iDreamPost
android-app
ios-app

కోహ్లీ 49వ సెంచరీ చేయడంపై స్పందించిన సచిన్‌! 365 రోజులు పట్టిందంటూ..

  • Published Nov 06, 2023 | 11:30 AM Updated Updated Nov 06, 2023 | 11:30 AM

వరల్డ్‌ కప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సెంచరీతో సత్తా చాటాడు. ఈ సెంచరీతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ రికార్డును సమం చేశాడు. తన రికార్డు సమం కావడంపై సచిన్‌ స్పందిస్తూ.. ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వరల్డ్‌ కప్‌లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ సెంచరీతో సత్తా చాటాడు. ఈ సెంచరీతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్‌ రికార్డును సమం చేశాడు. తన రికార్డు సమం కావడంపై సచిన్‌ స్పందిస్తూ.. ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 06, 2023 | 11:30 AMUpdated Nov 06, 2023 | 11:30 AM
కోహ్లీ 49వ సెంచరీ చేయడంపై స్పందించిన సచిన్‌! 365 రోజులు పట్టిందంటూ..

టీమిండియాకు వరల్డ్‌ కప్‌లో ఎదురేలేకుండా పోయింది. టోర్నీలో ఆరంభం నుంచి ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న రోహిత్‌ సేనకు గట్టి పోటీ ఇచ్చే జట్టులా కనిపించింది సౌతాఫ్రికా. ఎందుకంటే ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ అంత దుర్భేద్యంగా ఉంది. పైగా డికాక్‌ సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు, క్లాసెన్‌, డస్సెన్‌, మిల్లర్‌ సైతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. దీంతో.. టీమిండియా బౌలింగ్‌కు, సౌతాఫ్రికా బ్యాటింగ్‌ భీకరపోరు జరిగే ఛాన్స్‌ ఉందని, చాలా రోజుల తర్వాత భారత జట్టుకు ఓ మంచి పోటీదారు ఎదురువుతున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు భావించారు. కానీ, టీమిండియా, సౌతాఫ్రికాను సైతం మడతపెట్టేసింది. రోహిత్‌ సేనకు కనీస పోటీ ఇవ్వలేకపోయింది ప్రొటీస్‌ జట్టు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఎప్పటిలాగే రోహిత్‌ శర్మ జట్టు ప్లైయింగ్‌ స్టార్ట్‌ ఇచ్చాడు. తుపాన్‌ వేగంతో బ్యాటింగ్‌ మొదలు పెట్టిన రోహిత్‌.. కేవలం 24 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సులతో 40 పరుగులు చేశాడు. మరోవైపు గిల్‌ సైతం వేగంగా ఆడాడు. రోహిత్‌ అవుటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ సైతం పవర్‌ ప్లేలో వేగంగానే ఆడాడు. రోహిత్‌ ఇచ్చిన సూపర్‌ స్టార్ట్‌తో టీమిండియా పవర్‌ప్లేలో ఏకంగా 90 పరుగులు చేసింది. అయితే.. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుండంతో కోహ్లీ-గిల్‌ తర్వాత కాస్త నెమ్మదించారు. గిల్‌ కూడా అవుటైపోవడంతో.. అయ్యర్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇద్దరి మధ్య మంచి భాగస్వామ్యం నమోదు అయింది. కానీ, అయ్యర్‌ అవుట్‌ తర్వాత కేఎల్‌ రాహుల్‌ కూడా పెద్దగా పరుగులు చేయకుండా అవుట్‌ అయ్యాడు. చివర్లో సూర్యకుమార్‌ యాదవ్‌, జడేజా బ్యాట్‌ ఝుళిపించడంతో టీమిండియా 300 మార్క్‌ను దాటింది. అయితే.. వన్‌ డౌన్‌లో వచ్చి, తన వికెట్‌ ఇవ్వకుండా.. వచ్చిన వారితో భాగస్వామ్యాలు నెలకొల్పుతూ.. కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 121 బంతుల్లో 10 ఫోర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అయితే.. ఈ సెంచరీతో కోహ్లీ ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ 49 సెంచరీలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాడు. ఆ రికార్డును కోహ్లీ ఇప్పుడు ఇక్వెల్‌ చేశాడు. కాగా 49 వన్డే సెంచరీలు చేసేందుకు సచిన్‌కు 463 వన్డేలు పడితే.. కోహ్లీ 289 వన్డేల్లోనే ఆ రికార్డును అందుకోవడం విశేషం. అయితే.. కోహ్లీ తన అరుదైన రికార్డును సమం చేయడంపై సచిన్‌ స్పందిస్తూ.. కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపాడు. తాను ఇటీవల 49 నుంచి 50కి వచ్చేందుకు 365 రోజులు తీసుకున్నానని, కానీ, కోహ్లీ మరికొన్ని రోజుల్లోనే 49 నుంచి 50కి చేరుకుని తన రికార్డును బ్రేక్‌ చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అయితే.. సచిన్‌ చెప్పింది తన వయసు గురించి. 49 ఏళ్ల నుంచి 50వ ఏట అడుగుపెట్టేందుకు ఒక ఏడాది అంటే 365 రోజులు పట్టిందని సరదాగా చెప్పుకొచ్చాడు సచిన్‌. మరి సచిన్‌ రికార్డును కోహ్లీ సమం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.