iDreamPost

Salaar Promotions: సలార్ సైలెన్స్.. ఇలా అయితే రీ సౌండ్ కష్టమే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా రానున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఓ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా రానున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఓ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Salaar Promotions: సలార్ సైలెన్స్.. ఇలా అయితే రీ సౌండ్ కష్టమే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సిరీస్ ల ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారారు.  ఆ సినిమాలతో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగింది. తాజాగా ఆయన నటిస్తోన్న సినిమా సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత నీల్.. ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే విడుదల ట్రైలర్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్లు మాత్రం చాలా స్లోగా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇలా అయితే థియేటర్లలో సలార్  మూవీ సైలెన్స్ తప్పా..రీ సౌండ్ కష్టమే వార్త వినిపిస్తోంది.

సాధారణంగా ప్రభాస్ సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద రీసౌండ్ వస్తుంది. ఆయన సినిమాలు హిట్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబడుతుంటాయి.  ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో సలార్ పార్ట్-1 సీజ్ ఫైర్ థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  కానీ ఇప్పటి వరకు మూవీ ప్రమోషన్లు పరంగా పెద్దగా సౌండ్ లేకపోవండ ఫ్యాన్సు కంగారు పెడుతోంది. ప్రీ రిలీజ్ వేడుక జరుపుతారనే ఆశలు కూడా వారిలో  సన్నగిల్లుతున్నాయి. ఒక వేళ ఈ వెంటే జరిపే ఉద్దేశమే ఉంటే.. ఈపాటికే అన్ని పరిమిషన్లు తీసుకునే వారు కదా.. అలాంటివి ఇప్పటికైతే రాలేదనే టాక్ వినిపిస్తోంది.

కంటెంట్ మీద నమ్మకం ఉండటం మంచిదే. కానీ దాన్ని సరైన రీతిలో జనం దాకా తీసుకెళ్తే అద్భుతాలు జరుగుతాయి. గతంలో ప్రభాస్ నటించిన సినిమాలు, ఇటీవల విడుదలైన యానిమల్  సినిమాలో అందుకు చక్కటి ఉదాహరణ. ఈ సినిమాలో ఎంత ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఉన్నా సరే.. ఆ బ్రాండ్ ఓపెనింగ్ మూడు రోజుల వరకే పని చేస్తుంది. ఆ తరువాత మాట్లాడేది సినిమా మాత్రమే. సలార్ మూవీ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ అడపాదడపా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ పూర్తి కిక్ ఇచ్చే మెటీరియల్ ఏదీ కూడా బయటికి రాలేదు. సలార్ టైలర్ పైగా కెజీఎఫ్ తరహాలో ఉందనే డివైడ్ కామెంట్స్ వినిపించాయి. వీటికి కూడా సరైన సమాధానం చెప్పాలంటే ఇంకో వెర్షన్ వదలాలి.

అంతేకాక సినిమా ప్రమోషన్ ఎంత చేస్తే.. థియేటర్లలో రీ సౌండ్ అదే స్థాయిలో ఉంటుందనే విషయం మనందరికి తెలిసిందే. అలా బాగా ప్రమోషన్ చేసిన ప్రభాస్ సినిమాలో బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేసిన విషయం మనందరికి తెలిసిందే. అందుకు ప్రధాన కారణంగా ప్రభాస్ చరిష్మా ఒకటైతే.. ఆ మూవీలకు చేసిన ప్రమోషన్ మరో కారణం. కాబట్టి సలార్ విషయంలో అలాంటి ప్రమోషన్లు ఇప్పటి వరకు ఏమిలేవు. దీంతో సలార్ సినిమా సైలెన్స్ గానే ఉంటుందా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్లు సరిగ్గా చేయకుంటే.. ప్రభాస్ సినిమాకు రీసౌండ్ కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి