ్ లైనప్స్ చూస్తే కళ్లు చెదరాల్సిందే. మారుతి, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్, హను రాఘవపూడి చిత్రాలున్నాయి. అయితే వీటిలో మోస్ట్ ఎవటైడ్ మూవీగా నిలుస్తుంది స్పిరిట్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ కల్కి 2898. జూన్ 27న రిలీజ్ కాబోతుంది. ఇవే కాకుండా డార్లింగ్ లైనప్స్ చూస్తే కళ్లు చెదరాల్సిందే. మారుతి, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్, హను రాఘవపూడి చిత్రాలున్నాయి. అయితే వీటిలో మోస్ట్ ఎవటైడ్ మూవీగా నిలుస్తుంది స్పిరిట్..?

ప్రభాస్‌ని ఢీ కొట్టేది.. ఆ బాలీవుడ్ స్టార్ హీరోనా? ఏం స్కెచ్ సామి

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 సినిమా టెన్షన్‌లో ఉన్నాడు. సలార్ మూవీ సాలీడ్ హిట్ కొట్టడంతో తన తదుపరి సినిమాలే భారీ అంచనాలే పెట్టుకున్నారు డై హార్ట్ ఫ్యాన్స్. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ లెవల్లో విడుదల కాబోతుంది కల్కి. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అశ్వనీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకుడు. సైన్స్ ఫిక్షనల్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి సంబంధించి ఒక్కొక్క అప్డేట్ ఇస్తోంది చిత్ర యూనిట్. బుజ్జిని పరిచయం చేయడం..ట్రైలర్ రిలీజ్.. సాంగ్ ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఈ శాంపిల్సే ఒకదానికి మించి ఒకటి ఉండటంతో మెంటలెక్కిపోతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ మూవీ అయిపోయిన వెంటనే.. మారుతి సినిమా స్టార్ట్ చేశాడు యంగ్ రెబల్ స్టార్. రాజా సాబ్ అంటూ ఈ సారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈసారి మాస్ ఎలివేషన్ తగ్గించి.. క్లాస్ టచ్ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. అలాగే సలార్ -2 కూడా మొదలు కావాల్సి ఉండగా.. ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తానని ప్రకటించడంతో .. శౌర్యాంగ పర్వానికి బ్రేకులు పడ్డాయి. అయితే సలార్-2 కాకుండా పిచ్చి అభిమానులు ఎవెటైడ్ మూవీగా చూస్తోంది.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ మూవీ కోసం. యానిమల్ సినిమా హిట్టుతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు దర్శకుడు. ప్రభాస్‌తో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు కొన్ని లీక్స్ చేస్తూ..అభిమానులకు బూస్టప్ అందిస్తున్నాడు సందీప్.

ఈ డిసెంబర్‌లో మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు గతంలో సందీప్ ప్రకటించారు. అలాగే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో ఈ ఆరడుగుల కటౌట్‌ను చూపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. అలాగే ఈ మూవీ కోసం కాస్టింగ్ కూడా సిద్ధం చేస్తున్నాడట దర్శకుడు. ఇదిలా ఉంటే.. ప్రభాస్‌తో తలపడేందుకు బాలీవుడ్ స్టార్ హీరోను ఫిక్స్ అయ్యాడట సందీప్. బీటౌన్ అగ్ర హీరో అక్షయ్ కుమార్‌ను ప్రతి నాయకుడి పాత్ర కోసం అతడ్ని సంపద్రించాడని,  స్క్రిప్ట్ వినిపించినట్లు తెలుస్తోంది. బౌండెడ్ స్క్రిప్టుతో మరోసారి కలిసి ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. అప్పటికీ నచ్చకపోతే మరో స్టార్ హీరోను కూడా సంప్రదించాలన్న యోచనలో ఉన్నాడట సందీప్. ఇప్పటికే యానిమల్ మూవీలో ఒకప్పటి స్టార్ హీరో బాబీడియోల్ విలన్ పాత్రలో మెప్పించిన సంగతి విదితమే. అక్షయ్ ఓకే అయితే బాలీవుడ్ కలెక్షన్లను కూడా కుమ్మేయచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి