iDreamPost
android-app
ios-app

‘రేసు గుర్రం’ విలన్ పై జూనియర్ నటి సంచలన కామెంట్స్!

Ravi Kishan: రవికిషన్.. ఈ పేరు తెలిసిన వారు కొందరే టాలీవుడ్ ఆడియన్స్ ఉంటారు. అయితే రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి అంటే మాత్రం అందరికి  ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆ పాత్రతో ఎంతో ఫేమస్ అయ్యారు రవికిషన్. తాజాగా ఆయనపై ఓ జూనియర్ నటి సంచలన కామెంట్స్ చేసింది.

Ravi Kishan: రవికిషన్.. ఈ పేరు తెలిసిన వారు కొందరే టాలీవుడ్ ఆడియన్స్ ఉంటారు. అయితే రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి అంటే మాత్రం అందరికి  ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆ పాత్రతో ఎంతో ఫేమస్ అయ్యారు రవికిషన్. తాజాగా ఆయనపై ఓ జూనియర్ నటి సంచలన కామెంట్స్ చేసింది.

‘రేసు గుర్రం’ విలన్ పై జూనియర్ నటి సంచలన కామెంట్స్!

ప్రస్తుత సమాజంలో అనేక రకాల వివాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెలబ్రిటీల కుటుంబ, వ్యక్తిగత అంశాలకు సంబంధించి.. తరచూ వార్తలు వస్తున్నే ఉంటాయి. ముఖ్యంగా సినీ ప్రముఖలు పెళ్లిళ్లు, విడాకులు, ఇతరత్రా విషయాలు ఇటీవలకాలం ఎక్కువగా వచ్చాయి. తాజాగా ఓ జూనియర్ నటి.. ఓ ఫేమస్ నటుడిని తన తండ్రి అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ నటుడు లోక్ సభ ఎన్నికల బరిలో కూడా ఉన్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు, ఆ జూనియర్ నటీ ఎవరు, ఆమె మాటలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

రవికిషన్.. ఈ పేరు తెలిసిన వారు కొందరే తెలుగు ఆడియన్స్ ఉంటారు. అయితే రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి అంటే మాత్రం అందరికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అంతలా రేసుగుర్రం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు రవికిషన్. ఆయన అనేక తెలుగు సినిమాల్లో నటించి.. మంచి గుర్తింపు పొందారు.  ఎక్కువ తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి..తెలుగు ఆడియన్స్ మనస్సులో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన 2019 ఎన్నికల ఎంపీ గా పోటీ చేసి విజయం సాధించారు.

అలానే తాజాగా మరోసారి 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ నుంచి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున రవికిషన్ శుక్లా పోటీచేస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు రవికిషన్. ఆయనపై తాజాగా ఓ జూనియర్ నటి సంచలన కామెంట్స్ చేసింది. అంతేకాక ఏకంగా కోర్టును సైతం ఆశ్రయించింది. రవికిషన్‌ శుక్లా తన తండ్రి అంటూ షినోవా సోనీ అనే జూనియర్‌ నటి బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష చేయించాలని కూడా ఆమె కోర్టుకు  విజ్ఞప్తి చేసింది.

కొద్ది రోజుల క్రితమే షినోవా సోనీ తల్లి కూడా సంచలన వ్యాఖ్యలుచ సింది. రవి కిషన్‌ తన భర్త అంటూ కొద్ది రోజుల క్రితం షినోవా తల్లి లఖ్‌నవూలో జరిగిన ప్రెస్ మీట్ లో తెలిపింది. ఈ వివాదంపై రవికిషన్‌ భార్య ప్రీతి కూడా స్పందించారు. ఆ తల్లికూతుర్లు ఇద్దరు కావాల్సే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారనే ఆమె తెలిపారు. తమకు రూ.20 కోట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేసినట్లు ప్రీతి అన్నారు. అలా డబ్బులు ఇవ్వకుంటే అత్యాచార కేసులో ఇరికిస్తామంటూ గతేడాది షినోవా, ఆమె తల్లి బెదిరింపులకు పాల్పడ్డారని ప్రీతి ఆరోపించారు.

దీంతో వీరిద్దరితోపాటు సమాజ్‌వాదీ పార్టీ నేత వివేక్‌ కుమార్‌ పాండే, యూట్యూబర్‌ ఖుర్షీద్‌ ఖాన్‌ రాజులపై కేసులు నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. 2024 ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏ నాయకుడిపై ఆరోపణలు వచ్చినా..వారి గెలుపుపై ప్రతికూల, లేదా అనుకూల ప్రభావం చూపుతుంటాయి. తాజాగా రవికిషన్ విషయంలో జరుగుతున్న ఈ వివాదం.. ఆయన గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపుతోందే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş