iDreamPost

మూవీల వర్స్ కు గుడ్ న్యూస్.. ఒకే ప్లాన్‌ కింద ఓటీటీ, టీవీ చానళ్లను చూసే ఛాన్స్

మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్. ఇప్పుడు సినిమా చానళ్లతో పాటు ఓటీటీ యాప్స్ ను కూడా పొందొచ్చు. ఒక్క ప్లాన్ తోనే ఈ సేవలను పొందే అవకాశాన్ని డిష్ టీవీ కల్పిస్తోంది.

మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్. ఇప్పుడు సినిమా చానళ్లతో పాటు ఓటీటీ యాప్స్ ను కూడా పొందొచ్చు. ఒక్క ప్లాన్ తోనే ఈ సేవలను పొందే అవకాశాన్ని డిష్ టీవీ కల్పిస్తోంది.

మూవీల వర్స్ కు గుడ్ న్యూస్.. ఒకే ప్లాన్‌ కింద ఓటీటీ, టీవీ చానళ్లను చూసే ఛాన్స్

ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ బజ్ కొనసాగుతోంది. ఓటీటీ సంస్థలకు మూవీలవర్స్ నుంచి ఆదరణ పెరుగుతోంది. ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక ఎక్కడంటే అక్కడ.. ఎప్పుడంటే అప్పుడు సినిమా చూసే అవకాశం లభించినట్లైంది. థియేటర్లో సినిమాలు మిస్ అయిన వారు ఓటీటీ రిలీజ్ ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అదీకాక థియేటర్ కు వెళ్తే ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. అదే ఓటీటీలో అయితే ఒకసారి సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే చాలు ఎంచక్కా నచ్చిన సినిమాలను, సిరీస్ లను చూడొచ్చు. అయితే ఇప్పుడు మూవీ లవర్స్ కు మరో బంపరాఫర్ వచ్చింది. ఒక్క ప్లాన్ తో ఓటీటీ యాప్స్, సినిమా ఛానళ్లను పొందొచ్చు. ఈ సేవలను డిష్ టీవీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

డిజిటల్ ప్రపంచంలో తమ సత్తా చాటేందుకు కంపెనీలు అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త ప్లాన్ లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో డిష్‌ టీవీ కొత్తగా స్మార్ట్‌ప్లస్‌ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. కస్టమర్లు ఒకే ప్లాన్‌తో టీవీ చానళ్లు, ఓటీటీ యాప్స్‌ను కూడా పొందొచ్చు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్లాన్‌ తోనే వీటిని పొందవచ్చని సంస్థ సీఈవో మనోజ్‌ దోభల్‌ తెలిపారు. రూ. 200 ప్యాక్‌ నుంచి ఇది అందుబాటులో ఉంటుంది.

పాత, కొత్త కస్టమర్లు.. స్మార్ట్‌ప్లస్‌ కింద సదరు ప్లాన్‌లోని టీవీ ఛానళ్లతో పాటు డిఫాల్టుగా లభించే హంగామా వంటి అయిదు ఓటీటీ యాప్‌లతో పాటు జీ5, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్, సోనీ లివ్‌ తదితర యాప్‌ల నుంచి ఒకటి ఎంచుకోవచ్చు. మూడు రోజుల తర్వాత మరో యాప్‌నకు మారే అవకాశాన్ని కూడా కల్పించింది. పూర్తి ఓటీటీ యాప్‌లు పొందాలంటే నెలకు రూ. 179 ప్యాక్ తీసుకోవాలి. ఈ ప్లాన్‌లో భాగంగా సెట్‌-టాప్‌ బ్యాక్స్‌, స్మార్ట్‌ ఆండ్రాయిడ్‌ ఎస్‌టీబీతో ఈ సేవలు పొందవచ్చునని తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి