iDreamPost

Rohit Sharma: ముంబైని గెలిపించిన రోహిత్.. ఈ సీన్ గమనించారా? ఊరికే లెజెండ్స్ కారు!

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను తన మాస్టర్ మైండ్ లో గెలిపించాడు రోహిత్ శర్మ. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. నిన్నటి మ్యాచ్ లో ఈ సీన్ మీరు గమనించారా?

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను తన మాస్టర్ మైండ్ లో గెలిపించాడు రోహిత్ శర్మ. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. నిన్నటి మ్యాచ్ లో ఈ సీన్ మీరు గమనించారా?

Rohit Sharma: ముంబైని గెలిపించిన రోహిత్.. ఈ సీన్ గమనించారా? ఊరికే లెజెండ్స్ కారు!

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా నిన్న(ఏప్రిల్ 18) పంజాబ్-ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ థ్రిల్లింగ్ పోరులో 9 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. సూర్యకుమార్(78) బ్యాటింగ్ లో అదరగొట్టగా.. బుమ్రా(3/21) పంజాబ్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. అయితే ముంబై విజయానికి వీరిద్దరే కారణంమని చాలా అంది అనుకుంటున్నారు. కానీ.. ముంబైని గెలిపించింది రోహిత్ శర్మ అని చాలా మందికి తెలీదు. నిన్న జరిగిన మ్యాచ్ లో ఈ సీన్ గమనించారా? 5 ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన అపార అనుభవంతో.. ఈ మ్యాచ్ లో ముంబైని విజయతీరాలకు చేర్చాడు హిట్ మ్యాన్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

పంజాబ్ ముందు 193 పరుగుల లక్ష్యం ఉంది. కానీ ముంబై బౌలర్లు కొయెట్జీ, బుమ్రాలు విజృంభించడంతో.. 13 బంతుల్లో 14 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయింది పంజాబ్ టీమ్. దీంతో ముంబై విజయం నల్లేరుపై నడకే అనుకున్నారు అందరు. కానీ అనూహ్యంగా సిక్సర్ల మోత మోగిస్తూ చెలరేగాడు యంగ్ బ్యాటర్ అశుతోష్ శర్మ. ఒక వైపు సహచరులు పెవిలియన్ చేరుతున్నా.. ఒంటరి పోరాటం చేశాడు. ఒక దశలో ముంబైకి గెలుపుపై ఆశలు లేవు. కానీ ఆఖర్లో పుంజుకున్న ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. చివరి 4 ఓవర్లలో పంజాబ్ 28 పరుగులు చేయాలి. ఈ క్రమంలో బుమ్రా తాను వేసిన ఓవర్ లో కేవలం 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు.

ఇక ఆ తర్వాతి ఓవర్ లో 61 పరుగులు చేసి మంచి టచ్ లో ఉన్న అశుతోష్ ను కొయెట్జీ ఔట్ చేశాడు. ఈ ఓవర్లో కూడా 2 రన్స్ వచ్చాయి. దీంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది. 19వ ఓవర్ వేసిన పాండ్యా 11 రన్స్ ఇచ్చి.. బ్రార్ ను పెవిలియన్ కు పంపాడు. చేతిలో ఒక వికెట్.. 6 బాల్స్ కు 12 రన్స్ చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి టైమ్ లో యువ బౌలర్ మధ్వాల్ కు బంతి అందించాడు పాండ్యా. ఇది అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాండ్యాను నమ్ముకుంటే పనవ్వదని భావించిన రోహిత్.. తన అనుభవాన్ని ఉపయోగించి బౌలర్ కు కొన్ని సూచనలు ఇచ్చాడు. అందుకు తగ్గట్లుగానే ఫీల్డ్ ను సెటప్ చేశాడు. మధ్వాల్ తో మాట్లాడిన తర్వాత మహ్మద్ నబిని డీప్ కవర్ లో ఫీల్డ్ సెట్ చేశాడు. ఇంకేముందు రోహిత్ ప్లాన్ వేశాక తిరుగుంటుందా?

చివరి ఓవర్ తొలి బాల్ వైడ్ వేసిన మధ్వాల్.. ఆ తర్వాత బంతిని వైడ్ యార్కర్ ఔట్ సైడ్ గా వేశాడు. దీంతో ఒక రన్ కంప్లీట్ చేసుకున్న రబాడా-హర్షల్ పటేల్.. రెండో రన్ కోసం ప్రయత్నించగా.. నబి మెరుపు వేగంతో బాల్ ను ఇషాన్ కిషన్ కు త్రో చేశాడు. రబాడా పరుగు తీయడంలో విఫలం అయ్యి.. రనౌట్ గా వెనుదిరిగాడు. దీంతో రోహిత్ మాస్టర్ మైండ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇది కదా అనుభం అంటే.. 5 టైటిళ్లు ఊరికే సాధిస్తారా? ఊరికే లెజెండ్స్ అయిపోరు అంటూ ఫ్యాన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరి చివరి ఓవర్లో తన అనుభవంతో ఫీల్డ్ సెట్ చేసి పంజాబ్ కథ ముగించిన రోహిత్ శర్మ మాస్టర్ మైండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి