iDreamPost

రజినీ మూవీకి అరుదైన గౌరవం! తొలి ఇండియన్ సినిమాగా రికార్డు..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఓ చిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఓ చిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే..

రజినీ మూవీకి అరుదైన గౌరవం! తొలి ఇండియన్ సినిమాగా రికార్డు..

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకే స్టైల్ ఐకాన్. తన నటన, స్టైల్ తోనే ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం యంగ్ హీరోలతో పోటీ పడి మరీ.. సినిమాల చేస్తున్నాడు. ఇక ఇటీవలే జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ నటించిన ఓ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్ లో 21వ శతాబ్దపు అద్భుతమైన చిత్రాల జాబితాలో రజినీకాంత్ మూవీ స్థానం సంపాదించుకుంది. ఈ మ్యాగజైన్ లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ఓ చిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. 2018లో పా. రంజిత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కాలా’. అధికారం కోసం ఉన్నత వర్గానికి.. అణగారిన వర్గాలకు మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రం. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన గౌరవం దక్కించుకుంది. బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్ లో 21వ శతాబ్దపు అద్భుతమైన 25 చిత్రాల జాబితాలో రజినీ ‘కాలా’ మూవీ చోటు దక్కింది. భారత దేశం నుంచి ఈ మ్యాగజైన్ లో చోటు దక్కించుకున్న ఏకైక చిత్రంగా కాలా నిలిచింది. ఈ లిస్ట్ లో ‘ఓల్డ్ బాయ్’, ‘గెట్ అవుట్’ లాంటి చిత్రాలు ఉన్నాయి.

“21వ శతాబ్దం నాలుగు భాగాల్లో ఒక భాగం ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో.. మా దగ్గర ఉన్న 25 మంది అత్యుత్తమ సినీ విశ్లేషకుల విశ్లేషణ ఆధారంగా ఈ జాబితాను రూపొందించాం. 2000-2024 మధ్య వచ్చిన సినిమాల్లో అత్యుత్తమమైన సినిమాలను ఎంపిక చేశాం. ప్రతీ ఏడాది నుంచి ఒక్కో చిత్రాన్ని ఎంపిక చేశాం” అని BFI ఓ ప్రకటనలో తెలిపింది. మరి రజినీకాంత్ చిత్రం ‘కాలా’ భారతదేశం నుంచి ఈ లిస్ట్ లో చోటు దక్కించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి