iDreamPost

రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. లోకేష్ పేరు కూడా..

రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. లోకేష్ పేరు కూడా..

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడుని సిఐడీ సిట్ అధికారులు విచారణ చేసి రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ఇక ఈ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు బయటికి వచ్చాయి. స్కిల్ స్కామ్ ప్రాజెక్ట్ కుంభకోణంలో బాబు ప్రధాన సూత్రాదారి అని తేల్చారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర కీలకమైందని సీఐడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. స్కిల్ స్కామ్ లో రూ. 300 కోట్లు ప్రభుత్వం నష్టపోయిందని, దీనికి కారణం బాబు అతడి అనుచరులే కారణమని తెలిపింది. ఇక ఈ రిమాండ్ రిపోర్టులో మరో సంచలన నిజాన్ని బయటపెట్టింది. సీఐడీ. చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ పాత్ర కూడా స్కిల్ స్కామ్ లో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.

సీమెన్ ఇండియా కంపెనీలోని ఓ వ్యక్తితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని తప్పుడు డీపీఆర్ సృష్టించి ఈ కుంభకోణానికి తెరలేపినట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్దంగా రూ. 371 కోట్లు చెల్లింపులు, భారీ మొత్తంలో షెల్ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లను మాయం చేయడంలో చంద్రబాబు చాకచక్యంగా వ్యవహరించారని వెల్లడించారు. నారా లోకేష్ పేరును కూడా రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది ఏపీ సీఐడీ. మధ్యవర్తి అయిన కిలారు రాజేశ్ ద్వారా లోకేష్ కు ముడుపులు అందాయని తెలిపింది. చంద్రబాబుకు తన పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్‌ ద్వారా ముడుపులు అందాయని వెల్లడించింది. స్కిల్ ప్రాజెక్టు వివరాలలో అనేక లోటుపాట్లు ఉన్నప్పటికి చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఓకె చేశారని, సీమెన్స్ కంపెనీ రూ. 3281 కోట్లు గ్రాంట్ గా ఇస్తుందని అసత్యాలు చెప్పారని సీఐడీ పేర్కొంది. ఇక రిమాండ్ రిపోర్టులో లోకేష్ పేరు కూడా ఉండడంతో త్వరలో అరెస్టు చేసి విచారిస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి