iDreamPost

ఫిబ్రవరి 12.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకునే డేట్ ఇది!

Ram Charan Fans UnHappy: రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫిబ్రవరి 12న ఆవేదన చెందుతున్నారు. ఇలా చేస్తారు అనుకోలేదు అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

Ram Charan Fans UnHappy: రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫిబ్రవరి 12న ఆవేదన చెందుతున్నారు. ఇలా చేస్తారు అనుకోలేదు అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఫిబ్రవరి 12.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకునే డేట్ ఇది!

ఒక నటుడు హీరో అవ్వాలన్నా.. ఎంతో గొప్ప స్టార్ అవ్వాలన్నా అది అభిమానుల వల్లే సాధ్యం. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత కష్టపడి సినిమాలు తీసినా.. ఫ్యాన్స్, ఆడియన్స్ థియేటర్లకు వెళ్తేనే అవి హిట్లు, బ్లాక్ బస్టర్లు అవుతాయి. అలాంటి ఫ్యాన్ బేస్ రామ్ చరణ్ కు పుష్కలంగానే ఉంది. కానీ, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఆనందంగా లేరు. ముఖ్యంగా ఫిబ్రవరి 12వ తేదీని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేస్తున్నారు. అలా ఎందుకు జరుగుతోంది? అసలు రామ్ చరణ్ ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకోవడం దేనికి అని డౌటనుమానాలు పెంచుకోకండి. వారి ఆవేదనకు అర్థం ఉంది. దాని వెనుక బలమైన కారణమే ఉంది.

రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మూడేళ్ల వరకు సమయం కేటాయించాడు. ఆ మూడేళ్లలో తమ అభిమాన హీరో నుంచి సినిమా లేదే అని ఫ్యాన్స్ తల్లడిల్లి పోయారు. వాస్తవానికి ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి హీరో అభిమానుల పరిస్థితి ఇలాగే ఉంది. అయితే అలాంటి పరిస్థితి ఎప్పుడన్నా ఒకసారి అయితే బాధ పడరు. కానీ, మూడేళ్ల విరామం తర్వాత సినిమా వచ్చిందని సంబరాలు చేసుకున్నారు. తర్వాతి ప్రాజెక్టులు అయినా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని కనీసం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తారని భావించారు. ఆ కోరికలకు అనుగుణంగా ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కి ఏడాది ముందే రామ్ చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ కూడా చేశాడు. ఇంకేముంది ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లు లేకుండా పోయాయి. సినిమా కోసం ఎక్కువ సమయం తీసుకున్నారని బాధ పడుతున్నాం. కానీ, మూవీ రిలీజ్ కి ఏడాది ముందే తర్వాతి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు అంటూ ఖుషీ అయిపోయారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిన ఏడాదిలోపే RC15 కూడా వచ్చేస్తుందని భావించారు. కానీ, అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటి. గేమ్ ఛేంజర్ సినిమా ఎంతకీ తేలట్లేదు. ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. మరోవైపు శంకర్ కు ఇండియన్ 2 రూపంలో కష్టాలు మొదలయ్యాయి. ఆ పంచాయితీని పూర్తి చేయడం కోసం రామ్ చరణ్ ని ఒప్పించి రెండు సినిమాలను ఒకేసారి షూట్ చేయడం స్టార్ట్ చేశాడు శంకర్. అది మొదట్లో బాగానే అనిపించినా.. తర్వాత తర్వాత మాత్రం గేమ్ ఛేంజర్ సినిమా ఫేట్ ని ఛేంజ్ చేసేసింది. ఇంకా ఎన్ని రోజులు షూటింగ్ చేస్తారు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. పైగా మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్స్ కూడా రావడం లేదు. సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తారు అంటూ చెప్పడం అయితే చెబుతున్నారు కానీ, ఆ డేట్ మీద కూడా చెర్రీ ఫ్యాన్స్ నమ్మకంగా లేరు. కనీసం ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ చేసినా సరిపోతుంది కదా? ఒక టీజర్ రిలీజ్ చేసినా హ్యాపీగా ఫీలవుతాం కదా అంటున్నారు.

ఇప్పుడు అస్సలు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అంటే.. సరిగ్గా ఫిబ్రవరి 12, 2021లో రామ్ చరణ్ ఈ గేమ్ చేంజర్ కి సంబంధించి అనౌన్స్ మెంట్ చేశాడు. “శంకర్ గారి సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాబోతున్నందుకు ఎగ్జైటెడ్ గా ఉంది” అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ఇవాళ ఆ ట్వీట్ ని చూసుకుని.. మూవీ ప్రకటించి మూడేళ్లు అయిపోయింది కానీ, ఇంకా క్లారిటీ లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేస్తున్నారు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి మూడేళ్లు అవుతున్న సందర్భంగా తమ ఆవేదనను నెట్టింట వెళ్లగక్కుతున్నారు. “2022 బర్త్ డేకి గేమ్ ఛేంజర్ ఫస్ట్ లుక్, నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారు అనుకున్నాం. కానీ, ఆర్ఆర్ఆర్ మేనియాలో అది కొట్టుకుపోయింది. 2023 బర్త్ డేకి గ్లింప్స్ ఎక్స్ పెక్ట్ చేస్తే.. ఫస్ట్ లుక్ తో సరిపెట్టేశారు. ఈసారి పుట్టినరోజుకు అయినా RC15 గ్లింప్స్, RC16 మోషన్ పోస్టర్ వస్తే బాగుండు” అంటూ ఆకాంక్షిస్తున్నారు. మరి.. ఫిబ్రవరి 12న చెర్రీ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి