iDreamPost

బాలయ్య చిన్నల్లుడికి బాబు హ్యాండ్! భరత్ ఆశలకు చిల్లు?

  • Published Jan 17, 2024 | 3:16 PMUpdated Jan 17, 2024 | 3:16 PM

నమ్ముకున్న వారిని నట్టేట ముంచడంలోనూ.. వారికి హ్యాండ్‌ ఇవ్వడంలోనూ చంద్రబాబు నాయుడు సిద్ధ హస్తుడని వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా బాలయ్య చిన్నల్లుడికి కూడా బాబు హ్యాండ్‌ ఇవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు

నమ్ముకున్న వారిని నట్టేట ముంచడంలోనూ.. వారికి హ్యాండ్‌ ఇవ్వడంలోనూ చంద్రబాబు నాయుడు సిద్ధ హస్తుడని వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా బాలయ్య చిన్నల్లుడికి కూడా బాబు హ్యాండ్‌ ఇవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు

  • Published Jan 17, 2024 | 3:16 PMUpdated Jan 17, 2024 | 3:16 PM
బాలయ్య చిన్నల్లుడికి బాబు హ్యాండ్! భరత్ ఆశలకు చిల్లు?

త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలవడనుంది. ఎన్నికల కోసం పార్టీలన్ని రెడీ అవుతున్నాయి. అధికార వైసీపీ ఓ అడుగు ముందే ఉంది. రానున్న ఎన్నికల్లో అనగా అసెంబ్లీ, లోక్‌సభ ఎలక్షన్స్‌లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అందుకు తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేస్తోంది. సామాజిక కారణాలతో పాటు.. సిట్టింగ్‌లపై జనాభిప్రాయం వంటి అంశాలన్నింటిని బేరీజు వేసుకుని.. ఇన్‌ఛార్జీలను ప్రకటిస్తూ.. దూకుడుగా ముందుకు సాగుతుంది. ఇక రానున్న ఎన్నికల్లో.. అధికార పార్టీని ఓడించడం కోసం జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కలిసి పోటీ చేస్తామని ప్రకటించాయి కానీ.. ఇప్పటి వరకు సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎలాంటి అప్డేట్‌ లేదు.

పైగా కూటమి కారణంగా.. పలు చోట్ల ఇరు పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న వారికి భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ పండితులు. వ్యతిరేక ఓటు సంగతి పక్కకు పెడితే.. ఇరు పార్టీల నేతల మధ్యనే విభేదాలు పెరిగి.. వారిలో వారు తన్నుకునే పరిస్థితులు ఇప్పటికే రాగా.. భవిష్యత్తులో అవి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ క్రమంలో తాజాగా కూటమి.. అటూ వైసీపీ వ్యూహాల కారణంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడికి.. బాబు హ్యాండ్‌ ఇవ్వనున్నారనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇంతకు ఏం జరిగింది అంటే..

విజయనగరంలో సభ అయితే.. విశాఖలో ఫ్లెక్సీలు..

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్.. రానున్న ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేయాలని బలంగా నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. విశాఖ ఎంపీ సీటు కోసం తన తోడల్లుడు లోకేష్‌, చంద్రబాబులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో మునిగి ఉన్నారు. ఈక్రమంలోనే విజయనగరం జిల్లాలో యువగళం పాదయాత్రం ముగింపు జరిగితే విశాఖ నిండా ఫ్లెక్సీలు వేసి మరీ లోకేష్‌పై ప్రశంసలు కురిపించడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు రాజకీయ పండితులు. పైగా శ్రీభరత్‌ ఎప్పటి నుంచో విశాఖ ఎంపీ టికెట్ మీద కోటి ఆశలు పెట్టుకున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అంతేకాక శ్రీభరత్‌.. 2019 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి ఓడిపోయాడు. దాంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసి.. విజయం సాధించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడట.

అయితే శ్రీభరత్‌కు టికెట్‌ రావడం అంత ఈజీ కాదంటున్నారు రాజకీయ పండితులు. టికెట్‌ పొందాలంటే ఆయన ఎన్నో అవరోధాలు దాటాలని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన కలిసి పోగా.. రానున్న రోజుల్లో బీజేపీ కూడా పొత్తులో భాగంగా.. ఈ కూటమితో జత కడితే.. ఈ సీటు.. కమలం పార్టీకే కేటాయించే అవకాశం ఉందంటున్నారు. అలా కాదు అనుకుంటే ఇప్పటికే జనసేన విశాఖ సీటు మీద కన్నేసింది అంటున్నారు రాజకీయ పండితులు. కాపులకు ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ మిత్రపక్షం నుంచి ఎప్పటి నుంచో డిమాండ్‌ వినిపిస్తోందట. దాంతో విశాఖ ఎంపీ సీటు జనసేనకు ఇవ్వొచ్చు అంటూ ఇప్పటికే ఓ ప్రచారం తెర మీదకు వచ్చింది.

వైసీపీ వ్యూహం.. చంద్రబాబుకు షాక్‌..

సీటు ఎవరికి కేటాయిస్తారు అనే అంశం పక్కకు పెడితే.. విశాఖలో వైసీపీ వ్యూహం చూస్తే.. టీడీపీ, జనసేన నేతలకు దిమ్మ తిరుగుతుంది. ఎందుకంటే విశాఖ ఎంపీ సీటు గత నాలుగు దశబ్దాలుగా ఓసీలకే పరిమితం అవుతూ వస్తోంది. దాంతో ఈసారి విశాఖ సీటుకు బీసీని ఎంపిక చేసింది వైసీపీ. దానిలో భాగంగానే.. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మి పేరుని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని టీడీపీ ఊహించలేదు. బొత్స లక్ష్మి స్థానికురాలు మాత్రమే కాక.. బీసీ మహిళ కావడం వైసీపీకి కలిసి వస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే జగన్‌.. ఈ నిర్ణయం తీసుకున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.

వైసీపీ నిర్ణయం ఫలితం టీడీపీ మీద గట్టి ప్రభావం చూపబోతుంది అంటున్నారు రాజకీయ పండితులు. ఒకవేళ రానున్న ఎన్నికల్లో.. టీడీపీ కనక.. విశాఖ ఎంపీ సీటును బీసీలకు ఇవ్వకపోతే.. అది వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ పండితులు. అలాకాకుండా పొత్తులో భాగంగా విశాఖ టికెట్‌ని గనక బీజేపీ, జనసేనలకు ఇస్తే.. ఆ పార్టీలకు ఇక్కడ బలమైన అభ్యర్థలు లేరని తెలుస్తోంది. అలా కాకుండా టీడీపీకే విశాఖ సీటు కేటాయిస్తే.. అప్పుడు కచ్చితంగా ఆ పార్టీ.. విశాఖ ఎంపీ సీటును బీసీలకే కేటాయించాల్సిన పరిస్థితి వస్తుంది.

ఎందుకంటే.. టీడీపీ తనకు తానే బీసీల పార్టీగా ప్రచారం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీ సీటును బీసీలకే కేటాయించే అవకాశం ఉందని.. ఈ విషయంలో చంద్రబాబు కుటుంబం కన్నా పార్టీ గెలుపుకే ప్రాధాన్యత ఇస్తారని.. అందుకే బాలయ్య చిన్నల్లుడికి బాబు హ్యాండ్‌ ఇవ్వడానికి కూడా వెనకాడడని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దాంతో బాలయ్య చిన్నల్లుడికి బాబు హ్యాండ్‌ ఇవ్వడం కన్ఫామ్‌ అనే ప్రచారం సాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి