iDreamPost
android-app
ios-app

Heart Touching Movie In OTT: భర్తకి తెలియకుండా పేషంట్ తో డాక్టరమ్మ ప్రేమ! OTTలో ఈ మూవీ చూశారా?

  • Published May 18, 2024 | 6:50 PMUpdated May 18, 2024 | 6:50 PM

OTT Movie Suggestion: కొన్ని సినిమాలు రొటీన్ కు భిన్నంగా తెలిసిన స్టోరీ లైన్ తోనే వస్తూ ఉంటాయి. అటువంటి సినిమాలు తీసేందుకు, ప్రేక్షకులను మెప్పించి ఒప్పించేందుకు కాస్త కష్టపడుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.

OTT Movie Suggestion: కొన్ని సినిమాలు రొటీన్ కు భిన్నంగా తెలిసిన స్టోరీ లైన్ తోనే వస్తూ ఉంటాయి. అటువంటి సినిమాలు తీసేందుకు, ప్రేక్షకులను మెప్పించి ఒప్పించేందుకు కాస్త కష్టపడుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.

  • Published May 18, 2024 | 6:50 PMUpdated May 18, 2024 | 6:50 PM
Heart Touching Movie In OTT: భర్తకి తెలియకుండా పేషంట్ తో డాక్టరమ్మ ప్రేమ! OTTలో  ఈ మూవీ చూశారా?

ఓటీటీ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని భాషల చిత్రాలు ప్రేక్షకులను మెప్పించేందుకు ఓటీటీ లలో రిలీజ్ అవుతున్న మాట వాస్తవమే. అయితే వీటిలో వచ్చిన ఎన్ని సినిమాలను ప్రేక్షకులు మిస్ చేయకుండా చూస్తున్నారు అనే విషయాన్నీ గమనిస్తే కనుక అందరు హర్రర్, రొమాన్స్,థ్రిల్లర్ వేటలో పడిపోయి.. కొన్ని మంచి లవ్ స్టోరీస్ ను మిస్ చేసేస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అలాంటిదే. లవ్ స్టోరీ ఏ కదా ఏముంటుందిలే అని లైట్ తీసుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఇది మామూలు లవ్ స్టోరీ కాదు.. రొటీన్ కి భిన్నంగా.. ఓ డాక్టర్ కు , కొద్దీ రోజుల్లో చనిపోయే ఓ పేషెంట్ కు మధ్య జరిగిన ఓ ప్రేమ కథ. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఇలాంటి కంటెంట్ తో సినిమాలు తీయాలంటే కేవలం.. ఇతర భాషల దర్శకులకే సాధ్యం. హిట్స్ ప్లోప్స్ తో సంబంధం లేకుండా తమ దగ్గర ఉన్న కంటెంట్ ను అందంగా తీర్చిదిద్ది ప్రేక్షకుల ముందు పెట్టడంలో వారు ముందుటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇతర భాషకు చెందిందే. ఇది కన్నడకు చెందిన సినిమా ఈ సినిమా పేరు “స్వాతి ముత్తిన మళె హనియె”. అంటే తెలుగులో స్వాతి చినుకు అని అర్ధం. కానీ ఈ సినిమా తెలుగులో మాత్రం అందుబాటులో లేదు. కానీ కన్నడలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. కాసేపు సస్పెన్స్ లు, హర్రర్ లు , థ్రిల్లర్ లు పక్కన పెట్టేసి ఓ మంచి ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఇప్పటివరకు ఈ సినిమా చూడని వారు ఉంటె చూసేయండి. అసలు ఏముంది ఈ సినిమాలో అని తెలుసుకోవాలంటే ఈ సినిమా కథ చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. రేపో మాపో చనిపోయే వ్యక్తుల ప్రేమ కథ ఇది. ఇది చెప్పగానే అందరికి గీతాంజలిలో చూశాం కదా అనే ఫీలింగ్ రావొచ్చు . కానీ ఈ కథ అలాంటిది కాదు ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ కు ఆల్రెడీ పెళ్లి అయ్యి ఉంటుంది. హీరో మాత్రం త్వరలో మరణించబోయే ఓ క్యారెక్టర్. అసలు కథేంటంటే ఆశ్రయ అనే ఓ సంస్థ ఉంటుంది. అక్కడ రెండుమూడు నెలలకన్నా ఎక్కువ బ్రతకలేని రోగులను చేర్చుకుని.. వారికి దైర్యం చెప్తూ ఉంటుంది ప్రేరణ అనే అమ్మాయి. క్రమంగా ఆమెకు అది ఓ ఉద్యోగంతో పాటు జీవితంలో భాగం అయిపోతుంది. అయితే ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయ్యి ఉంటుంది. కానీ ఆమె భర్త మాత్రం మరొకరితో రిలేషన్ లో ఉంటాడు. దీనితో ఆమె దాంపత్య జీవితం మాత్రం సరిగా ఉండదు. ఇక అలానే నిరాశగా ఆమె తన లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటుంది.

సరిగ్గా అదే సమయంలో ఆమె దగ్గరకు ఓ పేషంట్ వస్తాడు. అందరిలా కాకుండా తను కాస్త డిఫరెంట్ గా ఉంటాడు. నాకు ఏ కౌన్సిలింగ్ అవసరం లేదు. నేనేంటో నాకు తెలుసు అనుకుంటూ.. ఒంటరిగా గడుపుతూ ఉంటాడు. అయితే అతను కవితలు బాగా రాస్తాడు, దీనితో ప్రేరణను అతనికి బాగా దగ్గరవుతుంది. క్రమంగా వారిద్దరూ ప్రేమలో పడతారు. ఆ తర్వాత వీరి ప్రేమ కథ ఎక్కడివరకు కొనసాగింది ! ఆమె భర్తకు ఈ విషయం తెలుస్తుందా ! ఆ పేషంట్ చివరకు ఏం అయ్యాడు ! ఈ కథ చివరకు ఎలా ముగిసింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి