iDreamPost
android-app
ios-app

వార్ 2పై Jr.NTR కొత్త డిమాండ్! ఆ ఎఫెక్టే కారణమా?

Jr.NTR New Demand- War 2 Movie: దేవర తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ వార్ 2 చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి క్రేజీ వార్త వైరల్ అవుతోంది.

Jr.NTR New Demand- War 2 Movie: దేవర తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ వార్ 2 చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి క్రేజీ వార్త వైరల్ అవుతోంది.

వార్ 2పై Jr.NTR కొత్త డిమాండ్! ఆ ఎఫెక్టే కారణమా?

జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగులో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ ఇప్పుడు పాన్ ఇండియా నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. తన టాలెంట్, సహజసిద్ధమైన నటనతో కెరీర్లోనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ నటనకు విదేశాల్లో కూడా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కు మంచి జరిగిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అదే ప్రాజెక్టు వల్ల కాస్త చెడు కూడా జరిగింది అంటుంటారు. ఇప్పుడు అలాంటి సీన్ వార్ సినిమాలో రిపీట్ కాబోతోందేమే అనే భయం జూనియర్ ఎన్టీఆర్ ని వెంటాడుతోంది అంటున్నారు. అందుకే వార్ 2 డైరెక్టర్ దగ్గర తారక్ కొత్త డిమాండును ఉంచాడు అంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి ఇటీవల కూడా నెట్టింట కాస్త పంచాయితీ జరగడం చూశాం. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.. ట్రిపులార్ సినిమాకి కొమురం భీమ్ క్యారెక్టర్ సపోర్ట్ గా ఉంటుంది అని చెబితే.. అందరూ దానిని సపోర్టింగ్ రోల్ అంటూ మార్చేశారు. చాలామంది ఆ మాట చెప్పి ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ ది సపోర్టింగ్ రోల్ అంటూ ట్రోల్స్ చేశారు. ఆ విషయంపై పెద్ద పెద్ద ఫ్యాన్ వార్స్ కూడా నడిచాయి. జూనియర్ ఎన్టీఆర్ ది సపోర్టింగ్ రోల్ అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తారక్ కొరటాల డైరెక్షన్ లో దేవర పార్ట్ 1 చేస్తున్నాడు. ఆ తర్వాత వెంటనే వార్ 2 షూట్ లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటాడని చెబుతున్నారు.

ఇప్పుడు వార్ 2 సినిమాకి సంబంధించి ఆర్ఆర్ఆర్ సినిమా ఎఫెక్ట్ తారక్ ని వెంటాడుతోంది అటున్నారు. అలాంటి ఒక పరిస్థితే రిపీట్ కాబోతోందనే టాక్ నడుస్తోంది. వార్ 2లో తారక్ నెగిటివ్ రోల్ చేయబోతున్నాడు అని అందరికీ తెలిసిందే. హృతిక్ రోషన్ కు అపోజిట్ లో తారక్ నటించబోతున్నాడు. ఈ సినిమాలో తారక్ పాత్రను హృతిక్ పాత్ర ఎంతో డామినేట్ చేస్తుంది అంటున్నారు. దాదాపుగా హృతిక్ పాత్రదే పైచేయి అవుతుందని చెబుతున్నారు. అదే జరిగితే ఆర్ఆర్ఆర్ తరహాలో మళ్లీ ట్రోల్స్ వచ్చే ఆస్కారం కూడా లేకపోదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 డైరెక్టర్ ఆయన్ ముఖర్జీ దగ్గర కొత్త డిమాండ్ ని ఉంచాడంట. వార్ 2 కథలో మార్పులు చేయాలని కోరాడంటూ నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ పాత్రతో సమానంగా తారక్ పాత్ర కూడా ఉండేలా మార్పులు చేయాలంటూ కోరాడని గట్టిగానే టాక్ నడుస్తోంది.

ఈ విషయంలో డైరెక్టర్ ఆయన్ ముఖర్జీ మాత్రం సుముఖంగా లేడని కూడా కామెంట్స్ చేస్తున్నారు. తాను రాసుకున్న కథలో హీరో, విలన్ ఎలా ఉండాలో అలాగే పాత్రలు డిజైన్ చేశానని.. వాటిని మార్చడం కుదరదు అని సన్నిహితుల వద్ద ఆయన్ మఖర్జీ చెప్పాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే వీటిలో ఎంత వరకు నిజం ఉందో చెప్పడానికి లేదు. ఇప్పటికే తారక్ క్యారెక్టర్ కి సంబంధించి లుక్ టెస్ట్ కూడా పూర్తైంది. ఇటీవలే హృతిక్ రోషన్ కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి కామెంట్ చేశాడు. స్క్రీన్ మీద తనని, తారక్ ని చూస్తే మెస్మరైజ్ అయిపోతారంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి అసలు ఏం జరుగుతోంది అనేది తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరి.. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 డైరెక్టర్ ని కథలో మార్పులు చేయాలని కోరాడు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş