iDreamPost

నిర్మాణంలో ఉన్న ఇల్లు, కట్టేసిన ఇల్లు.. ఏది కొంటే లాభం?

ఇల్లు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. అయితే కట్టిన ఇల్లు కొనుక్కోవాలా? లేక కడుతున్న ఇల్లు కొనుక్కోవాలా? ఏది కొనుక్కుంటే లాభం అనేది అందరికీ స్పష్టత ఉండకపోవచ్చు. కట్టేసిన ఇల్లు లేదా కడుతున్న ఇల్లు ఏది కొంటే లాభం ఉంటుంది? దీని మీద నిపుణులు ఏం చెబుతున్నారు?

ఇల్లు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. అయితే కట్టిన ఇల్లు కొనుక్కోవాలా? లేక కడుతున్న ఇల్లు కొనుక్కోవాలా? ఏది కొనుక్కుంటే లాభం అనేది అందరికీ స్పష్టత ఉండకపోవచ్చు. కట్టేసిన ఇల్లు లేదా కడుతున్న ఇల్లు ఏది కొంటే లాభం ఉంటుంది? దీని మీద నిపుణులు ఏం చెబుతున్నారు?

నిర్మాణంలో ఉన్న ఇల్లు, కట్టేసిన ఇల్లు.. ఏది కొంటే లాభం?

ఇల్లు కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఇల్లు ఎప్పుడు కొనాలి అన్న స్పష్టత చాలా మందికి ఉండదు. నిర్మాణంలో ఉండగా కొనాలా లేక నిర్మాణం జరిగిన ఇల్లు కొనాలా? ఏది కొంటే లాభం ఉంటుంది అనే దాని మీద అవగాహన లేక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అయితే ఇవాళ ఈ కథనంలో మీరు.. కడుతున్న ఇల్లు కొంటే లాభమా? లేక కట్టేసిన ఇల్లు కొంటే లాభమా? అనేది తెలుసుకోబోతున్నారు. 

రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఇల్లు కొనాలనుకునేవారి అవసరాలు, ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఇంటిని కొనాలా లేక ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగిన ఇంటిని కొనాలా అనే విషయం మీద తగిన సలహాలు ఇస్తుంటారు. అయితే ఈ రెండిటిలో ఏది కొనాలి అనే నిర్ణయం తీసుకునే ముందు లాభాలు, నష్టాలు వంటి వాటిని ముందుగానే తెలుసుకోవాలని సూచిస్తున్నారు. అయితే నిర్మాణం జరిగే వరకూ ఎదురుచూసే ఓపిక, దాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ గా చూసే వారికి నిర్మాణంలో ఉన్న ఇల్లు అయితే బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నిర్మాణం జరిగిన తర్వాత కంటే కూడా నిర్మాణంలో ఉన్న సమయంలోనే దాని విలువ తక్కువగా ఉంటుంది.

new house

మొదట్లో కొన్న రేటు, నిర్మాణం జరిగిన తర్వాత వచ్చే రేటు కంపేర్ చేసుకుంటే లాభం పొందుతారని చెబుతున్నారు. ఎందుకంటే నిర్మాణంలో ఉన్నప్పుడు కంటే కూడా నిర్మాణం అయిపోయిన ఇళ్ళని కొనుగోలు చేయడానికి జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలో డిమాండ్ పెరిగి ఇళ్ల రేట్లు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే కొనే ముందు ఆ ఇంటి నిర్మాణం ఎంత నాణ్యతగా కడుతున్నారు? డెవలపర్స్, బిల్డర్స్ ఎవరో ఏంటి అనేవి బాగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. నిర్మాణంలో ఉన్న ఇళ్లను కొనే ముందు మెయింటెనెన్స్ ఛార్జీలు, ప్రాపర్టీ ట్యాక్స్, హోమ్ లోన్ ఇంట్రస్ట్ వంటి హిడెన్ ఛార్జీల గురించి తెలుసుకోవాలని చెబుతున్నారు. తక్కువ ధర, నిర్మాణం జరిగిన ప్రాపర్టీల కంటే నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీలు అత్యధిక లాభాలను ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేయడం వల్ల ఏ ఫ్లోర్ కావాలి? ఎలాంటి సౌకర్యాలు ఉండాలి? అనేవి ముందుగానే మన అభిరుచికి తగ్గట్టు మార్పులు చేసుకునే అవకాశం కల్పిస్తారు. అయితే ఈ నిర్మాణంలో ఉన్న ఇల్లు కొనడం కోసం హోమ్ లోన్ తీసుకున్నట్లైతే ఇల్లు సిద్ధం అవ్వడానికి ఎన్ని నెలలు పడుతుంది? అన్ని నెలల పాటు బ్యాంకు వడ్డీ ఎంత అవుతుంది? ఆ సమయానికి ఇంటి విలువ ఎంత పెరుగుతుంది? వంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా చూసినా గానీ ప్రాపర్టీ వేల్యూ అనేది సిద్ధంగా ఉన్న ప్రాపర్టీతో పోల్చుకుంటే ఎక్కువే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఓపిక లేని వాళ్ళు.. హోమ్ లోన్ ఇంట్రస్ట్ అనవసరంగా బ్యాంకు వాళ్ళకి కట్టాలి అనుకునేవారికి మాత్రం నిర్మాణంలో ఉన్న ఇల్లే బెటర్. కానీ నిర్మాణంలో ఉన్న ఇంటి కంటే ఎక్కువ ధర చెల్లించామన్న బాధ అయితే ఉంటుంది. ఈ కథనం ఉపయోగపడుతుందని భావిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ లో షేర్ చేయండి. అలానే మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి