iDreamPost

బ్యాంకు లోన్ చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్న వారికి RBI గుడ్ న్యూస్!

రుణాలు చెల్లించ లేక ఇబ్బంది పడుతున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్తను అందించింది. బ్యాంకులు వసూలు చేసే వడ్డీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రుణగ్రహీతలకు భారీ ఊరట కలుగనున్నది.

రుణాలు చెల్లించ లేక ఇబ్బంది పడుతున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్తను అందించింది. బ్యాంకులు వసూలు చేసే వడ్డీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రుణగ్రహీతలకు భారీ ఊరట కలుగనున్నది.

బ్యాంకు లోన్ చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్న వారికి RBI గుడ్ న్యూస్!

ఏదైన వ్యాపారం చేయాలన్నా లేదా వాహనం కొనుగోలు చేయాలన్నా, లేదా సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఎంతో కొంత రుణాన్ని బ్యాంకుల నుంచి పొందుతుంటారు. బ్యాంకులు రుణ గ్రహీతకు చెందిన అన్ని డాక్యుమెంట్స్ ను సరిచూసుకుని లోన్స్ ను మంజూరు చేస్తాయి. గృహ, వాహన, పర్సనల్ లోన్స్ అందిస్తుంటాయి బ్యాంకులు. అలా తీసుకున్న రుణానికి నెల నెల కొంత మొత్తాన్ని ఈఎంఐ రూపంలో రుణ గ్రహీత చెల్లించాల్సి ఉంటుంది.అయితే ఈఎంఐలు చెల్లించే సమయంలో ఒక్కోసారి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆలస్యం అవుతుంటాయి. ఈ క్రమంలో బ్యాంకులు అధిక వడ్డీలను వసూలు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఈఎంఐలు చెల్లించే వారికి ఆర్బీఐ శుభవార్తను అందించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

లోన్స్ మంజూరు చేసిన బ్యాంకులు రుణ గ్రహీతల నుంచి అధిక వడ్డీలను వసూలు చేస్తుంటాయి. బ్యాంకులు ఇలా చేయకుండా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంతో రుణ గ్రహీతలకు ఊరట కలుగనున్నది. వారిపై ఆర్థిక పరమైన ఒత్తిడిని తగ్గించేందుకు ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటుంది. రుణాలకు సంబంధించిన ఈఎంఐలను చెల్లించేటపుడు ఆలస్యమైతే ఆ సమయంలో బ్యాంకులు వడ్డీపై వడ్డీని వసూలు చేస్తుంటాయి. ఇకపై బ్యాంకులు ఈ విధంగా వసూలు చేయకుండా ఆర్బీఐ నిషేధించింది. లోన్ మంజూరు చేసేటపుడు ఏ వడ్డీ అయితే ఉంటుందో ఆ ప్రకారంగానే వసూలు చేయాలని బ్యాంకులకు సూచించింది.

అంతేగాక నెలవారీ ఈఎంఐని పెంచకుండా రుణ గ్రహీత అనుమతి లేకుండా రుణ వ్యవధి కాలాన్ని పొడిగించకూడదని ఆదేశించింది. ఈఎంఐలలో లేదా లోన్ కాల వ్యవధిలో ఏదైన మార్పులు చేస్తే రుణ గ్రహీతకు తప్పనిసరిగా సమాచారం అందించాలని సూచించింది. రుణ గ్రహీతలు లోన్స్ ను ఎప్పుడైన చెల్లించుకునే విధంగా వెసులుబాటును కల్పించింది. ఈ నిబంధనలు జనవరి 2024 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్బీఐ తెలిపింది. రుణ గ్రహీతల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అన్ని బ్యాంకులు ఈ నిబంధనలను పాటించాలని ఆర్బీఐ ఆదేశించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి