nagidream
HYD House Prices Reduced: హైదరాబాద్ లో ఇల్లు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. గతంతో పోలిస్తే ప్రధాన ప్రాంతాల్లో ఇప్పుడు ఇండ్ల ధరలు తగ్గాయి. రియల్ ఎస్టేట్ లో చోటు చేసుకున్న ప్రతికూల అంశాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో స్థలాల ధరలతో పాటు రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు తగ్గాయి.
HYD House Prices Reduced: హైదరాబాద్ లో ఇల్లు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. గతంతో పోలిస్తే ప్రధాన ప్రాంతాల్లో ఇప్పుడు ఇండ్ల ధరలు తగ్గాయి. రియల్ ఎస్టేట్ లో చోటు చేసుకున్న ప్రతికూల అంశాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో స్థలాల ధరలతో పాటు రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు తగ్గాయి.
nagidream
హైదరాబాద్ లో సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఇండ్ల ధరలు భారీగా తగ్గాయి. మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ సహా అనేక ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు బాగా తగ్గాయి. దీంతో ఇప్పుడు కొన్నవారికి లక్షల్లో డబ్బు ఆదా అవుతుంది. ఇప్పుడు ఆదా అంటే పెరిగిన తర్వాత ఆదాయం అన్నట్టే. భారీగా లాభం పొందవచ్చునన్నమాట. మరి ఏ ఏరియాల్లో ఎంత మేర తగ్గాయి? గతంలో ఎంత ఉండేవి? ప్రస్తుతం ధరలు ఎంత ఉన్నాయి? అనే పూర్తి వివరాలు మీ కోసం.
నార్త్ హైదరాబాద్ లో ఉన్న రియల్ ఎస్టేట్ బాహుబలిగా పేరొందిన బాచుపల్లిలో కూడా రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు స్వల్పంగా తగ్గాయి. జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 5,750 ఉండగా ఇప్పుడు రూ. 5,600కి చేరుకుంది.
నార్త్ హైదరాబాద్ లో ఉన్న మియాపూర్ లో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 6,900గా ఉండేది. ఇప్పుడు రూ. 6 వేలకు పడిపోయింది. ఇప్పుడు ఇల్లు కొనుగోలు చేసినట్లయితే దాదాపు 11 లక్షలు ఆదా అయినట్టు. ధరలు పెరిగినాక ఈ డబ్బులు లాభం అన్నట్టు.
నార్త్ హైదరాబాద్ లో ఉన్న నిజాంపేటలో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 5,350గా ఉండేది. ఇప్పుడు అది రూ. 5,200గా ఉంది.
నార్త్ హైదరాబాద్ లో ఉన్న బీరంగూడలో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 4,250 ఉండగా ఇప్పుడు రూ. 4,200కి తగ్గింది.
నార్త్ హైదరాబాద్ లో ఉన్న కూకట్ పల్లిలో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 6,500 ఉండగా ఇప్పుడది రూ. 5,700కి పడిపోయింది.
సికింద్రాబాద్ పరిధిలో ఉన్న కొంపల్లిలో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 5,950 ఉండేది. ఇప్పుడది రూ. 5,250కి పడిపోయింది.
సౌత్ హైదరాబాద్ లో ఉన్న రాజేంద్రనగర్ లో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 7,450 ఉండగా.. ఇప్పుడు రూ. 6,900కి తగ్గింది.
సెంట్రల్ హైదరాబాద్ లో ఉన్న బంజారాహిల్స్ లో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 10,200 ఉండగా ఇప్పుడది రూ. 9,600కి తగ్గింది.
ఈస్ట్ హైదరాబాద్ లో ఉన్న ఎల్బీనగర్ లో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 6,350 ఉండగా.. ఇప్పుడది రూ. 6,250కి తగ్గింది.
వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న మణికొండలో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 7,750 ఉండగా.. ఇప్పుడు రూ. 6,850గా ఉంది.
వెస్ట్ హైదరాబాద్ లో అప్పా జంక్షన్ లో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 8,100 ఉండేది. ఇప్పుడు రూ. 7,850కి తగ్గింది.
వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న నార్సింగిలో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 9,950 ఉండగా ఇప్పుడు రూ. 8,200కి తగ్గింది.
వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న నెక్నాంపూర్ లో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 7,700 ఉండగా రూ. 6,500కి తగ్గింది.
వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న నల్లగండ్లలో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు స్థలం రూ. 9,850 ఉండేది. ఇప్పుడు రూ. 9,450 తగ్గింది.
వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న తెల్లాపూర్ లో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 7,150 ఉండగా.. ఇప్పుడు రూ. 6,800గా ఉంది.
వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న హఫీజ్ పేట్ లో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 7,650 ఉండగా.. ఇప్పుడు రూ. 6,900కి తగ్గింది.
వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న మదీనాగూడలో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 6,500 ఉండగా ఇప్పుడు రూ. 6,450గా ఉంది.
వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న పుప్పాలగూడలో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 9,500 ఉండగా ఇప్పుడు రూ. 7,800కి తగ్గింది. చదరపు అడుగు మీద ఏకంగా రూ. 1700 తగ్గింది.
వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న కొల్లూరులో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 5,250 ఉండగా.. ఇప్పుడు రూ. 4,950కి తగ్గింది. అంటే చదరపు అడుగు మీద రూ. 300 తగ్గింది. ఒక 2 బీహెచ్కే స్థలం కొనుక్కున్నట్లైతే దాదాపు 4 లక్షలు ఆదా అవుతాయి.
వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న కోకాపేటలో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 10,600 ఉండగా ఇప్పుడది రూ. 9,900కి పడిపోయింది. చదరపు అడుగు మీద రూ. 700 తగ్గింది. అంటే ఇప్పుడు ఒక 2 బీహెచ్కే (1200 చదరపు అడుగులు) ఇల్లు కొనుక్కున్నట్లైతే రూ. 8,40,000 ఆదా అవుతాయి. 8 లక్షలు అంటే మాటలు కాదుగా.
వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న కొండాపూర్ లో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 10,200 ఉండగా ఇప్పుడు రూ. 9,400కి పడిపోయింది. చదరపు అడుగు మీద రూ. 800 తగ్గింది. అంటే మీరు ఒక 2 బీహెచ్కే ఇల్లు తీసుకున్నట్లైతే దాదాపు 10 లక్షలు ఆదా అయినట్లే.
వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న గచ్చిబౌలిలో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 10,650 ఉండగా ఇప్పుడది రూ. 10,300కి చేరుకుంది.
వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న మాదాపూర్ లో జనవరి-మార్చి నెలల్లో చదరపు అడుగు రూ. 9,950 ఉండగా ఇప్పుడు రూ. 6,950కి పడిపోయింది. ఏకంగా 3 వేలు పడిపోయింది. అంటే ఒక 2 బీహెచ్కే ఫ్లాట్ మీద 36 లక్షలు తగ్గినట్టు. ఇక్కడ ఫ్లాట్ కొనాలంటే ప్రస్తుతం యావరేజ్ గా రూ. 85 లక్షలు దాకా ఉంది. గతంలో అయితే కోటి పైనే ఉండేది.
ఈ ఏరియాల్లో ప్రస్తుతం రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు తగ్గాయి మాదాపూర్ లో అయితే భారీగా తగ్గాయి. కాబట్టి ఇప్పుడు కొనుక్కున్నవారికి లక్షల్లో డబ్బు ఆదా అవుతుంది. అయితే ఈ ధరలనేవి ఆ ఏరియాలలో ఉన్న యావరేజ్ ధరలు. ఈ ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.
గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.