iDreamPost

‘జైలర్’ వసూళ్ల బీభత్సం! 6 రోజుల్లోనే ‘విక్రమ్’ రికార్డు ఔట్!

  • Author ajaykrishna Published - 12:55 PM, Wed - 16 August 23
  • Author ajaykrishna Published - 12:55 PM, Wed - 16 August 23
‘జైలర్’ వసూళ్ల బీభత్సం! 6 రోజుల్లోనే ‘విక్రమ్’ రికార్డు ఔట్!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీ.. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా.. ఫస్ట్ డే నుండి కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతోంది. ఈ క్రమంలో ఇప్పటిదాకా పలు సినిమాల లైఫ్ టైమ్ రికార్డులను కొల్లగొట్టేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ కీలకపాత్రలలో నటించిన జైలర్ సినిమా.. మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. ముఖ్యంగా వర్కింగ్ డే కూడా క్యాష్ చేసుకుంటూ అదిరిపోయే నెంబర్స్ నమోదు చేసింది. దీంతో జైలర్ సినిమా సూపర్ స్టార్ కి కంబ్యాక్ హిట్ గా నిలిచిందని అంటున్నారు.

ఇక జైలర్ మూవీ.. అటు కామెడీ పరంగా, యాక్షన్ పరంగా అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్స్ లో అలరిస్తోంది. సోమవారం తర్వాత ఇండిపెండెన్స్ డే హాలిడే రావడంతో.. జైలర్ కి కలెక్షన్స్ బాగా కలిసి వచ్చాయని చెప్పాలి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సినిమా 6 రోజుల్లోనే దాదాపు రూ. 416 కోట్లకు పైగా వసూల్ చేసిందట. అంటే.. విశ్వనటుడు కమల్ హాసన్ లైఫ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘విక్రమ్’ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ రూ. 410 కోట్లు. ఇప్పుడా రికార్డును జైలర్ మూవీ కేవలం ఆరు రోజుల్లో బ్రేక్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

6 రోజులకు జైలర్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం!

  • తమిళనాడు : 134 Cr
  • ఏపీ, తెలంగాణ : 49 Cr
  • కేరళ : 33.20 Cr
  • కర్ణాటక : 44 Cr
  • రెస్టాఫ్ ఇండియా : 7 Cr
  • ఓవర్సీస్ : 145 Cr / $17.40 Mn(Est)

వరల్డ్ వైడ్ గ్రాస్: రూ. 416.19 కోట్లు

జైలర్ మూవీ తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన నెంబర్స్ కలెక్ట్ చేస్తోంది. ఇప్పటికి రూ. 49 కోట్లు గ్రాస్ అందుకున్న ఈ సినిమా.. 7వ రోజుకు రూ. 50 కోట్ల క్లబ్ లో చేరనుంది. మరోవైపు కర్ణాటకలో కూడా జైలర్ రూ. 50 కోట్ల వైపు పరుగులు పెడుతోంది. తెలుగులో మాత్రం రూ. 50 కోట్ల గ్రాస్ అందుకున్న మూడో డబ్బింగ్ సినిమాగా జైలర్ నిలవనుంది. ఇదివరకు డబ్బింగ్ సినిమాలుగా.. కేజీఎఫ్ 2, కాంతార సినిమాలు రూ. 50 కోట్లు పైగా వసూల్ చేశాయి. మరి జైలర్ మున్ముందు ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి. ఇక జైలర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి