Somesekhar
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ క్రికెట్ లో కమ్ బ్యాక్ ఇవ్వడంతో.. సంతోషంతో వీరాభిమాని గొప్పపని చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఫ్యాన్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే?
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ క్రికెట్ లో కమ్ బ్యాక్ ఇవ్వడంతో.. సంతోషంతో వీరాభిమాని గొప్పపని చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఫ్యాన్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే?
Somesekhar
టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ రిషబ్ పంత్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం ప్రాక్టీస్ ను మెుదలుపెట్టాడు. కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన అతడు లాంగ్ గ్యాప్ తర్వాత గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సంతోషకరమైన విషయాన్ని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు పంత్ వీరాభిమాని ఒకరు. సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా.. ఈ ఐపీఎల్ లో పంత్ కొట్టిన ప్రతీ సిక్స్ కు తన వంతు పేదలకు సాయం చేస్తానని ప్రకటించాడు.
రిషబ్ పంత్ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ కూడా మెుదలుపెట్టాడు. ప్రాక్టీస్ లో భారీ షాట్లతో విరుచుకుపడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే రిషబ్ పంత్ కమ్ బ్యాక్ ఇవ్వడంతో.. వీరాభిమాని తన సంతోషాన్ని పేద పిల్లలతో కలిసి పంచుకున్నాడు. పంత్ ఆరోగ్యకంగా తిరిగి గ్రౌండ్ లోకి అడుగుపెట్టిన వేళ.. అభిమాని ఒకరు 100 ఫుడ్ ప్యాకెట్లను ఆకలితో అలమటిస్తున్న పిల్లలకు పంచిపెట్టి, తన గొప్ప మనసు చాటుకున్నాడు. అయితే ఇంతటితో తన సాయం ఆగదని చాటి చెబుతూ.. ఈ ఐపీఎల్ సీజన్ లో పంత్ కొట్టే ప్రతీ సిక్స్ కు 5 ఫుడ్ ప్యాకెట్స్ ను పేద వారికి పంచిపెడతానని పేర్కొన్నాడు.
కాగా.. కారు ప్రమాదం జరిగిన విషయం తన చెవిన పడ్డప్పుడు గుండె బద్దలైందని చెప్పుకొచ్చాడు. ఆ టైమ్ లో అందరి దేవుళ్లకు పంత్ ను ఆరోగ్యంగా, ఫిట్ గా తీసుకురావాలని మెుక్కానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. పంత్ జీవితంలో జరిగిన ఈ చిన్న మంచినైనా.. నేను ఇదే విధంగా సెలబ్రేట్ చేసుకుంటానని వెల్లడించాడు. ఇది ఆరంభం మాత్రంమే.. ఇంకా చేసేది చాలా ఉందని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చాడు. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వీడియో వైరల్ కావడంతో.. సదరు అభిమానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. గొప్ప మనసుతో చిన్న పని చేసినా సంతోషమే, చిన్న పిల్లల ఆకలి తీరుస్తున్న మీకు ఆ దేవుడు అంతా మంచే చేస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పంత్ కమ్ బ్యాక్ పై తన అభిమానాన్ని చాటుకుంటున్న ఫ్యాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Welcome back @RishabhPant17
Not all promises are meant to be broken , the day I heard about that incident. I prayed to the God just keep him healthy and fit and whenever he will be back , I will be celebrating it like anything .
Here I am , distributed 100 food packets to the… pic.twitter.com/Plx4mishHk
— Riseup Pant Popa (@riseup_pant17) March 13, 2024
ఇదికూడా చదవండి: బ్రేకింగ్: శ్రీలంక స్టార్ క్రికెటర్ కు ప్రమాదం.. ఆస్పత్రికి తరలింపు!