iDreamPost

అతి తక్కువ ధరకే అదనపు డేటా.. రూ.100లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే!

మీరు స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వినియోగిస్తారా? మీ డైలీ డేటా సరిపోవడం లేదా? అయితే మీలాంటి వారి కోసం అతి తక్కువ ధరకే అదనపు డేటా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మీరు స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వినియోగిస్తారా? మీ డైలీ డేటా సరిపోవడం లేదా? అయితే మీలాంటి వారి కోసం అతి తక్కువ ధరకే అదనపు డేటా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అతి తక్కువ ధరకే అదనపు డేటా.. రూ.100లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే!

టెలికాం రంగంలో రిలయన్స్ జియో పెను సంచలనానికి తెరలేపింది. అప్పటి వరకు ఎయిర్ టెల్, ఐడియా నెట్ ఇతర టెలికాం నెట్ వర్స్క్ తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న తరుణంలో టెలికాం రంగంలోకి ప్రవేశించింది జియో. ఫ్రీ సిమ్ కార్డు, ఫ్రీ ఆఫర్స్ తో కోట్లాది మంది కస్టమర్లను తన యూజర్లుగా మార్చుకుంది జియో. కాగా జియో తన కస్టమర్ల కోసం అద్భుతమైన ప్లాన్స్ అందిస్తోంది. ముఖ్యంగా డేటా విషయంలో కస్టమర్ల కోసం ది బెస్ట్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది రిలయన్స్ జియో. అదనపు డేటా కావాలనుకునే వారికి అతి తక్కువ ధరకే రీఛార్జ్ ఆఫర్లను తీసుకొచ్చింది. రూ. 100 లోపు అనగా రూ.15, రూ.19, రూ.25, రూ.29, రూ.61 తో అదనపు డేటా కోసం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆ ప్లాన్ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రూ.15 రీఛార్జ్ ప్లాన్

  • జియో రూ. 15 డేటా వోచర్ ప్లాన్ మీకు 1జీబీ అదనపు డేటాను అందిస్తుంది. మీ డైలీ డేటా అయిపోయిన తర్వాత మీరు 1జీబీ అదనపు డేటా కోసం ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.

రూ.19 రీఛార్జ్ ప్లాన్

  • జియో మరో బూస్టర్ డేటా ప్లాన్‌ను కూడా ప్రారంభించింది, దీని ధర కేవలం రూ.19 మాత్రమే. ఇందులో, సాధారణ డేటా కాకుండా, మీకు 1.5జీబీ అదనపు డేటా ఇవ్వబడుతుంది.

రూ.25 రీఛార్జ్ ప్లాన్

  • రిలయన్స్ జియో వినియోగదారులకు రూ.25 రీఛార్జ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. దీనితో డైలీ డేటా పరిమితి ముగిసిన తర్వాత మీరు 2జీబీ వరకు అదనపు డేటాను పొందుతారు. మీరు మీ ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్ వాలిడిటీ వ్యవధిలోపు ఈ రీఛార్జ్ ప్లాన్ బెనిఫిట్ పొందవచ్చు.

రూ. 29 రీఛార్జ్ ప్లాన్

  • జియో అందించే మరో డేటా ప్లాన్ రూ.29 రీఛార్జ్ ప్లాన్‌. ఇందులో జియో 2.5జీబీ అదనపు డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ మీకు ఏ ఇతర ప్రయోజనాన్ని ఇవ్వదు కానీ మీరు ఇప్పటికే ఉన్న ప్లాన్ వాలిడిటీ వరకు దీనిని ఉపయోగించవచ్చు.

రూ.61 రీఛార్జ్

  • జియో నుంచి మరో డేటా రీఛార్జ్ ప్లాన్ రూ.61. మీరు 6 జీబీ వరకు డేటాను పొంది అనేక బెనిఫిట్స్ పొందుతారు, ఈ ప్లాన్ వాలిడిటీలో ఉన్నంత వరకు మీరు ఉపయోగించవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి