Nidhan
ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఆర్సీబీ, సీఎస్కే ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే వాళ్లు క్వాలిఫై అవుతారు. ఈ నేపథ్యంలో లెజెండ్ హర్భజన్ సింగ్ తన ప్రిడిక్షన్ చెప్పాడు.
ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఆర్సీబీ, సీఎస్కే ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే వాళ్లు క్వాలిఫై అవుతారు. ఈ నేపథ్యంలో లెజెండ్ హర్భజన్ సింగ్ తన ప్రిడిక్షన్ చెప్పాడు.
Nidhan
ఐపీఎల్-2024 రసవత్తరంగా సాగుతోంది. ఒకదాన్ని మించి మరొకటి మ్యాచ్‌లు జరుగుతున్నాయి. భారీ స్కోర్లు, అదిరిపోయే ఛేజింగ్‌లతో క్యాష్ రిచ్ లీగ్ ఆడియెన్స్‌కు ఫుల్ మజాను పంచుతోంది. మెగా లీగ్ క్రమంగా ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌లు ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయిపోయాయి. మిగిలిన రెండు బెర్త్‌ల కోసం ఐదు జట్ల మధ్య పోరు నడుస్తోంది. ప్లేఆఫ్స్ బెర్త్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ రెండు జట్ల మధ్య 18వ తేదీన జరిగే మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే వాళ్లు క్వాలిఫై అవుతారు. ఈ నేపథ్యంలో లెజెండ్ హర్భజన్ సింగ్ తన ప్రిడిక్షన్ చెప్పాడు.
ఆర్సీబీ-సీఎస్కే పోరులో గెలుపు డుప్లెసిస్ సేనదేనని హర్భజన్ అన్నాడు. కీలక మ్యాచ్ కాబట్టి అగ్రెషన్ చూపించడంతో పాటు కూల్‌గా ఉండటం కూడా అంతే ముఖ్యమని చెప్పాడు. బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీకి, చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బిగ్ గేమ్స్‌లో ఎలా ఆడాలనేది బాగా తెలుసన్నాడు భజ్జీ. వన్డే వరల్డ్ కప్-2011 నెగ్గిన భారత జట్టులో కోహ్లీ సభ్యుడని.. అతడి చేతిలో ఐపీఎల్ ట్రోఫీ లేకపోయినా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని స్పష్టం చేశాడు. ఆర్సీబీ ఇప్పటిదాకా ఒక్క కప్పు కొట్టకపోయినా బ్యాటర్‌గా తాను ఏం చేయాలో అది చేస్తూ వచ్చాడని.. ప్రతిసారి టాప్ స్కోరర్స్‌లో కోహ్లీ పేరు ఉండటమే దానికి సాక్ష్యమని పేర్కొన్నాడు భజ్జీ.
ధోనీని కూడా లైట్‌గా తీసుకోవద్దని.. అతడు చెన్నైకి ఐదు కప్పులు అందించాడని హర్భజన్ అన్నాడు. ప్లేఆఫ్స్ లాంటి కీలక మ్యాచుల్లో సెంటిమెంట్లను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదనన్నాడు. ఇలాంటి మ్యాచుల్లో ఎవరు ప్రెజర్‌ను బాగా హ్యాండిల్ చేస్తారో వాళ్లే విజేతగా నిలుస్తారని చెప్పుకొచ్చాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ నెగ్గితే మాత్రం ఆ టీమ్‌దే గెలుపని భజ్జీ స్పష్టం చేశాడు. యంగ్ బ్యాటర్ రజత్ పాటిదార్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడని.. ఇతర బ్యాటర్ల మీద ఉన్న ప్రెజర్‌ను అతడు తీసేస్తున్నాడని వ్యాఖ్యానించాడు. హోమ్ కండీషన్స్‌లో ఆడుతుండటం బెంగళూరుకు కలిసొస్తుందన్నాడు. పత్తిరానా, ముస్తాఫిజుర్, దీపక్ చాహర్ లాంటి బడా ప్లేయర్లు లేకపోవడంతో చెన్నై కాస్త బలహీనపడిందని వివరించాడు. మరి.. భజ్జీ చెప్పినట్లు ఆర్సీబీ గెలుస్తుందా? లేదా సీఎస్కేదే విజయమా? మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.