iDreamPost
android-app
ios-app

బాబు.. విజయ్‌ మాల్యాలా పారిపోయే అవకాశం ఉంది: మంత్రి రోజా

బాబు.. విజయ్‌ మాల్యాలా పారిపోయే అవకాశం ఉంది: మంత్రి రోజా

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక నేరగాడైన విజయ్‌ మాల్యాలా చంద్రబాబు కూడా దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని ఆమె అన్నారు. బాబుపై పలు సంచలన కామెంట్లు చేశారు. మంత్రి రోజా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ చంద్రబాబు నాయుడు జైలుకెళితే ఎన్టీఆర్ గారి ఆత్మ సంతోషిస్తుంది. 118 కోట్ల రూపాయల ముడుపుల కేసులో విచారణ ఎదుర్కొనే దమ్ముందా లేదా..?. విచారణ ఎదుర్కొంటాడా లేక బాలకృష్ణలా మెంటల్ సర్టిఫికెట్ తెచుకుంటాడా..?.
చంద్రబాబు, లోకేష్‌లను జైలులో పెడితేనే ప్రజలకు మేలు.

బాబు అడ్డంగా దొరికిపోయినప్పుడు సింపతి డ్రామాలు ఆడటం అలవాటు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి రాష్ట్రానికి పారిపోయి వచ్చాడు. చంద్రబాబు మీద అలిపిరిలో బాంబు పేలినప్పుడే ఆయనకి సింపతి రాలేదు. బాబు అంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది. 2019లో ఎన్నికల ముందు మోదీ నన్ను అరెస్ట్‌ చేస్తారని సింపతి డ్రామా ఆడింది చంద్రబాబు కాదా?. చంద్రబాబుని కచ్చితంగా అరెస్ట్‌ చేయాలి. బాబుని ముడుపుల కేసులో సీబీఐ, ఈడీ విచారించాల’’ని ఆమె అన్నారు. మరి, చంద్రబాబు నాయుడు కూడా విజయ్‌ మాల్యాలా దేశం విడిచి పారిపోతారన్న మంత్రి రోజా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş