iDreamPost
android-app
ios-app

ఆ సర్జరీ చేయించుకోమని నన్ను చాలా ఒత్తిడి చేశారు: సమీరా రెడ్డి

  • Published Jun 09, 2024 | 7:00 PM Updated Updated Jun 09, 2024 | 7:00 PM

Sameera Reddy: టాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి అందరికి సుపరిచితమే. అయితే సినిమాలకు దూరమై చాలాకాలం అయినా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్ లో ఉంటుదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సమీరా తన కెరీర్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాలు గురించి తాజాగా చెప్పుకొచ్చింది.

Sameera Reddy: టాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి అందరికి సుపరిచితమే. అయితే సినిమాలకు దూరమై చాలాకాలం అయినా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్ లో ఉంటుదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సమీరా తన కెరీర్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాలు గురించి తాజాగా చెప్పుకొచ్చింది.

  • Published Jun 09, 2024 | 7:00 PMUpdated Jun 09, 2024 | 7:00 PM
ఆ సర్జరీ చేయించుకోమని నన్ను చాలా ఒత్తిడి చేశారు: సమీరా రెడ్డి

హీరోయిన్ ‘సమీరా రెడ్డి’.. ఈపేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. కాగా, సమీరా తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా.. స్టార్ హీరోలా సరసన నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది . ఇకపోతే ఈమె మొదటిగా నరసింహ నాయుడు సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆశోక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సమీరా అందం,నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ క్రమంలోనే.. సమీరాకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవ సినిమాలో అవకాశం అందుకుంది. ఇక ఈ సినిమా కూడా మంచి సక్సెస్ ను అందుకోవడంతో సమీరాకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది.

ఇలా వరుస ఆఫర్లు అందుకుంటున్న సమయంలో సమీరా.. 2014లో అక్షయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే నటనకు దూరమైన సమీరా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే.. తాజాగా సమీరా నటిగా ఉన్నప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి గుర్తు చేసుకుంటూ చెప్పుకొచ్చింది. కాగా,  సమీరా  నటిగా ఉన్నప్పుడు తన శరీరంలో చాలా మార్పులు వచ్చాయని తెలపింది. దీని వలన కొంతమంది తనని ఏకంగా సర్జరీ చేయించుకోవాలని సలహా ఇచ్చినట్లు వెల్లడించింది. కాగా, ఆ సమయంలో నేను చాలా బాధపడ్డానని, పైగా చాలా ఒత్తిడికి గురైయ్యనని వెల్లడించింది.

ఈ సందర్భంగా సమీరా మాట్లాడుతూ.. ‘నా కెరీర్లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉన్నప్పుడు నాపై చాలా ఒత్తిడి పేరిగింది. ముఖ్యంగా కొంతమంది బూబ్ జాబ్ సర్జరీ (బ్రెస్ట్ ఇంప్లాంటేషన్) చేయించుకోమని సలహా ఇచ్చారు. అందరు చేయించుకుంటున్నారు కదా.. మీకేమైందంటూ అడిగేవారు. అంతేకాకుండా.. అందరూ చేయించుకుంటున్నారు కదా.. మీకు ఏమైదంటూ అడిగేవారు. ఇలా సర్జరీ చేసుకోమని నాపై చాలా ఒత్తిడి తెచ్చారు. కానీ నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే.. మన జీవితం ఎలా ఉంటుతో తెలియదు. అలా అని నేను నేను ప్లాస్టిక్ సర్జరీ, బొటాక్స్ చేయించుకునే వారిని తప్పుపట్టను. అలా అని నా విషయంలో నా సమస్యను నేను అంతర్గతంగానే పరిష్కరించుకోగలను’ అని చెప్పుకొచ్చింది.

ఇక సమీరా రెడ్డి సినిమాల విషయానికొస్తే..ఈమె తెలుగులో మూడు సినిమాల్లోనే హీరోయిన్ గా నటించింది. కాగా, చివరిగా ఆమె 2012లో విడుదలైన కృష్ణం కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో ఓ పాటలో మెరిసింది. ఇక  ఎక్కువ శాతం ఈమె హీందిలో నటించింది. దాంతో పాటు తమిళ్, మలయాళం, బెంగాళ్ వంటి భాషల్లో కూడా సమీరా నటించింది. మరి, సమీరాకు ఎదురైన చేదు అనుభవాల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş