iDreamPost

Salaar: రేపే సలార్ ట్రైలర్ విడుదల…ప్రభాస్ ఫ్యాన్స్‌ని పట్టుకోలేం

రేపు యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు పండుగ. ఎందుకంటే.. మోస్ట్ వెయిటెడ్ మూవీ సలార్ ట్రైలర్ విడుదల కాబోతుంది కాబట్టి. ఎప్పటి నుండో అతడి రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు డై హార్డ్ ఫ్యాన్స్.

రేపు యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు పండుగ. ఎందుకంటే.. మోస్ట్ వెయిటెడ్ మూవీ సలార్ ట్రైలర్ విడుదల కాబోతుంది కాబట్టి. ఎప్పటి నుండో అతడి రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు డై హార్డ్ ఫ్యాన్స్.

Salaar: రేపే సలార్ ట్రైలర్ విడుదల…ప్రభాస్ ఫ్యాన్స్‌ని పట్టుకోలేం

రేపు ప్రపంచం దద్దరిల్లబోతోంది. ప్రభాస్ అభిమానులు అదిరిపోతారు. నార్మల్ సినీ గోయర్స్ అయితే విపరీతమైన వ్యామోహంలో పడబోతున్నారు. ఎందుకంటే రేపు సాయంత్రం 7.19 నిమిషాలకి ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన సలార్ సినిమా ట్రైలర్ విడుదల కాబోతోంది. ఇంతకు ముందు జూలై నెలలో సలార్ టీం రిలీజ్ చేసిన టీజర్ సినిమా మీద అంతులేని క్రేజ్‌ని కుమ్మరించింది ప్రభాస్ ఇంట్రడక్షన్, వెంటనే ఫాలో అయిన డైలాగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌నే కాదు, జనరల్ ఆడియన్స్‍ని కూడా పిచ్చెక్కించింది. డిసెంబర్ 22న తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషలలో ప్రపంచవ్యాప్తంగా సలార్ స్క్రీన్స్ మీద ప్రత్యక్షం కాబోతూండగా, రేపు రిలీజ్ అవుతోన్నట్రైలర్.. సలార్ సినిమా మీద అంచనాలను ఆకాశానికి ఎత్తుతోంది.

కెజీఎఫ్ క్రియేట్ చేసిన భీభత్సం తర్వాత వెంటనే ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాగా సలార్ మొదటనుంచీ అందరి గుండెల్లో దడ పుట్టిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్లో. ముందే రిలీజ్ అయిన టీజర్ నిజంగానే అందరినీ టీజ్ చేసి పారేయగా, అందులో సలార్ ఫుల్ లెంత్ యాక్షన్, అదీ ప్రశాంత్ నీల్ స్టయిల్ యాక్షన్ ఫీవర్ మొత్తం నిండి ఉందన్న వాస్తవం ప్రపంచాన్ని ప్రభంజనంలా కుదిపేసింది. ముఖ్యంగా ఇంతకు ముందు వచ్చిన ప్రభాస్ చిత్రాలు సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినీ అభిమానులకు, ముఖ్యంగా ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ని నిరాశలో ముంచెత్తడంతో, ఇప్పుడు సలార్ అందరిలో కొత్త ఆశలను, ఆవేశాన్ని నింపుతోంది.

ఇద్దరు ఆత్మీయమిత్రులు బద్ద శత్రువులుగా మారిపోయిన కథలను మనం ఇంతకు ముందు కొన్ని చూశాం. సలార్ కూడా ఇప్పుడు అదే కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో కూడా ప్రభాస్, పృధ్వీరాజ్ సుకుమారన్ స్నేహితులుగా కనిపించడంతో పాటు, ఇద్దరి మధ్య వైరం, శత్రుత్వం ఏ విధంగా కథను నడిపించబోతోంది, ప్రశాంత్ నీల్ రూపకల్పనలో ఆ సన్నివేశాలు ఏ విధంగా రక్తి కట్టబోతున్నాయన్నదే మనం వేచి చూడాల్సిన బ్యాలెన్స్.

సుమారు ఆరు గంటల నిడివితో రూపొందిన సలార్ రెండు పార్ట్స్‌లో ధియేటర్స్‌కి రాబోతోంది. రేపు విడుదల కాబోతూన్న ట్రైలర్ సలార్ పార్ట్ 1 కి సంబంధించినది. ఫ్రభాస్, పృధ్వీరాజ్, టిను ఆనంద్, శ్రుతి హాసన్, జగపతిబాబు, సప్తగిరి ఇందులోని తారాగణం. ఈ మధ్య రోజుల్లో ప్రభాస్ రేంజ్‌కి తగిన సరైన హిట్ పడకపోవడంతో గుండె జార్చుకున్న ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేస్తాం సలార్ సినిమాతో అన్న గట్టి నమ్మకంతో ఉన్నారు.

                                                                                                                                                                                      – నాగేంద్ర కుమార్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి