iDreamPost

బాబుకు మెడికల్ రిపోర్టు ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుల్లో జైలుకు వెళ్లి.. మధ్యతర బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు ఆరోగ్య విషయంపై వైఎస్సాఆర్ సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుల్లో జైలుకు వెళ్లి.. మధ్యతర బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు ఆరోగ్య విషయంపై వైఎస్సాఆర్ సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

బాబుకు మెడికల్ రిపోర్టు ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టై జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దాదాపు 52 రోజుల పాటు ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయనకు అనారోగ్య కారణంగా హైకోర్టు మధ్యతర బెయిల్ మంజూరు చేసింది. ఇలా ఆరోగ్య సమస్యలను సాకుగా చూపి.. చంద్రబాబు బయటకు వచ్చారని, ఆయన బయట ఉన్న లోపల ఉన్న పెద్దతేడా లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా స్కిల్ స్కామ్  కేసులో చంద్రబాబు ప్రధాన బెయిల్ కోసం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.  చంద్రబాబుకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని ఆయన తరపు లాయర్లు కోర్టులు తెలిపారు. చంద్రబాబు వ్యవహారంపై వైఎస్సాఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబు హెల్త్ రిపోర్టుపై ఎల్లో మీడియా హడావుడి చేస్తోందని ఆయన మండిపడ్డారు.

గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశంలో  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అనారోగ్యంతో ఉన్నప్పుడు కోర్టును రిక్వెస్ట్‌ చేయొచ్చు.. కోర్టు అనుమతిస్తే బెయిల్‌ వస్తుందని, ఆ కారణంతోనే చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్‌ వచ్చిందని సజ్జల అన్నారు. ఇప్పుడు ఆ బెయిల్‌పై మరికొంత కాలం బయట ఉండేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. జైల్లో ఉన్నంతసేపు ప్రాణాంతక వ్యాధులున్నాయంటూ ప్రచారం చేశారు. బెయిల్ రాగానే జైలు నుంచి ర్యాలీ పేరుతో హంగామా చేశారని ఆయన అన్నారు.

అసలు చంద్రబాబుకు మెడికల్‌ రిపోర్ట్‌ ఇచ్చింది వైద్యులా లేక రాజకీయ నేతలా?, ఆయనకు నిజంగా ఆ పరిస్థితి ఉంటే వెంటనే ‍చికిత్స ఇవ్వాలని సజ్జల పేర్కొన్నారు. చంద్రబాబు జైలులో ఉన్నా బయట ఉన్నా తమకేమి ఇబ్బంది లేదని సజ్జల స్పష్టం చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో స్కాం జరిగిందన్న విషయం పక్కకి పోతోందని అభిప్రాయ పడ్డారు. ఈ స్కాం తాను చేయలేదని మాత్రం చంద్రబాబు చెప్పలేకపోతున్నారని, ఆయన తరపు లాయర్లు కూడా స్కాంపై వాదించడం లేదని సజ్జల పేర్కొన్నారు. మేనిఫెస్టో గురించి మమ్మల్ని ప్రశ్నించే ముందు చంద్రబాబు సమాధానం చెప్పాలని, మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుదే అంటూ సజ్జల ధ్వజమెత్తారు.

ప్రస్తుతం చంద్రబాబు షరతులతో కూడిన మధ్యతర బెయిల్ పై బయట ఉన్నారు.  కంటి చికిత్స కోసమని హైకోర్టులో మధ్యతర బెయిల్ కి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 28 వరకు ఆయన బెయిల్ పై బయట ఉండనున్నారు.  ఇక చంద్రబాబుకు సంబంధించిన వివిధ కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయి.  ఈ కేసుల్లో సీఐడీ కూడా దర్యాప్తు వేగవంతం చూస్తుంది. ఇటీవలే  మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. స్కిల్ స్కామ్ లోని రూ.27 కోట్లు.. టీడీపీ ఖాతాలోకి వచ్చినట్లు వైసీపీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. మరి.. చంద్రబాబుపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి