iDreamPost

RCB సక్సెస్​లో కోహ్లీ, డుప్లెసిస్​కే క్రెడిట్ ఇస్తున్నారు.. అతడ్ని మర్చిపోయారు!

  • Published May 19, 2024 | 4:38 PMUpdated May 19, 2024 | 4:38 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనుకున్నది సాధించింది. ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​ బెర్త్​ను ఖాయం చేసుకుంది. నాకౌట్ ఫైట్​లో సీఎస్​కేను చిత్తు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనుకున్నది సాధించింది. ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​ బెర్త్​ను ఖాయం చేసుకుంది. నాకౌట్ ఫైట్​లో సీఎస్​కేను చిత్తు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

  • Published May 19, 2024 | 4:38 PMUpdated May 19, 2024 | 4:38 PM
RCB సక్సెస్​లో కోహ్లీ, డుప్లెసిస్​కే క్రెడిట్ ఇస్తున్నారు.. అతడ్ని మర్చిపోయారు!

అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఆర్సీబీ. ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​కు దూసుకెళ్లిందా జట్టు. ఆడిన మొదటి 8 మ్యాచుల్లో 7 పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసులో నుంచి అధికారికంగా తప్పుకున్న టీమ్.. ఆ తర్వాత వరుసగా 6 విజయాలతో క్వాలిఫై అయింది. ప్లేఆఫ్స్​ చేరతామని బెంగళూరు అభిమానులు కూడా నమ్మలేదు. కానీ ఒక్కో మ్యాచ్​ను నాకౌట్​గా పరిగణిస్తూ.. గెలుస్తూ పోయిందా జట్టు. క్వాలిఫై అవ్వాలంటే చావోరేవో అన్న సిచ్యువేషన్​లో నిన్న చెన్నై సూపర్​కింగ్స్​ను చిత్తు చేసింది. రుతురాజ్ సేనను 27 పరుగుల తేడాతో మట్టికరిపించింది ఆర్సీబీ. అయితే వరుస విజయాలు, ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్​తో ఇప్పుడు అందరూ విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్​ డుప్లెసిస్​ను మెచ్చుకుంటున్నారు.

కోహ్లీ, డుప్లెసిస్ వల్లే ప్లేఆఫ్స్ ఆశ నెరవేరిందని అంటున్నారు. ఈ సీజన్​లో విరాట్ ఆడిన 14 మ్యాచుల్లో 155 స్ట్రైక్ రేట్​తో 708 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాట్​తో రఫ్ఫాడించడమే గాక ఫీల్డింగ్ టైమ్​లో ప్లేయర్లు అందరిలోనూ స్ఫూర్తిని నింపుతున్నాడు. బౌలర్లకు విలువైన సూచనలు అందిస్తున్నాడు. ఇక, డుప్లెసిస్ కూడా 14 మ్యాచుల్లో 421 పరుగులతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్​గానూ టీమ్​ను సక్సెస్​ఫుల్​గా ముందుకు నడుపుతున్నాడు. దూకుడైన నిర్ణయాలతో ప్రత్యర్థి జట్ల పని పడుతున్నాడు. అయితే కోహ్లీ, డుప్లెసిస్​కు క్రెడిట్ ఇవ్వడంలో తప్పు లేదు. కానీ రియల్ హీరోను మర్చిపోవడమే కాస్త బాధాకరం. ఆర్సీబీ ఈ రేంజ్​లో ఉందంటే అది దినేష్ కార్తీక్ వల్లే.

డీకే ఆడిన పలు ఇన్నింగ్స్​లు బెంగళూరు రాత మార్చేశాయి. ఈ సీజన్​లో ఆడిన 14 మ్యాచుల్లో 315 పరుగులు చేశాడతను. ఆఖర్లో బ్యాటింగ్​కు వచ్చి మెరుపు ఇన్నింగ్స్​లతో టీమ్​కు భారీ స్కోర్లు అందించాడు. లీగ్ ఫస్టాఫ్​లో కార్తీక్ చెలరేగి ఆడాడు. నిన్న సీఎస్​కే మీద కూడా 6 బంతుల్లో 14 పరుగులు చేసి ఇన్నింగ్స్​కు మంచి ముగింపు ఇచ్చాడు. ఈ సీజన్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​తో మ్యాచ్​లో 35 బంతుల్లోనే 83 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు డీకే. ఆ మ్యాచ్​లో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఎస్​ఆర్​హెచ్​ మీద దినేష్ కార్తీక్ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ బెంగళూరు ప్లేయర్లకు ఇన్​స్పిరేషన్​గా నిలిచింది. గెలిచినా, ఓడినా పోరాడటం ఆపొద్దని అప్పుడు ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత కేకేఆర్ చేతిలో 1 రన్​తో ఓడారు. కానీ తర్వాత వరుసగా ఆరు విజయాలతో ప్లేఆఫ్స్​కు క్వాలిఫికేషన్ సాధించారు. డీకే అద్భుతమైన బ్యాటింగ్​​తో, కీపింగ్​తో సహచరులకు ఆదర్శంగా నిలిచాడు. అభిమానుల్లో ఆశలు నింపాడు. గెలుస్తామనే భరోసాను కల్పించాడు. కాబట్టి అతడికి కూడా టీమ్ సక్సెస్​లో వాటా ఇవ్వాల్సిందేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి