iDreamPost

Chiranjeevi: రామయ్య ప్రతిష్టాపనకు ఆహ్వానం.. పులకించిపోయిన చిరు!

  • Published Jan 14, 2024 | 1:58 PMUpdated Jan 14, 2024 | 1:58 PM

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాలు ఇప్పటికే దేశంలోని ఎంతో మంది ప్రముఖులకు చేరుకున్నాయి. ఈ క్రమంలో పలువులు టాలీవుడ్ హీరోలకు కూడా రామ మందిర ఆహ్వాన పత్రికలు అందినట్లుగా సమాచారం.

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాలు ఇప్పటికే దేశంలోని ఎంతో మంది ప్రముఖులకు చేరుకున్నాయి. ఈ క్రమంలో పలువులు టాలీవుడ్ హీరోలకు కూడా రామ మందిర ఆహ్వాన పత్రికలు అందినట్లుగా సమాచారం.

  • Published Jan 14, 2024 | 1:58 PMUpdated Jan 14, 2024 | 1:58 PM
Chiranjeevi: రామయ్య ప్రతిష్టాపనకు ఆహ్వానం.. పులకించిపోయిన చిరు!

ఆ అయోధ్యను ఏలేటి రామయ్య తండ్రి.. అయిన వారందరిని తన ఇంటి వేడుకకు ఆహ్వానిస్తున్నాడు. జనవరి 22వ తేదీన జరగబోయే రామయ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం.. దేశంలోని ఎంతో మంది ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలను అందచేస్తున్నారు. రామ జన్మ భూమిలో సాక్షాత్తు ఆ శ్రీ రామ చంద్రుడు.. కొలువుతీరబోతున్నాడు. కొన్ని వేల యుగాల క్రితం జరిగిన రామయ్య పట్టాభిషేక వైభోగం.. మరలా ఇప్పుడు కనిపించనుంది. రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఆ మహత్తర సన్నివేశాన్ని ఎపుడెపుడు కళ్లారా చూస్తామా అని.. కొన్ని కోట్ల మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ లోని సెలెబ్రెటీలకు కూడా ఈ ఆహ్వానాలు అందాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి రామ మందిర ఆహ్వాన పత్రిక అందిందని ఆయన తెలియజేశారు.

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి మాత్రమే కాకుండా.. ఆయన ఆధ్యాత్మికత గురించి కూడా అందరికి తెలిసిందే. నిత్యం దైవ నామాన్ని స్మరిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక అందడంతో చిరంజీవి ఎంతో ఉప్పొంగిపోయారు. ఈ ఆహ్వానాన్ని అందుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవితో పాటు ఆయన తనయుడికి కూడా.. అయోధ్యలో జరగబోయే వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికలు అందాయి. ఈ విషయమై చిరంజీవి మాట్లాడుతూ.. “అయోధ్యలో రామలయ నిర్మాణం, రామ విగ్రహ ప్రతిష్టాపన అనేవి వందల సంవత్సరాల నిరీక్షణకు కార్యరూపంగా భావిస్తున్నాను. ఇలాంటి ఓ చారిత్రాత్మిక ఘట్టంలో పాలు పంచుకోవడం గొప్ప అదృష్టం. ఈ ఆహ్వానాన్ని నాకు అందచేసిన రామ జన్మ భూమి ట్రస్ట్ వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత గొప్ప కార్యక్రమానికి సతీసమేతంగా హాజరు అవుతున్నాను” అంటూ పేర్కొన్నారు.

ఇక అందరి కోర్కెలు తీర్చే ఆ కోదండ రామయ్య .. ఆయన జన్మ స్థలంలో కొలువుతీరబోయే సమయం అతి దగ్గరలో ఉంది. కొన్ని లక్షల మంది ఆశయాలకు సన్నిధిగా ఈ ఆలయం ప్రతిష్టింపబడింది. ఇప్పటికే ఆ రాముల వారి ఆశీర్వాదంగా దేశంలోని అందరి ఇళ్లకు అక్షింతలు అందచేశారు. ఎంతో మంది ఈ మహత్తర సన్నివేశాన్ని.. ఆ రామయ్య తండ్రిని దర్శిచుకోవడం కోసం అయోధ్యకు చేరుకుంటున్నారు. దేశంలోని ప్రముఖ వ్యక్తులతో పాటు ఎంతో మంది సాధువులను కూడా సాదరంగా ఈ వేడుకకు ఆహ్వానించారు. మరి, మెగాస్టార్ చిరంజీవి తనకు రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికపై.. స్పదించిన విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి