iDreamPost
android-app
ios-app

సచిన్ పేరు మీద రైల్వే స్టేషన్ ఉందని తెలుసా? ఎక్కడంటే..?

  • Author singhj Published - 06:45 PM, Tue - 28 November 23

భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరుతో ఒక రైల్వే స్టేషన్ ఉందని మీకు తెలుసా? అసలు ఆ స్టేషన్ ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరుతో ఒక రైల్వే స్టేషన్ ఉందని మీకు తెలుసా? అసలు ఆ స్టేషన్ ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 06:45 PM, Tue - 28 November 23
సచిన్ పేరు మీద రైల్వే స్టేషన్ ఉందని తెలుసా? ఎక్కడంటే..?

క్రికెట్​లో బౌలర్లకు కార్ఖానాగా పాకిస్థాన్​ను చెప్పుకుంటారు. ఆ దేశం ఎప్పటికప్పుడు నయా పేసర్స్​ను ప్రపంచ క్రికెట్​కు అందిస్తూ వస్తోంది. ఇమ్రాన్ ఖాన్, వకార్ యూనిస్, వసీం అక్రమ్, షోయబ్ అక్తర్ లాంటి గొప్ప ఫాస్ట్ బౌలర్లు పాక్​ నుంచే వచ్చి క్రికెట్ వరల్డ్​పై తమదైన ముద్ర వేశారు. ఎలాగైతే పాక్​ బ్యాటింగ్ కార్ఖానాగా పేరు తెచ్చుకుందో అలాగే భారత్ బ్యాటింగ్ గనిగా ప్రసిద్ధి గాంచింది. సునీల్ గవాస్కర్ నుంచి సచిన్ టెండూల్కర్ వరకు చాలా మంది గ్రేట్ ఇండియన్ బ్యాటర్స్ క్రికెట్​ను డామినేట్ చేస్తూ వస్తున్నారు. ఈ తరంలోనూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ది బెస్ట్​గా పేరు తెచ్చుకున్నారు. ఎందరో అత్యుత్తమ బ్యాట్స్​మెన్​ను అందించినప్పటికీ అందరిలోకెల్లా సచిన్ మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఒక తరాన్ని క్రికెట్ వైపు మళ్లించిన ఘనత అతడికే దక్కుతుంది.

సచిన్​ టెండూల్కర్​ను ఇన్​స్పిరేషన్​గా తీసుకొని క్రికెట్​ను కెరీర్​గా మలచుకున్న వారు చాలా మందే ఉన్నారు. అంతగా క్రికెట్ దునియా మీద తన ప్రభావం చూపాడు మాస్టర్ బ్లాస్టర్. అతడు ఆడుతున్నాడంటే చాలు.. జనాలు టీవీలకు అతుక్కుపోయేవారు. సచిన్ బ్రేక్ చేసిన రికార్డుల గురించి న్యూస్ పేపర్స్​లో చదువుతూ మురిసిపోయేవారు. 22 గజాల పిచ్ మీద అద్భుతమైన ఆటతీరుతో ఎన్నో అసామాన్య రికార్డులను సృష్టించాడతను. అలాంటి సచిన్​కు లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు దక్కాయి. మన దేశ కేంద్ర ప్రభుత్వం ఏకంగా భారతరత్న పురస్కారంతో కూడా సత్కరించింది. రిటైర్మెంట్ తర్వాత క్రికెట్​కు ఆయన దూరంగానే ఉంటున్నారు. కానీ ఎప్పుడూ ఏదో ఒక విధంగా సచిన్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. క్రికెట్​కు ఆయన అందించిన సేవలకు జ్ఞాపకంగా ఇటీవలే ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసింది బీసీసీఐ.

సచిన్ చేసిన పరుగులు, సృష్టించిన రికార్డులు.. ఇలా ఆయనకు సంబంధించి చాలా విషయాలు వినే ఉంటారు. కానీ మాస్టర్ బ్లాస్టర్ పేరు మీద ఒక రైల్వే స్టేషన్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అవును, సచిన్ పేరుతో ఒక రైల్వే స్టేషన్ ఉంది. దీన్ని మరో లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అందరికీ పరిచయం చేశాడు. ఈ మధ్యే ఆ స్టేషన్​లో తాను దిగిన ఫొటోను ఆయన ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశాడు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణానికి దగ్గర్లో సచిన్ రైల్వే స్టేషన్ ఉంది. సచిన్ రైల్వే స్టేషన్​లో దిగిన ఫొటోను అందరితో పంచుకున్న గవాస్కర్.. గత శతాబ్దం వారిది ఎంతో ముందుచూపన్నాడు. క్రికెట్​లో ఆల్​టైమ్ గ్రేట్, తన ఫేవరెట్ క్రికెటర్, అందులోనూ తనకు ఇష్టమైన వ్యక్తి పేరును ఒక రైల్వే స్టేషన్​కు పెట్టడం హ్యాపీగా ఉందని ఇన్​స్టా పోస్టులో ఆయన రాసుకొచ్చాడు. మరి.. సచిన్ పేరుతో ఓ స్టేషన్ ఉండటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత్​తో టీ20 సిరీస్ మధ్యలోనే స్వదేశానికి ఆసీస్ క్రికెటర్లు.. మాక్స్​వెల్ సహా..!

 

View this post on Instagram

 

A post shared by Sunil Gavaskar (@gavaskarsunilofficial)