iDreamPost

Jasprit Bumrah: పంజాబ్ ను చావు దెబ్బకొట్టిన బుమ్రా.. IPL చరిత్రలోనే రేర్ ఫీట్

పంజాబ్ కింగ్స్ ను చావుదెబ్బకొట్టి ముంబైకి అద్భుతమైన విజయాన్ని అందించాడు ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలోనే రేర్ ఫీట్ ను తన పేరిట లిఖించుకున్నాడు. అదేంటంటే?

పంజాబ్ కింగ్స్ ను చావుదెబ్బకొట్టి ముంబైకి అద్భుతమైన విజయాన్ని అందించాడు ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలోనే రేర్ ఫీట్ ను తన పేరిట లిఖించుకున్నాడు. అదేంటంటే?

Jasprit Bumrah: పంజాబ్ ను చావు దెబ్బకొట్టిన బుమ్రా.. IPL చరిత్రలోనే రేర్ ఫీట్

ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ కు మరో విజయం దక్కింది. దీంతో ఈ సీజన్ లో ముచ్చటగా మూడో గెలుపును తన ఖాతాలో వేసుకుంది ఎంఐ టీమ్. తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 9 పరుగుల స్వల్ప తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఏక పక్షంగా సాగుతుంది అనుకున్న మ్యాచ్ కాస్త.. ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇక ఈ మ్యాచ్ లో యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ చరిత్రలోనే రేర్ ఫీట్ ను క్రియేట్ చేశాడు. టోర్నీ హిస్టరీలో ఈ ఘనత సాధించిన తొలి పేసర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు.

జస్ప్రీత్ బుమ్రా.. ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపుతున్నాడు. కొన్ని మ్యాచ్ ల్లో వికెట్లు తీస్తూ.. మరికొన్ని మ్యాచ్ ల్లో పొదుపుగా బౌలింగ్ చేస్తూ.. టీమ్ విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇక తాజాగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్ల కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ముంబై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కు ఆదిలోనే ఊహించని షాకిచ్చాడు బుమ్రా. తాను వేసిన తొలి ఓవర్ లోనే రొసో(1), కెప్టెన్ సామ్ కర్రన్(6) పెవిలియన్ కు చేర్చడం ద్వారా పంజాబ్ ను కోలుకోలేని దెబ్బతీశాడు.

A rare feat in the history of IPL!

ఆ తర్వాత పంజాబ్ ను విజయం దిశగా తీసుకెళ్తూ.. 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 41 పరుగులు చేసి శశాంక్ సింగ్ ను బోల్తా కొట్టించాడు బుమ్రా. దీంతో పంజాబ్ విజయానికి బ్రేక్ పడినట్లు అయ్యింది. 3 వికెట్లు తీసిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డుతో యార్కర్ల కింగ్ ఐపీఎల్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్ గా ఉమేష్ యాదవ్(10) రికార్డును సమం చేశాడు. బుమ్రాకి ఇది 10వ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు. దీంతో పాటుగా ఈ సీజన్ లో ఇప్పటి వరకు 7 మ్యాచ్ లు ఆడి 13 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు బుమ్రా.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. జట్టులో సూర్యకుమార్ 57 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 78 పరుగులతో రాణించాడు. అనంతరం 193 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌట్ అయ్యి.. 9 రన్స్ తో ఓడిపోయింది. అశుతోష్ శర్మ 28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సులతో 61 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడినా టీమ్ ను గెలిపించలేకపోయాడు. ఐపీఎల్ హిస్టరీలో బుమ్రా సాధించిన రేర్ ఫీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి