iDreamPost

‘ధమాక’ జోడీ రిపీట్.. డెబ్యూ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన రవితేజ!

టాలీవుడ్ లో మరోసారి 'ధమాక' జోడీ రిపీట్ కాబోతోంది. రవితేజతో శ్రీలీల జోడీ కట్టబోతోంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభం అయ్యింది. అయితే ఈ మూవీతో కొత్త డైరెక్టర్ ను పరిచయం చేయబోతున్నాడు మాస్ మహారాజా.

టాలీవుడ్ లో మరోసారి 'ధమాక' జోడీ రిపీట్ కాబోతోంది. రవితేజతో శ్రీలీల జోడీ కట్టబోతోంది. ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభం అయ్యింది. అయితే ఈ మూవీతో కొత్త డైరెక్టర్ ను పరిచయం చేయబోతున్నాడు మాస్ మహారాజా.

‘ధమాక’ జోడీ రిపీట్.. డెబ్యూ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన రవితేజ!

ఇండస్ట్రీలో కాంబినేషన్లకు ప్రత్యేక క్రేజ్ ఉంటుందన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలానా హీరోతో పలానా డైరెక్టర్ మూవీ చేస్తే బాగుంటుందని, ఆ హీరోతో పలానా హీరోయిన్ జోడీ కడితే అదిరిపోతుందని అభిమానులు ఆశిస్తూ ఉంటారు. ఇక ఒక హిట్ మూవీలో నటించిన జోడీ మళ్లీ రిపీట్ కావాలని ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ లో మరోసారి ‘ధమాక’ జోడీ రిపీట్ కాబోతోంది. రవితేజతో శ్రీలీల జోడీ కట్టబోతోంది. మాస్ మహారాజా ప్రతిష్టాత్మకమైన RT 75లో శ్రీలీల మరోసారి రవితేజతో కలిసి చిందులు వేయనుంది.

మాస్ మహారాజా రవితేజ..  గతేడాది నుంచి ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు చేస్తూ.. అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో వరుసగా వాల్తేరు వీరయ్య, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, రావణాసుర లాంటి చిత్రాలతో మెప్పించాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘మిస్టర్ బచ్చన్’  మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇది ఇలా ఉండగానే మరో మూవీని పట్టాలెక్కించాడు మాస్ మహారాజా. ఆ చిత్రంలో శ్రీలీలతో మరోసారి జోడీ కట్టనున్నాడు. ఈ మూవీ పూజా కార్యక్రమానికి సంబంధించిన పిక్స్ ను మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Ravi srileela

రవితేజ తన 75వ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. మూవీతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇతడు శ్రీవిష్ణు నటించిన ‘సామజవరగమన’ చిత్రానికి రైటర్ గా పనిచేశాడు. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకుని రవితేజను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ మూవీలో మాస్ మహారాజాకి జోడీగా శ్రీలీల కనిపించనుంది. దాంతో మరోసారి తన డ్యాన్స్ తో ఇరగదీయడానికి రెడీ అయిపోతోంది యంగ్ బ్యూటీ. ఇక ఈ చిత్రాన్ని సితారా ఎంటర్ టైన్ మెంట్, ఫోర్చున్ ఫోర్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. మరి ధమాక జోడీ రిపీట్ కావడంపై, కొత్త డైరెక్టర్ కు రవితేజ ఛాన్స్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sithara Entertainments (@sitharaentertainments)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి