iDreamPost

RCB vs GT: లైవ్ టెలికాస్ట్​లో కోహ్లీపై విరుచుకుపడ్డ గవాస్కర్.. ఈ వార్ ఇప్పట్లో చల్లారేలా లేదు!

  • Published May 05, 2024 | 3:07 PMUpdated May 05, 2024 | 3:07 PM

స్టార్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీపై భారత బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ మరోమారు విరుచుకుపడ్డాడు. లైవ్ టెలికాస్ట్​లోనే కింగ్​ను టార్గెట్ చేసుకొని విమర్శలు చేశాడు.

స్టార్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీపై భారత బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ మరోమారు విరుచుకుపడ్డాడు. లైవ్ టెలికాస్ట్​లోనే కింగ్​ను టార్గెట్ చేసుకొని విమర్శలు చేశాడు.

  • Published May 05, 2024 | 3:07 PMUpdated May 05, 2024 | 3:07 PM
RCB vs GT: లైవ్ టెలికాస్ట్​లో కోహ్లీపై విరుచుకుపడ్డ గవాస్కర్.. ఈ వార్ ఇప్పట్లో చల్లారేలా లేదు!

రాయల్ ఛాలెంజర్స్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్​లో ఫుల్ ఫామ్​లో ఉన్నాడు. ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచుల్లో కలిపి 542 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలతో పాటు ఓ సెంచరీ కూడా ఉంది. ఆర్సీబీ కోసం కాకుండా విరాట్ బ్యాటింగ్​ను చూసేందుకే అభిమానులు భారీగా స్టేడియాలకు తరలుతున్నారు. టికెట్ల కోసం వాళ్లు పెట్టిన డబ్బులకు కింగ్ న్యాయం చేస్తున్నాడు. అలాంటి కోహ్లీని టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంత బాగా ఆడుతున్నప్పటికీ విరాట్​ను గవాస్కర్ క్రిటిసైజ్ చేయడానికి అతడి స్ట్రైక్ రేటే కారణం. వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం సన్​రైజర్స్ హైదరాబాద్​తో మ్యాచ్​తో మొదలైంది.

కోహ్లీ-గవాస్కర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరి మీద ఒకరు కౌంటర్లకు దిగుతున్నారు. గత నెల 25వ తేదీన సన్​రైజర్స్ హైదరాబాద్​తో మ్యాచ్​లో విరాట్ 43 బంతుల్లో 51 రన్స్ చేశాడు. మొదట్లో వేగంగానే ఆడినా మధ్యలో వికెట్లు పడటంతో అతడు నెమ్మదించాడు. 118.60 స్ట్రైక్ రేట్​తో స్లోగా బ్యాటింగ్ చేయడంతో కింగ్ మీద విమర్శలు వచ్చాయి. ఇదేం బ్యాటింగ్, టాప్ ప్లేయర్ అయ్యుండి ఇలా సింగిల్స్​కే పరిమితవడం కరెక్ట్ కాదంటూ గవాస్కర్ సీరియస్ అయ్యాడు. దీనిపై అదే నెల 28వ తేదీన గుజరాత్ టైటాన్స్​తో మ్యాచ్ అనంతరం విరాట్ రియాక్ట్ అయ్యాడు. మ్యాచ్ సిచ్యువేషన్స్ తెలియకుండా కామెంట్రీ బాక్స్​లో కూర్చొని మాట్లాడటం కరెక్ట్ కాదన్నాడు. ఈ కౌంటర్​ను సీరియస్​గా తీసుకున్న గవాస్కర్ నిన్న గుజరాత్-ఆర్సీబీ మ్యాచ్ తర్వాత నేరుగా లైవ్​లోనే కోహ్లీపై విరుచుకుపడ్డాడు.

‘కోహ్లీ స్ట్రైక్ రేట్ 118గా ఉన్నప్పుడు మాత్రమే కామెంటేటర్లు క్వశ్చన్ చేశారు. నేను ఎక్కువగా మ్యాచ్​లు చూడను. కాబట్టి ఇతర కామెంటేటర్లు ఏమన్నారో నాకు తెలియదు. కానీ ఓపెనర్​గా వచ్చిన ఇన్నింగ్స్​ను స్టార్ట్ చేసే ప్లేయర్ ఇలా 118 స్ట్రైక్ రేట్​తో ఆడితే ఏమనాలి? అది కూడా 14, 15వ ఓవర్​ వరకు క్రీజులో ఉండి ఈ స్ట్రైక్ రేట్​తో ఆడుతూ ఔట్ అయితే చప్పట్లు కొట్టమంటారా? బయటి నుంచి వచ్చే విమర్శల్ని తాము పట్టించుకోమంటూ బిల్డప్ ఇస్తారు. అలాంటప్పుడు ఎందుకు ఈ కామెంట్స్​కు రిప్లయ్ ఇస్తున్నారు? మేమంతా అంతో ఇంతో క్రికెట్ ఆడాం. మాకు ఎలాంటి అజెండాలు లేవు. ఏం జరుగుతోందో దాని గురించే మాట్లాడతాం. ఎవరి గురించి కూడా కావాలని ఏమీ కామెంట్ చేయం’ అని గవాస్కర్ స్పష్టం చేశాడు. కోహ్లీ-గవాస్కర్ డైలాగ్ వార్​పై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. కొందరు విరాట్​కు మద్దతుగా నిలిస్తే, ఇంకొందరు గవాస్కర్​కు సపోర్ట్​గా ఉంటున్నారు. కోహ్లీ తన స్ట్రైక్ రేట్​ను మరింత మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నారు. అదే టైమ్​లో గవాస్కర్ కూడా సీనియర్ కాబట్టి ఏదైనా ఉంటే ప్లేయర్లతో డైరెక్ట్​గా మాట్లాడి సజెషన్స్ ఇస్తే బాగుంటుందని.. ఇలా లైవ్​లో విరుచుకుపడటం సరికాదని అంటున్నారు. మరి.. కోహ్లీ-గవాస్కర్ వార్​ పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి