iDreamPost

ఐఫోన్ లవర్స్‌కి అదిరిపోయే శుభవార్త.. ప్రధాన సమస్యకు యాపిల్ కంపెనీ చెక్!

Super Good News To iPhone Lovers: యాపిల్ కంపెనీ ఇప్పుడు ఐఫోన్ ప్రధాన సమస్యపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐఫోన్ లో ప్రధాన సమస్యతో బాధపడుతున్న ఐఫోన్ యూజర్లు పలు ఫిర్యాదులు చేశారు. దీంతో కంపెనీ ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు సరికొత్త సొల్యూషన్ తో ముందుకు రాబోతుందని టాక్. అదే జరిగితే కనుక ఇది ఐఫోన్ లవర్ కి అదిరే శుభవార్త అవుతుంది.

Super Good News To iPhone Lovers: యాపిల్ కంపెనీ ఇప్పుడు ఐఫోన్ ప్రధాన సమస్యపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐఫోన్ లో ప్రధాన సమస్యతో బాధపడుతున్న ఐఫోన్ యూజర్లు పలు ఫిర్యాదులు చేశారు. దీంతో కంపెనీ ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు సరికొత్త సొల్యూషన్ తో ముందుకు రాబోతుందని టాక్. అదే జరిగితే కనుక ఇది ఐఫోన్ లవర్ కి అదిరే శుభవార్త అవుతుంది.

ఐఫోన్ లవర్స్‌కి అదిరిపోయే శుభవార్త.. ప్రధాన సమస్యకు యాపిల్ కంపెనీ చెక్!

ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15 వంటి ఫోన్లలో హీటింగ్ ఇష్యూ ఉందని చాలా మంది యూజర్లు కంప్లైంట్ చేశారు. దీంతో యాపిల్ కంపెనీ తయారు చేస్తున్న ఐఫోన్ 16 మోడల్స్ లో హీటింగ్ ప్రాబ్లమ్ కి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఐఫోన్ 16లో సరికొత్త బ్యాటరీని పరిచయం చేస్తుంది. ఎక్కువగా ఐఫోన్ 15 యూజర్లు ఓవర్ హీటింగ్ ఇష్యూని ఫేస్ చేశారు. అయితే కొత్తగా బయటపడ్డ ఐఫోన్ 16 బ్యాటరీ ఇస్తున్న హింట్ ప్రకారం.. ఐఫోన్ 16లో ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఉండవని తెలుస్తోంది. ఫ్యూచర్ లో రాబోయే ఐఫోన్ సిరీస్ లన్నిటిలోనూ ఓవర్ హీటింగ్ సమస్య రాకుండా టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ కీలక మార్పులు చేస్తుంది. 

ఐఫోన్ 16 బ్యాటరీ లీక్:

  • ఐఫోన్ 16 బ్యాటరీ ఐఫోన్ 15లో ఉన్న బ్యాటరీలానే ఆకారంలోనూ, సైజ్ లోనూ ఒకేలా ఉంటుందట. 
  • ఇది ఐఫోన్ 16 బ్యాటరీ మిగతా స్మార్ట్ ఫోన్ల బ్యాటరీలా బ్లాక్ ఫాయిల్ తో కాకుండా మెటల్ తో కప్పబడి ఉంటుంది. మెటల్ తో బ్యాటరీని సీల్ చేయడం వల్ల ఓవర్ హీట్ సమస్య రాదట. 
  • అంతేకాదు తాజా లీక్ ప్రకారం.. ఐఫోన్ 16 బ్యాటరీ 3,597 ఎంఏహెచ్ సామర్థ్యంతో రానుందట. ఇది ఐఫోన్ 15 బ్యాటరీ కంటే కూడా ఎక్కువ. ఐఫోన్ 15లో 3367 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

గతంలో పలువురు ఐఫోన్ 15 యూజర్లు.. సోషల్ మీడియా వినియోగంలో ఉండగా ఐఫోన్ 15 బాగా హీట్ అవుతుందని ఫిర్యాదు చేశారు. దీంతో యాపిల్ కంపెనీ.. ఈ సమస్యలను ఆపరేటింగ్ సిస్టంలో బగ్ కి ఆపాదించింది. కానీ ఐఫోన్ 16 బ్యాటరీకి సంబంధించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే తాజా నివేదికల ప్రకారం.. ఐఫోన్ 16 రీడిజైన్డ్ కెమెరా సెటప్ ఫీచర్ తో రానుందని సమాచారం. ఐఫోన్ లో ఉన్న రంగులతో పోలిస్తే ఐఫోన్ 16 తెలుగు, నలుపు, నీలం, ఆకుపచ్చ, పింక్ కలర్ షేడ్స్ లో రానుందట. లీక్ అయిన తాజా రూమర్స్ ప్రకారం.. ఐఫోన్ 16లో యాక్షన్ బటన్, క్విక్ వీడియో రికార్డింగ్ కోసం క్యాప్చర్ బటన్, ఫోకస్ అడ్జస్ట్ మెంట్స్, జూమ్ కంట్రోల్ వంటి పలు ఫీచర్స్ ఉన్నాయట. మరో విశేషం ఏంటంటే.. ఐఫోన్ 16 స్పేషియల్ వీడియో రికార్డింగ్ ని సపోర్ట్ చేస్తుందట. మొత్తానికి అయితే బ్యాటరీ లీక్ ఇస్తున్న హింట్ ని బట్టి యాపిల్ కంపెనీ బ్యాటరీ ఓవర్ హీట్ ఇష్యూని సాల్వ్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఐఫోన్ యూజర్స్ కి ఇంతకంటే మంచి వార్త మరొకటి ఉండదు.        

హైలైట్స్: 

  • ఐఫోన్ 16 బ్యాటరీ హీట్ ని తగ్గించడానికి సాధారణ బ్లాక్ ఫాయిల్ కి బదులుగా మెటల్ తో కప్పబడి ఉంటుంది. 
  • ఐఫోన్ 16 బ్యాటరీ 3,597 ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. ఇది ఐఫోన్ 15 బ్యాటరీ కంటే కూడా ఎక్కువ. ఐఫోన్ 15లో 3367 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
  • ఐఫోన్ 16 ఇతర మోడల్స్ తో పాటు 2024 తర్వాత లాంఛ్ అవ్వనున్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి