iDreamPost

RBI: సార్వత్రిక ఎన్నికల వేళ.. RBI కీలక ఆదేశాలు! వారికి కీలక సూచనలు!

దేశంలో లోక్ సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లోక్ సభ తొలి విడత ఎన్నికల పొలింగ్ పూర్తికాగా, మరికొన్ని రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రిజర్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది.

దేశంలో లోక్ సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లోక్ సభ తొలి విడత ఎన్నికల పొలింగ్ పూర్తికాగా, మరికొన్ని రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రిజర్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది.

RBI: సార్వత్రిక ఎన్నికల వేళ.. RBI కీలక ఆదేశాలు! వారికి కీలక సూచనలు!

దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ప్రధాన పార్టీలు అన్ని ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే తొలిదశ పోలింగ్ కూడా పూర్తయింది. ఏప్రిల్ 19న మొదటి దశ పోలింగ్ పలు రాష్ట్రాల్లో జరిగింది. మొత్తంగా నాలుగు విడతల్లో ఈ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఇలాంటి ఎన్నిక హడావుడి సాగుతున్న వేళ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలను జారీ చేసింది. కొందరికి కీలక సూచలను ఆర్బీఐ చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

భారత దేశంలో లోక్ సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల పొలింగ్ పూర్తికాగా, మరికొన్ని రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల వేళ డబ్బుల తరలింపు, సరఫరాలపై అధికారులు దృష్టి సారించారు. అలానే ఆర్బీఐకి కూడా బ్యాంకింగ్స్ లో జరిగే లావాదేవిలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇలా ఎన్నికల  వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. అధిక విలువ లేదా అనుమానాస్పద లావాదేవీలను నివేదించాలని బ్యాంకేతర చెల్లింపు సిస్టమ్ ఆపరేటర్లందరికీ సూచించింది. తమ ఆదేశాలను అతిక్రమిస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని సూచించింది.

ఓటర్లను ప్రభావితం చేసేందుకు లేదా ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకు నిధులును సమకూర్చేందుకు వివిధ ఎలక్ట్రానికి  చెల్లింపు విధానాలను వినియోగించే అవకాశం ఉందని ఆర్బీఐ పేర్కొంది. ఏప్రిల్ 15వ తేదీన బ్యాంకు యేతర పీఎస్ఓలకు రాసిన లేఖలో పై అంశాలను ప్రస్తావించింది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు  లేఖలో పేర్కొంది.  ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఎవైనా బ్యాంకేతర అధిక విలువ లేదా అనుమానాస్పద లావాదేవీలను సంబంధిత అధికారికి లేదా ఏజెన్సీలకు తెలియజేయాలని ఫిన్‌టెక్‌లకు సూచించింది.

పేమెంట్‌ గేట్‌వేలు, చెల్లింపు యాప్‌లు, అగ్రిగేటర్‌లు, ఆన్‌లైన్ లావాదేవీలలో కొనుగోలుదారులు, విక్రయింపులు చేసే వారి మధ్య చెల్లింపులను సులభతరం చేసే, సెటిల్ చేసే కార్డ్ నెట్‌వర్క్‌లతో సహా మధ్యవర్తులను పీఎస్‌ఓలుగా వ్యవహరిస్తారు. వీటిలో వీసా, మాస్టర్ కార్డ్, రూపే వంటి కార్డ్ నెట్‌వర్క్‌లతోపాటు క్యాష్, ప్రీ, రోజర్‌ పే, ఇన్ఫీబీమ్‌, పేయూ వంటి చెల్లింపు గేట్‌వేలు ఉన్నాయి. అలానే పేటీఎం, భారత్‌పే, మొబీక్విక్‌, గూగుల్‌పే, ఫోన్‌పే వంటి చెల్లింపుల యాప్‌లు ఉన్నాయి. మొత్తంగా ఇలా ఎన్నికల వేళ అధిక విలువ లేదా అనుమానాస్పద లావాదేవీలను నివేదించాలని బ్యాంకేతర చెల్లింపు సిస్టమ్ ఆపరేటర్లందరికీ తెలిపింది. మరి.. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి