iDreamPost
android-app
ios-app

సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. షార్ట్ ఫిల్మ్ చేస్తున్న సుప్రీం హీరో!

  • Author ajaykrishna Updated - 01:48 PM, Thu - 20 July 23
  • Author ajaykrishna Updated - 01:48 PM, Thu - 20 July 23
సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. షార్ట్ ఫిల్మ్ చేస్తున్న సుప్రీం హీరో!

మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్.. ఈ ఏడాది విరూపాక్ష సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ తర్వాత కోలుకొని.. తేజ్ చేసిన మొదటి సినిమా ఇది. పైగా రీఎంట్రీతోనే వంద కోట్ల క్లబ్ లో చేరాడు తేజ్. ఆ సినిమా తర్వాత వెంటనే.. తన మామ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో’ అనే మూవీ చేశాడు. అతి తక్కువ టైంలో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా.. జులై 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందుకు తగ్గట్టుగా మేకర్స్ సాంగ్స్ రిలీజ్ చేసి.. ప్రమోషన్స్ ప్రారంభించారు. అయితే.. బ్రో మూవీ రిలీజ్ తర్వాత దాదాపు ఆరు నెలల వరకు తేజ్ సినిమాల నుండి బ్రేక్ తీసుకోబోతున్నాడు. పైగా ఈ గ్యాప్ లో తను ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలిపాడు.

యాక్సిడెంట్ తర్వాత తన ట్రీట్మెంట్ తాలూకు ఎఫెక్ట్ ఇంకా బాడీపై ఉందని.. అందుకే తన డ్యాన్స్ మూవ్స్ కూడా సంతృప్తికరంగా లేవని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు తేజ్. మొదట్లో మాట రాలేదు.. ఇప్పుడు ఆలా మాట్లాడగలుగు తున్నాడు. అదే విధంగా.. కొన్నాళ్ళు తన ఫిట్నెస్ పై ఫోకస్ పెడితే.. తిరిగి మళ్లీ ఎప్పటిలా డ్యాన్స్, ఆ హుషారు వచ్చేస్తుందని అంటున్నాడు. నిజానికి తేజ్ డ్యాన్స్, కామెడీ టైమింగ్, డైలాగ్స్ కి ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ ఉంది. కానీ.. విరూపాక్ష, బ్రో సినిమాల సాంగ్స్ లో ఆ హుషారు కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. తన డ్యాన్స్ మూమెంట్స్ విషయంలో తాను కూడా నిరాశ చెందినట్లు తేజ్ చెప్పేశాడు.

అందుకోసం చాలా ఫిట్నెస్ ని గైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో.. అప్పుడు మళ్లీ తాను మునుపటిలా హుషారుగా గ్రేస్ తో డ్యాన్స్ చేయగలను అని చెబుతూ ప్రామిస్ చేశాడు. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. తేజ్ తీసుకోబోతున్న ఆరు నెలల గ్యాప్ లో ఓ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఆ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కూడా పూర్తయిందని.. త్వరలో దానికి సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటి.. నిజంగా షార్ట్ ఫిల్మ్ యేనా లేక వెబ్ ఫిల్మా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ఈ వివరాలేవి చెప్పలేదుగానీ.. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని హింట్ ఇచ్చాడు తేజ్. ఎలాగో బ్రేక్ తీసుకుంటున్నాడు కదా.. కనీసం ఆ బ్రేక్ ని షార్ట్ ఫిల్మ్ అయినా కవర్ చేస్తుందేమో చూడాలి. మరి సాయి తేజ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetjojobetTophillbet girişcasibomJojobet GirişcasibomcasibomcasibomjojobetjojobetMadridbetMadridbetcasibom girişmarsbahis girişganobetpokerklasjojobetCasibomJojobetGrandPashaBet destekDeneme bonusu veren siteler 2026jojobet girişCasibom GirişGrandPashaBet ŞikayetJojobet GirişJojobet Giriş