iDreamPost
android-app
ios-app

‘బ్రో’ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న సుప్రీం హీరో!

  • Author ajaykrishna Published - 11:39 AM, Tue - 18 July 23
  • Author ajaykrishna Published - 11:39 AM, Tue - 18 July 23
‘బ్రో’ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న సుప్రీం హీరో!

మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్.. ఈ ఏడాది విరూపాక్ష మూవీతో సాలిడ్ కంబ్యాక్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అనంతరం.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’ మూవీ చేశాడు. ఇది తమిళ హిట్ ‘వినోదయ సితం’ మూవీకి రీమేక్. ఈ సినిమాని నటుడు, దర్శకుడు సముద్రఖని తెరకెక్కించారు. కాగా.. బ్రో మూవీ జులై 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈసారి ఒకే సినిమాలో మామ అల్లుళ్ళ సందడి మామూలుగా ఉండదు అని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే బ్రో నుండి విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ అంతా మూవీపై మోస్తరు అంచనాలు అయితే క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.

ఇక తేజ్ కి యాక్సిడెంట్ నుండి కోలుకున్నాక విరూపాక్షతో గ్రాండ్ రీఎంట్రీ లభించినప్పటికీ.. తన మాటలో, డ్యాన్స్ మూమెంట్స్ లో మునుపటి హుషారు, గ్రేస్ కనిపించడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ్.. తన డ్యాన్స్ స్కిల్స్ పై స్పందించాడు. నిజానికి బైక్ యాక్సిడెంట్ తర్వాత తేజ్.. కోలుకొని రీఎంట్రీ ఇవ్వడమే పెద్ద టాస్క్. అలాంటిది అతని డ్యాన్స్ మూమెంట్స్ గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు. అయితే.. తన డ్యాన్స్ లో లోపం ఉందని.. ఆ ప్రమాదం నుండి కోలుకున్నా ట్రీట్మెంట్, మెడిసిన్స్ వల్ల ఇంకా బాడీలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని తేజ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

తేజ్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడున్న నా డ్యాన్స్ మూమెంట్స్ చూసి.. ఫ్యాన్స్ మాత్రమే కాదు నేను కూడా నిరాశ చెందాను. యాక్సిడెంట్ నుండి పూర్తిగా కోలుకున్నప్పటికీ.. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలాగని దాన్ని సాకుగా చెప్పను. తప్పకుండా ఫ్యాన్స్ కోరుకునే విధంగా.. ఇంతకుముందు కంటే ధీటుగా డ్యాన్స్ చేస్తాను. కాకపోతే కొంచం టైమ్ పడుతుంది. యాక్సిడెంట్ తర్వాత కనీసం మాట రాలేదు. కానీ.. ఇప్పుడు మాట్లాడుతున్నా. అసలు ప్రాబ్లెమ్ గాయాల వల్ల కాదు. కోమాలో ఉన్నప్పుడు నాకు స్టెరాయిడ్స్ ఇచ్చారు. అవి నా బాడీపై చాలా ప్రభావం చూపాయి. వాటి వల్ల ఫిజికల్ ఫిట్నెస్ కోల్పోయాను. తిరిగి ఫిట్నెస్ పొందుతాను.. ప్రెజెంట్ దానిపైనే ఫోకస్ పెట్టాను.’ అని చెప్పాడు. అయితే.. తేజ్ నెక్స్ట్ మూవీ సంపత్ నందితో చేయనున్నాడు. సో.. ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఆరు నెలలపైనే టైమ్ పడుతుందట. సో.. బ్రో రిలీజ్ తర్వాత తేజ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తన ఫిట్నెస్, ఇతర ఫిజికల్ ప్రాబ్లెమ్స్ పై ఫోకస్ పెట్టబోతున్నాడని సమాచారం. మరి తేజ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by WAWA ORIGINALS (@wawa_originals)

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPokerklasPokerklasPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasKulisbet girişmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis