iDreamPost

Sandeep Reddy Vanga: వాళ్లకు ఇచ్చిపడేసిన సందీప్ వంగా.. ఊరుకోనంటూ మాస్ వార్నింగ్!

  • Published Feb 17, 2024 | 1:01 PMUpdated Feb 17, 2024 | 1:01 PM

ఎప్పుడూ కూల్​గా ఉండే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తొలిసారి సీరియస్ అయ్యారు. వాళ్లకు ఓ రేంజ్​లో ఇచ్చిపడేశారు. అస్సలు ఊరుకోనంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

ఎప్పుడూ కూల్​గా ఉండే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తొలిసారి సీరియస్ అయ్యారు. వాళ్లకు ఓ రేంజ్​లో ఇచ్చిపడేశారు. అస్సలు ఊరుకోనంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

  • Published Feb 17, 2024 | 1:01 PMUpdated Feb 17, 2024 | 1:01 PM
Sandeep Reddy Vanga: వాళ్లకు ఇచ్చిపడేసిన సందీప్ వంగా.. ఊరుకోనంటూ మాస్ వార్నింగ్!

సందీప్ రెడ్డి వంగా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఓ సంచలనం. ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ తీయడంలో ఆయనకు ఎవరూ సాటిరారనే చెప్పాలి. యూత్ ఆడియెన్స్ పల్స్ పట్టుకున్న సందీప్ వంగా.. వాళ్లకు కిక్కిచ్చే సినిమాలు తీస్తుంటారు. లవ్, సెంటిమెంట్, రివేంజ్.. ఇలా ఆయన ఏ విషయాన్ని పట్టుకున్నా ఎక్స్​ట్రీమ్ లెవల్లో ప్రెజెంట్ చేస్తారు. ఇలా ప్రేమించే వాళ్లు కూడా ఉంటారా? అనేలా ఆయన చిత్రాల్లోని పాత్రలు బిహేవ్ చేస్తుంటాయి. సందీప్ వంగా సినిమాల్లో కథ, కథనం నార్మల్​గానే ఉంటాయి. కానీ పాత్రలు, వాటిని చూపించే తీరు, డైలాగులు, స్టోరీని బోల్డ్​గా చెప్పే విధానం ఫ్రెష్ ఫీలింగ్​ను ఇస్తాయి. ఈ కోవలో ఆయన నుంచి వచ్చిన ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’తో​ పాటు ‘యానిమల్’ బ్లాక్​బస్టర్స్​గా నిలిచాయి. వీటికి ఆడియెన్స్​ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అయితే తన సినిమాలకు సంబంధించి కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు సందీప్​ను విమర్శిస్తున్నారు. దీంతో ఆయన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఒకవేళ తనను విమర్శించేవాళ్లు, వేధించేవాళ్లు భారత్​లో ఆపితే హాలీవుడ్​కు వెళ్లిపోతానని హెచ్చరించారు సందీప్ వంగా. తనకు భాషా పరిమితులు లేవన్నారు. ‘సాధారణ ప్రజలు ఏమైనా అన్నా నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి అన్నీ తెలిసిన పాపులర్ యాక్టర్స్ ఇలా అనడం చాలా బాధేసింది. ఎవరైనా సరే ఇతరులను అనే ముందు వాళ్లు గతంలో ఏం చేశారో చూసుకొని అనాలి’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగా. కాగా.. క్రిటిక్స్, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖుల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ సందీప్ వంగా సినిమాలు సూపర్ హిట్‌ అవుతున్నాయి. ఆయన రీసెంట్ బ్లాక్​బస్టర్ ‘యానిమల్’ మూవీ లాంగ్ రన్​లో ఏకంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇన్ని కలెక్షన్స్ సాధిస్తున్నా, ప్రేక్షకులు ఆదరిస్తున్నా ఈ సినిమా చూసిన కొందరు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రం సందీప్ వంగాను క్రిటిసైజ్ చేస్తున్నారు.

‘యానిమల్’లో బోల్డ్ కంటెంట్, స్త్రీలపై విద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు, విమర్శకులు అంటున్నారు. ఇది ఆడియెన్స్ మీద చెడు ప్రభావం చూపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సందీప్ వంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన సినిమాలను ఇక్కడ ఆపితే హాలీవుడ్​కు వెళ్లిపోతానని స్పష్టం చేశారు. భాషలతో తనకు సంబంధం లేదని చెప్పారు. భోజ్‌పురి, కన్నడ, మలయాళం, పంజాబీతోపాటు ఇతర భాషల్లోనూ మూవీస్ చేస్తానని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చారు. ఇక, కెరీర్ విషయానికొస్తే.. ఆయన ప్రస్తుతం ‘యానిమల్’ పార్ట్ 2 పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ తర్వాతే రెబల్​స్టార్ ప్రభాస్​తో ‘స్పిరిట్’ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ‘యానిమల్ పార్క్’ను హిందీలో తీస్తున్న సందీప్ వంగా.. ‘స్పిరిట్’ను మాత్రం తెలుగులోనే తీయాలని అనుకుంటున్నారు. మరి.. తనను విమర్శిస్తున్న వారికి సందీప్ వంగా మాస్ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs ENG: వీడియో: ‘లగాన్’ షాట్​ను కాపీ కొట్టిన రూట్.. కానీ బుమ్రా దెబ్బకు..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి