iDreamPost

Samantha: మరోసారి ఆశ్రమం బాటపట్టిన సమంత… అసలు కారణం అదేనంటా?

స్టార్ హీరోయిన్ సమంత గురింతి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సినిమాల్లో తన అందం, అభినయంతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. అలాంటి ఈ అమ్మడు తాాజాగా మళ్లీ ఆశ్రమ బాట పట్టింది.

స్టార్ హీరోయిన్ సమంత గురింతి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సినిమాల్లో తన అందం, అభినయంతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. అలాంటి ఈ అమ్మడు తాాజాగా మళ్లీ ఆశ్రమ బాట పట్టింది.

Samantha: మరోసారి ఆశ్రమం బాటపట్టిన సమంత… అసలు కారణం అదేనంటా?

సినిమాల్లో తమ అందచందాలతో  ప్రేక్షకులను హీరోయిన్లు అలరిస్తుంటారు. అంతేకాక తమ హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంటారు. ఇలా మూవీల్లో ఎంతో గ్లామర్స్ పాత్రల్లో కనిపించే హీరోయిన్లు కొందరు సడెన్ గా ఆధ్యాత్మిక వాతావరణంలో కనిపిస్తుంటారు. వారిలో ఉన్న మరో యాంగిల్ ను చూపిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఆధ్యాత్మిక భావనలో తమ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు మాత్రం అప్పుడప్పుడు మనస్సు ప్రశాంత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. అలాంటి వారిలో మోస్ట్ బ్యూటీపుల్ హీరోయిన్ సమంత ఒకరు. గతంలో ఆశ్రమంలో గడిపిన ఆమె మళ్లీ ఆ బాట పట్టింది.

స్టార్ హీరోయిన్ సమంత గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక సినిమాల్లో తన అందం, అభినయంతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇటీవలే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమాలో నటించింది. అంతేకాక తరచూ ఆరోగ్య సమస్యలతో తరచూ వార్తలో నిలుస్తుంటారు. అంతేకాక హెల్త్ ఇష్యూ కారణంగా సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. అయినా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ ఫుల్ యాక్టీవ్ గా ఉంది. త‌న‌కు సంబంధించిన అప్‌డేట్స్‌తో పాటు ఫొటోలు, వీడియోల‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె తాజాగా న‌టించిన ‘సిటాడెల్’ సిరీస్ స్ట్రీమింగ్‌కు సిద్దంగా ఉంది. ఇదే స‌మ‌యంలో తన సొంత నిర్మాణ సంస్థలో ‘మా ఇంటి బంగారం’ అనే ఓ సినిమాను చేయనున్నట్లు ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా సమంత కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఓసారి ఆశ్రమంకి వెళ్లిన సామ్.. మళ్లీ  బాట ప‌ట్టింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ కి సమంత వెళ్ళింది. అక్క‌డ సామ్  మెడిటేషన్ చేస్తున్న పలు ఫొటోలని తన  ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. మనలో చాలామంది గురువు లేదా మెంటార్‌ కోసం వెతుకుతుంటారని, మ‌న లైఫ్ కి వెలుగు చూపుతూ, స‌రైన మార్గంలో న‌డిపించే వ్య‌క్తిని క‌నుగొడం అనేది చాలా ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భమని ఫోటోలను పోస్ట్ చేస్తూ రాసుకొచ్చింది.

మనకు జ్ఞానం కావాలంటే ప్రపంచంలో వెతకాలని తెలిపింది. అందుకు కారణం కూడా నిత్య జీవితంలో జరిగే సంఘటనల వల్ల లభిస్తోంది తెలిపింది. ఇది చాలా సులభమని మీరు ఆలోచిస్తున్నారు..కానీ తాను అలా  కానే కాదని, జ్ఞానం సంపాదించుకోవ‌డం కోసం ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది. జ్ఞానం పొంద‌డంమే కాదు, అలా సంపాదించిన జ్ఞానాన్ని ఆచరణలో పెడటం కూడా ఎంతో ముఖ్యమంటూ శామ్ రాసుకొచ్చింది. ప్రస్తుతం స‌మంత పోస్ట్  సోషల్ మీడియాలో  వైర‌ల్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి