iDreamPost

బ్రేకింగ్: శ్రీలంక స్టార్ క్రికెటర్ కు ప్రమాదం.. ఆస్పత్రికి తరలింపు!

శ్రీలంక స్టార్ ప్లేయర్, మాజీ ఆటగాడు కారు ప్రమాదానికి గురైయ్యాడు. ఈ ప్రమాదంలో గాయపడిన అతడిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

శ్రీలంక స్టార్ ప్లేయర్, మాజీ ఆటగాడు కారు ప్రమాదానికి గురైయ్యాడు. ఈ ప్రమాదంలో గాయపడిన అతడిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

బ్రేకింగ్: శ్రీలంక స్టార్ క్రికెటర్ కు ప్రమాదం.. ఆస్పత్రికి తరలింపు!

శ్రీలంక స్టార్ క్రికెటర్, మాజీ ఆటగాడు లాహిరు తిరుమన్నే కారు ప్రమాదానికి గురైయ్యాడు. గురువారం(మార్చి 14) తిరుమన్నే ప్రయాణిస్తున్న కారును లారీ వచ్చి బలంగా ఢీ కొట్టింది. దీంతో అతడికి గాయాలు అయ్యాయి. కారు ముందుభాగం మెుత్తం నుజ్జునుజ్జు అయ్యింది. తీవ్రంగా గాయపడిన అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

శ్రీలంక మాజీ ప్లేయర్ లాహిరు తిరుమన్నే కారు యాక్సిడెంట్ కు గురైంది. గురువారం అతడు ప్రయాణిస్తున్న కారును లారీ బలంగా ఢీ కొట్టడంతో.. ముందు భాగం మెుత్తం నుజ్జునుజ్జు అయ్యింది. తీవ్రంగా గాయపడిన అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం త్రిప్పనే సమీపంలోని అనురాధపూర దగ్గర జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్ లో అతడికి పెద్ద గాయాలేమీ కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉండగా.. తిరుమన్నే కెరీర్ విషయానికి వస్తే.. 2010లో టీమిండియాతో జరిగిన మ్యాచ్ ద్వారా క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. 2023లో ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. 13 ఏళ్ల తన కెరీర్ లో శ్రీలంక తరఫున 44 టెస్టులు ఆడి 3 సెంచరీలతో 2,088 రన్స్ చేశాడు. 127 వన్డేల్లో 3,194, 26 టీ20ల్లో 291 పరుగులు చేశాడు. కాగా.. 2015 వరల్డ్ కప్ లో తన విశ్వరూపం చూపాడు తిరుమన్నే. ఆ టోర్నీలో 861 పరుగులు చేశాడు. ఈ ప్రమాదం నుంచి త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

ఇదికూడా చదవండి: IPLలో ఆ రూల్ తీసేస్తే.. ఈ ప్లేయర్లకు 100 కోట్లు ఖాయం: రాబిన్ ఊతప్ప

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి