iDreamPost

Hardik Pandya: ముంబై కెప్టెన్​గా హార్దిక్.. బుమ్రా, సూర్యకుమార్ షాకింగ్ పోస్ట్​!

  • Published Dec 16, 2023 | 1:44 PMUpdated Dec 16, 2023 | 2:08 PM

కొత్త కెప్టెన్​గా హార్దిక్​ పాండ్యాను నియమించడం ముంబై ఇండియన్స్​కు తలనొప్పిగా మారింది. ఆ టీమ్​ అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ టైమ్​లో జట్టులోని సీనియర్ ప్లేయర్లు బుమ్రా, సూర్యకుమార్ షాకింగ్ పోస్ట్​ పెట్టారు.

కొత్త కెప్టెన్​గా హార్దిక్​ పాండ్యాను నియమించడం ముంబై ఇండియన్స్​కు తలనొప్పిగా మారింది. ఆ టీమ్​ అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ టైమ్​లో జట్టులోని సీనియర్ ప్లేయర్లు బుమ్రా, సూర్యకుమార్ షాకింగ్ పోస్ట్​ పెట్టారు.

  • Published Dec 16, 2023 | 1:44 PMUpdated Dec 16, 2023 | 2:08 PM
Hardik Pandya: ముంబై కెప్టెన్​గా హార్దిక్.. బుమ్రా, సూర్యకుమార్ షాకింగ్ పోస్ట్​!

క్లబ్, ఫ్రాంచైజీ క్రికెట్​లో అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం సర్వసాధారణమే. ఏ ప్లేయర్ ఏ టీమ్​లోనూ పర్మినెంట్​గా ఉండలేడు. ముఖ్యంగా ఏ ఆటగాడు కూడా తాను ఆడినన్ని రోజులు కెప్టెన్​గా ఉండటం కుదరదు. ఏదో ఒక రోజు సారథ్య బాధ్యతల్ని ఇతరులకు అప్పగించక తప్పదు. అయితే ఇదంతా గౌరవప్రదంగా జరిగితే బాగుంటుంది. కానీ ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా వ్యవహరిస్తే మాత్రం అభిమానులు, ప్రేక్షకుల దగ్గర నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఇపుడు ముంబై ఇండియన్స్ పరిస్థితి ఇలాగే ఉంది. ఐపీఎల్​-2024 ఆక్షన్​కు ముందు ఆ జట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. టీమ్ సారథ్య బాధ్యతల్ని హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. దీంతో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై అతడి అభిమానులతో పాటు ముంబై ప్లేయర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, పేసర్ జస్​ప్రీత్ బుమ్రా తాజాగా సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్​ పెట్టారు. సూర్య ట్విట్టర్ వేదికగా హార్ట్ బ్రేక్ ఎమోజీని షేర్ చేశాడు. కెప్టెన్​ను మారుస్తూ ముంబై ఫ్రాంచైజీ తీసుకున్న డెసిజన్ తనకు నచ్చలేదని పరోక్షంగా అతడు చెప్పకనే చెప్పాడు. ఈ పోస్ట్​కు ఎలాంటి కామెంట్స్, హ్యాష్ ట్యాగ్ లేకుండా తన ఆవేదనను ఎమోజీ రూపంలో పంచుకున్నాడు. అటు బుమ్రా కూడా ఓ వెరైటీ పోస్ట్ పెట్టాడు. ‘నిశ్శబ్దమే సరైన జవాబు’ అని ఇన్​స్టాగ్రామ్​ స్టోరీస్​లో షేర్ చేశాడు. దీంతో వీరి పోస్ట్​లను రోహిత్ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఎంఐకి తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక, సూర్య, బుమ్రాల కెరీర్​ ఈ రేంజ్​లో ఉండటంలో రోహిత్ శర్మ ఎంతో కీలకమైన పాత్ర పోషించాడు. ముంబై జట్టు తరఫున ఫెయిలైనా కూడా వీరి మీద నమ్మకం ఉంచి అవకాశాలు ఇచ్చాడు. హిట్​మ్యాన్ ఎంకరేజ్​మెంట్ వల్లే వాళ్లు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పొచ్చు. ముంబైతో పాటు టీమిండియా కెప్టెన్​గా కూడా రోహిత్​తో సూర్య, బుమ్రాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

mi captain pandya bumrah reaction viral

బుమ్రా, సూర్యల పోస్ట్​లు.. రోహిత్ శర్మకు మద్దతుగా గానే గాక ఫ్రాంచైజీ నిర్ణయానికి వ్యతిరేకంగానూ కనిపిస్తున్నాయి. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ సారథిగా ఉన్న హార్దిక్ పాండ్యాను ఇటీవల ప్లేయర్ల రిటెన్షన్​లో భాగంగా ముంబై దక్కించుకున్నప్పుడు బుమ్రా పరోక్షంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఇన్నాళ్లూ టీమ్​కు నమ్మకంగా ఉండి వేరే ఆఫర్స్ వచ్చినా వదులుకుంటే ఆఖరుకు రోహిత్ ప్లేసులో హార్దిక్​ను కెప్టెన్ చేయడం బుమ్రాకు నచ్చలేదని వార్తలు వచ్చాయి. ఇదే విషయంలో ఎంఐ తీరు మీద సూర్యకుమార్ కూడా సంతృప్తిగా లేడని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఎవరికీ చెప్పకుండా హఠాత్తుగా రోహిత్​ను తీసేసి హార్దిక్​ను కెప్టెన్​ చేయడం వీళ్లను మరింత ఆగ్రహానికి గురిచేసిందని చెబుతున్నారు. మరి.. ఎంఐ కెప్టెన్సీ మార్పు నేపథ్యంలో సూర్య, బుమ్రా చేసిన పోస్టుల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి