iDreamPost

Rohit Sharma: హార్దిక్ పాండ్యా ప్లేస్​లో వరల్డ్ కప్​కు దూబె! రోహిత్ ప్లాన్ గట్టిగా ఉందిగా!

  • Published Apr 16, 2024 | 8:16 PMUpdated Apr 16, 2024 | 8:16 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గట్టి ప్లానింగ్​తో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ టీమ్ విషయంలో అతడి వ్యూహాలు చాలా షాకింగ్​గా ఉన్నాయి.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గట్టి ప్లానింగ్​తో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ టీమ్ విషయంలో అతడి వ్యూహాలు చాలా షాకింగ్​గా ఉన్నాయి.

  • Published Apr 16, 2024 | 8:16 PMUpdated Apr 16, 2024 | 8:16 PM
Rohit Sharma: హార్దిక్ పాండ్యా ప్లేస్​లో వరల్డ్ కప్​కు దూబె! రోహిత్ ప్లాన్ గట్టిగా ఉందిగా!

ఐపీఎల్-2024లో దాదాపుగా ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. దీంతో అందరూ క్యాష్ రిచ్ లీగ్ మ్యాచుల్ని చూడటంలో బిజీ అయిపోయారు. ఆటగాళ్లు కూడా తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆయా టీమ్స్​ను గెలిపించాలని చూస్తున్నారు. అయితే ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మాత్రం టీ20 వరల్డ్ కప్​ ప్లానింగ్​లో ఉన్నాడు. ముంబైకి ఆడుతూనే మరోవైపు ప్రపంచ కప్ గురించి కూడా టీమిండియా కెప్టెన్ ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. ఏయే ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలి? టీమ్ కాంబినేషన్ ఎలా ఉండాలి? అనేది ప్లానింగ్ చేస్తున్నాడట. కోచ్ ద్రవిడ్​తో పాటు బీసీసీఐ పెద్దలతోనూ టచ్​లో ఉంటున్నాడని సమాచారం. వన్డే వరల్డ్ కప్ మిస్సయిందన్న బాధలో ఉన్న హిట్​మ్యాన్​.. టీ20 ప్రపంచ కప్​ కొట్టాలని బలంగా అనుకుంటున్నాడట. అయితే ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాకు అతడు షాక్ ఇవ్వనున్నాడని వినిపిస్తోంది.

టీ20 ప్రపంచ కప్​కు వెళ్లబోయే భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. టీమ్​తో ట్రావెల్ అవుతున్న ప్లేయర్లు అందరికీ స్క్వాడ్​లో ప్లేస్ పక్కా అని తెలుస్తోంది. అయితే ఆల్​రౌండర్ హార్దిక్​కు మాత్రం జట్టులో చోటు దక్కదని సమాచారం. అతడి ప్లేస్​లో యంగ్ ఆల్​రౌండర్ శివమ్ దూబెను సెలక్ట్ చేయనున్నారట. ఈ మేరకు రోహిత్ బోర్డుకు సూచనలు చేశాడని టాక్ నడుస్తోంది. హార్దిక్​ను పక్కనబెట్టడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. గాయం కారణంగా వన్డే వరల్డ్ కప్ నుంచి టీమ్​కు దూరంగా ఉన్న పాండ్యా ఐపీఎల్​తో కమ్​బ్యాక్ ఇచ్చాడు. కానీ ఇప్పటిదాకా ఆడిన మ్యాచుల్లో అతడు ఆల్​రౌండర్​గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. బ్యాటింగ్ లేదు, బౌలింగ్ కూడా లేదు.

టీ20ల్లో హార్దిక్ ఆడేది కీలకమైన స్థానం. ఆఖర్లో వచ్చి మ్యాచుల్ని ఫినిష్ చేయడం అతడి పని. కానీ ఐపీఎల్​లో పాండ్యా టోటల్ ఫెయిల్ అవుతున్నాడు. ఇదే సమయంలో శివమ్ దూబె మాత్రం ప్రతి మ్యాచ్​లో సగటున 20కి పైగా బంతుల్లో 50 పరుగులు కొడుతున్నాడు. అతడు మీడియం పేస్​తో బ్రేక్ త్రూలు అందించగలడు. కానీ చెన్నై సూపర్ కింగ్స్​లో ఉన్న ఎక్కువ వనరుల వల్ల అతడికి బౌలింగ్ ఇవ్వడం లేదు. ఇక్కడే రోహిత్ తన ప్లాన్​ను వాడుతున్నాడు. వరల్డ్ కప్ జరిగేది వెస్టిండీస్​లో. దీంతో అక్కడ స్లో పిచ్​లకు స్లో డెలివరీస్ వేసే దూబె పర్ఫెక్ట్​గా సరిపోతాడని చెప్పి సెలక్టర్లను ఫోర్స్ చేస్తున్నాడట హిట్​మ్యాన్.

హార్దిక్ ఫెయిల్యూర్, ఆల్​రౌండర్​గా దూబె సక్సెస్, స్లో పిచ్​లకు స్లో బౌలింగ్ పర్ఫెక్ట్ అంటూ రోహిత్ చెప్పిన లాజిక్​కు సెలక్టర్లు కూడా ఓకే అన్నారని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇలా జరిగితే మాత్రం ఒక్క దెబ్బకు రెండు లాభాలు ఉంటాయి. ఒకటి దూబె ఎంట్రీతో టీమ్ బ్యాటింగ్, బౌలింగ్​లో మరింత డెప్త్ వస్తుంది. అలాగే పాండ్యా మీద పగ తీర్చుకున్నట్లు అవుతుంది. అయితే హార్దిక్​ బదులు దూబెను తీసుకుంటారా? లేదా? అనేది సెలక్టర్లు టీమ్ అనౌన్స్ చేశాకే క్లారిటీ వస్తుంది. మరి.. దూబె, పాండ్యాలో ఎవర్ని వరల్డ్ కప్​లో ఆడిస్తే బెటర్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి