iDreamPost

Suryakumar Yadav: రోహిత్ కాదు.. ముంబైపై సూర్య ఆగ్రహం! బయటకు వెళ్లే ఆలోచనలో..?

  • Published Dec 16, 2023 | 4:08 PMUpdated Dec 16, 2023 | 4:08 PM

ఐపీఎల్-2024 ఆక్షన్​కు ముందు కెప్టెన్సీ విషయంలో ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రోహిత్​ను కెప్టెన్సీ నుంచి తీసేసి హార్దిక్​కు బాధ్యతలు అప్పజెప్పడంపై అన్ని వైపుల నుంచి ఎంఐ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

ఐపీఎల్-2024 ఆక్షన్​కు ముందు కెప్టెన్సీ విషయంలో ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రోహిత్​ను కెప్టెన్సీ నుంచి తీసేసి హార్దిక్​కు బాధ్యతలు అప్పజెప్పడంపై అన్ని వైపుల నుంచి ఎంఐ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

  • Published Dec 16, 2023 | 4:08 PMUpdated Dec 16, 2023 | 4:08 PM
Suryakumar Yadav: రోహిత్ కాదు.. ముంబైపై సూర్య ఆగ్రహం! బయటకు వెళ్లే ఆలోచనలో..?

ఏ రంగంలోనైనా సక్సెస్ అవ్వాలంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. డెసిజన్స్ మీదే చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. ఒక్కోసారి వీటి వల్ల అనూహ్య మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. ఏ ఒకరిద్దరి కోసమో కాకుండా అందరి మేలు గురించి ఆలోచించి ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే సరైన ఫలితాలు వస్తాయి లేదా అసలుకే మోసం వస్తుంది. తప్పుడు నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందుల్ని, సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. టీమ్​కు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలను అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించడంతో ముంబై తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ విషయంలో హిట్​మ్యాన్​ ఫ్యాన్స్​తో పాటు ఆ టీమ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, స్పీడ్​స్టర్ జస్​ప్రీత్ బుమ్రా లాంటి కీలక ప్లేయర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రోహిత్​ను కెప్టెన్సీ పగ్గాల నుంచి తీసేసిన నేపథ్యంలో సూర్యకుమార్ ఇన్​స్టాగ్రామ్​లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎలాంటి క్యాప్షన్, హ్యాష్ ట్యాగ్స్ లేకుండా కేవలం హార్ట్ బ్రేక్ ఎమోజీని షేర్ చేశాడు సూర్య. దీంతో సారథ్య బాధ్యతలను మార్చడం తనకు నచ్చలేదని ఇన్​డైరెక్ట్​గా అతడు చెప్పకనే చెప్పాడు. ఈ విషయంలో ఫ్రాంచైజీ మీద మిస్టర్ 360 సీరియస్​గా ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ లాంటి ప్లేయర్​కే ఇలా జరిగినప్పుడు తమకు జరగదని గ్యారెంటీ ఏంటని అతడు అనుకుంటున్నాడట. దాదాపు పదేళ్ల పాటు కెప్టెన్​గా ఉండి ఐదుసార్లు టైటిల్ విన్నర్​గా నిలిపిన హిట్​మ్యాన్​ను ముంబై ట్రీట్​ చేసిన విధానం అతడికి నచ్చలేదట. ఇతర టీమ్స్ నుంచి ఎన్ని ఆఫర్లు వస్తున్నా ఎంఐని అట్టిపెట్టుకొని లాయల్​గా ఉంటే.. తీరా తన ప్లేస్​లో హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చి కెప్టెన్​ చేయడం మీదా అతడు కోపంగా ఉన్నాడట. అందుకే ముంబై ఇండియన్స్​ను వీడాలని సూర్య అనుకుంటున్నాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.

suryakumar leaves mi team

కెప్టెన్సీ నుంచి తీసేసిన రోహిత్ కంటే సూర్యకుమారే ముంబై ఇండియన్స్ మీద ఎక్కువ ఆగ్రహంగా ఉన్నాడని టాక్. టీమ్​ను వీడి ఇతర ఫ్రాంచైజీలో చేరాలని అనుకుంటున్నాడని నెట్టింట జోరుగా వినిపిస్తోంది. బయటకు వెళ్లాలని అతడు ఫిక్స్ అయ్యాడని.. ఇక ముంబై పని అయిపోయిందని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. సూర్యే కాదు.. స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా కూడా ముంబైని వదిలి వెళ్లిపోనున్నట్లు న్యూస్ వస్తోంది. కెప్టెన్సీ మార్పు నేపథ్యంలో బుమ్రా ఇన్​స్టాగ్రామ్​లో చేసిన పోస్ట్ దీనికి మరింత ఊతం ఇస్తోంది. నిశ్శబ్దమే అన్నింటికీ సమాధానం అంటూ పేసుగుర్రం పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్లేయర్ల ట్రేడింగ్​లో భాగంగా ఇటీవల గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్​కు హార్దిక్ మారినప్పుడూ బుమ్రా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్​లో అసలు ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. సూర్య, బుమ్రాలు ఒకవేళ ఎంఐలోనే కంటిన్యూ అయినా హార్దిక్​కు ఎంతగా సపోర్ట్ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి.. ముంబైని సూర్య వీడతాడంటూ వస్తున్న వార్తల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rohit Sharma: ముంబై ఇండియన్స్ కి రోహిత్ గుడ్ బై! ఇంత రచ్చ జరుగుతుందా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి