iDreamPost
android-app
ios-app

25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో దొరికింది! ఇప్పుడు దేశం మొత్తం గర్వపడేలా చేసింది!

  • Published May 18, 2024 | 7:27 PMUpdated May 18, 2024 | 7:27 PM

పుట‍్టుకతోనే కంటిచూపు కోల్పోయిన ఓ యువతి.. తన విధిరాతకు తల వంచలేదు. అలాగే తనకున్న లోపానికి కుంగిపోలేదు. ముఖ్యంగా..25 కన్న తల్లిదండ్రులే పుట్టగానే తనని వద్దనుకుని చెత్తకుప్పలో పడేశారు. కానీ,  ఇప్పుడు ఆ అమ్మాయే అందరీ దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేసింది. మరి ఆమె జీవితగాథ గురించి తెలుసుకుందాం.

విధిరాత.. దీని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అంటారు పెద్దలు. ఎందుకంటే.. ప్రతిఒక్కరి నుదిట రాతాను ఆ భగవంతుడే రాస్తాడని, దీనిని ఎవరు మార్చలేరని చాలామంది అంటుటారు. కానీ, ఇటీవల కాలంలో ఎంతోమంది ఈ విధిరాతనే సవాలుగా చేసుకుంటూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. ముఖ్యంగా.. అంగవైకల్యం గా ఉండి దేనికి పనికిరారు, ఏమి సాధించలేరు అనుకున్న వాళ్లు సైతం తమ రాతలను తామే మార్చుకుంటూ తమ జీవితాల‍్లో వెలుగుల నింపుకుంటూ.. మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతుంటారు. తాజాగా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ అమ్మాయి కూడా ఆ కోవకు చెందినదే. మరి, ఆమె జీవితగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పుట‍్టుకతోనే కంటిచూపు కోల్పోయిన ఓ యువతి.. తన విధిరాతకు తల వంచలేదు. అలాగే తనకున్న లోపానికి కుంగిపోలేదు. ముఖ్యంగా..25 కన్న తల్లిదండ్రులే పుట్టగానే తనని వద్దనుకుని చెత్తకుప్పలో పడేశారు. కానీ,  ఇప్పుడు ఆ అమ్మాయే మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ క్లియర్ చేసి ముంభై సెక్రటేరియట్‌లో క్లర్క్ కం టైపిస్ట్ జాబ్ కొట్టి అందరి దృష‍్టిని అందరి చూపునే తనవైపు తిప్పుకునేలా చేసింది. ఆమె పేరే మాలా పాపాల్కర్‌.

ఈమె పుట్టుకతోనే అంధురాలు. ఇక పుట్టుగానే ఆ చిన్నారిని కన్నవారు చెత్తకుప్పలో పడేయటంతో.. తనని జల్గావ్ లోని రిమాండ్ హోమ్ కు తరలించారు. కాగా, అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరం ఉన్న అంధుల అనాథాశ్రమంలో చేర్చారు. ఇక అక్కడే ఆ అమ్మాయి బ్రెయిలీ లిపిలో చదువుకుంది. అంతేకాకుండా.. పద్మ శ్రీ అవార్డ్ గ్రహిత శంకర్ బాబా పాపల్కర్(81) ఆ చిన్నారికి తన ఇంటి పేరుతో నామకరణం చేశారు. అలాగే బ్రెయిలీ లిపిలో చదువు చెప్పించాడు.

ఇక తాజాగా మే 16న విడుదలైన మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) ఫలితాల్లో మాలా మంచి ర్యాంక్‌ ను తెచ్చుకుంది. ఈ క్రమంలోనే.. ముంభై సెక్రటేరియట్ లో క్లర్క్ కం టైపిస్ట్ జాబ్ ను సాధించింది. కాగా, నన్ను రక్షించి, ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావడానికే దేవుడు ఈ అనాథాశ్రమం వాళ్లను పంపించాడని, ఇక్కడితో తాను ఆగనని యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతానని IAS అవడమే తన లక్ష్యమని మాలా చెప్తుతోంది. మరి, ఒక ఆంధ్రురాలు అయిన మాలా ఇంతటి ఘనత సాధించడంతో పాటు తాను కలలు కంటున్న లక్ష్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి