iDreamPost

OTT Release: OTTలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో మూవీ! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

  • Author Soma Sekhar Updated - 04:35 PM, Wed - 13 December 23

ఓ స్టార్ హీరో నటించిన మూవీ విడుదలై నెల రోజులు కూడా కాకముందే.. స్ట్రీమింగ్ కు సిద్దమైనట్లు తెలుస్తోంది. మరి ఆ మూవీ ఏది? ఆ స్టార్ హీరో ఎవరు?

ఓ స్టార్ హీరో నటించిన మూవీ విడుదలై నెల రోజులు కూడా కాకముందే.. స్ట్రీమింగ్ కు సిద్దమైనట్లు తెలుస్తోంది. మరి ఆ మూవీ ఏది? ఆ స్టార్ హీరో ఎవరు?

  • Author Soma Sekhar Updated - 04:35 PM, Wed - 13 December 23
OTT Release: OTTలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో మూవీ! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీ లవర్స్ కొత్త కొత్త మూవీస్, వెబ్ సిరీస్ లు ఏం వచ్చాయా? అని వాటిపై ఓ లుక్కేస్తారు. ఇక సినిమా లవర్స్ అభిరుచులకు అనుగుణంగా ప్రముఖ ఓటీటీ సంస్థలు మూవీస్ ను కొనుగోలు చేసి.. స్ట్రీమింగ్ చేస్తుంటాయి. ఓటీటీ ప్రేక్షకులు థ్రిల్లర్ జోనర్ లకు, హృదయాన్ని కదిలించే ప్రేమకథలకు పట్టం కడుతూ ఉంటారు. తాజాగా ఓ స్టార్ హీరో నటించిన మూవీ విడుదలై నెల రోజులు కూడా కాకముందే.. స్ట్రీమింగ్ కు సిద్దమైనట్లు తెలుస్తోంది. మరి ఆ మూవీ ఏది? ఆ స్టార్ హీరో ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రక్షిత్ శెట్టి.. కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కొద్దిరోజుల క్రితం రక్షిత్ శెట్టి-రుక్మిణి వసంత జంటగా నటించిన చిత్రం ‘సప్త సాగరాలు దాటి సైడ్-ఏ’ సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. దీంతో మేకర్స్ వెంటనే ఈ సినిమాకు కొనసాగింపుగా.. ‘సప్త సాగరాలు దాటి సైడ్-బి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ పిక్చర్ కు హేమంత్ ఎం.రావు దర్శకత్వం వహించాడు. నవంబర్ 17న థియేటర్లలోకి వచ్చింది. కానీ ప్రేక్షకులను తొలి భాగం మెప్పించినంతగా ఈ భాగం ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 22 నుంచి సప్త సాగరాలు సైడ్-బి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మాతృ భాష కన్నడతో పాటుగా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. డిసెంబర్ 22న స్ట్రీమింగ్ అయితే సినిమా విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీలో చూసే ఛాన్స్ ప్రేక్షకులకు దక్కనుంది. మరి నెలరోజుల్లోపే స్ట్రీమింగ్ సిద్దమైన ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి