iDreamPost

Rashmika Mandanna: రష్మిక సినిమా ఆగిపోయిందా..?

  • Published Feb 13, 2024 | 7:38 PMUpdated Feb 13, 2024 | 7:38 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తక్కువ టైమ్​లోనే పాన్ ఇండియా స్టార్​గా మారిపోయారు. ఆమె నుంచి సినిమా వస్తోందంటే చాలు.. ఆ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా మూవీ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తక్కువ టైమ్​లోనే పాన్ ఇండియా స్టార్​గా మారిపోయారు. ఆమె నుంచి సినిమా వస్తోందంటే చాలు.. ఆ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా మూవీ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తారు.

  • Published Feb 13, 2024 | 7:38 PMUpdated Feb 13, 2024 | 7:38 PM
Rashmika Mandanna: రష్మిక సినిమా ఆగిపోయిందా..?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తొలి ఫిమేల్ సెంట్రిక్ మూవీ ‘రెయిన్ బో’ గత ఏప్రిల్ లో చాలా అంచనాలతో ప్రారంభమైంది. అయితే కేవలం 15 నుంచి 20 రోజుల షూటింగ్ తర్వాత ఈ సినిమాకు ఎదురుదెబ్బ తగిలిందని చెన్నై వర్గాలు వెల్లడిస్తున్నాయి. కోలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన ఇవ్వడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. దీంతో నిర్మాతలు ఈ సినిమా నిర్మాణాన్ని ప్రస్తుతానికి నిలిపి వేశారని.. తిరిగి పనులు ప్రారంభించేందుకు మరింత అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. మరోవైపు రష్మికకు పెరుగుతున్న పాపులారిటీ కారణంగా అధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం వల్ల కూడా ఈ ఫిల్మ్ ఆగిందని వార్తలు వస్తున్నాయి.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్​పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ బ్రీజీ రొమాంటిక్ ఫాంటసీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు గతంలో తెలిపారు. అన్ని వయసుల ప్రేక్షకులకు ‘రెయిన్‌బో’ మూవీ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. నూతన దర్శకుడు శాంతరూబన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటుడు దేవ్ మోహన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కేఎం జస్టిన్ ప్రభాకరన్ బాణీలు సమకూర్చుతుండగా.. భాస్కరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇంతటి టాలెంటెడ్ టీమ్ పని చేస్తున్న ఈ సినిమా మధ్యలోనే ఆగిపోవడం బాధాకరమనే చెప్పాలి.

ఇకపోతే, టాలీవుడ్​లో రష్మిక నటిస్తున్న మరో ఫిమేల్ సెంట్రిక్ తెలుగు ప్రాజెక్ట్ ‘ది గర్ల్​ఫ్రెండ్’ భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. ‘పుష్ప 2’ లో తన పాత్రపై అంచనాలు తారస్థాయికి చేరుకోవడం, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ తో కలసి నటిస్తున్న ‘స్పిరిట్’ చిత్రంలో కూడా రష్మిక నటిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఎక్స్​పెక్టేషన్స్​ నెక్స్ట్ లెవల్​కు చేరుకోవడంతో ‘రెయిన్ బో’ నుంచి తప్పుకోవడం సరైనదే అనిపిస్తోంది. ‘రెయిన్ బో’ వంటి క్లాస్ మూవీ రిలీజై ఫెయిలై ఉంటే, ఇలాంటి కీలక సమయంలో ఆమె కెరీర్ కు ఎదురుదెబ్బ తగిలి ఉండేది. మరి.. రష్మిక ‘రెయిన్​బో’ మూవీ ఆగిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వార్ 2పై Jr.NTR కొత్త డిమాండ్! ఆ ఎఫెక్టే కారణమా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి