iDreamPost

రజినీకాంత్ రెమ్యూనరేషన్ అన్ని వందల కోట్లా? దేశం కాదు.. ఆసియాలోనే హయ్యెస్ట్!

Rajinikanth- Coolie Movie: రజినీకాంత్ పాన్ వరల్డ్ లెవల్లో ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలిసే వార్త వైరల్ అవుతోంది.

Rajinikanth- Coolie Movie: రజినీకాంత్ పాన్ వరల్డ్ లెవల్లో ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలిసే వార్త వైరల్ అవుతోంది.

రజినీకాంత్ రెమ్యూనరేషన్ అన్ని వందల కోట్లా? దేశం కాదు.. ఆసియాలోనే హయ్యెస్ట్!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఏదైనా మూవీ గురించ పెద్ద చర్చ నడుస్తోందా అంటే అది తలైవర్ 171 గురించే అనాలి. ఈ మూవీకి సంబంధించి సోమవారం టైటిల్ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు కూలీ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఆ టైటిల్ టీజర్ చూసిన తర్వాత రజినీకాంత్ ఫ్యాన్స్ నేల మీద నిలవడం లేదు. ఎందుకంటే అది ఆ రేంజ్ లో ఉంది కాబట్టి. లోకేశ్ కనకరాజుతో మూవీ అన్నప్పుడే ఫ్యాన్స్ అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఆ టీజర్ చూసిన తర్వాత బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఈ మూవీకి సంబధించి ఇంకో క్రేజీ వార్త వినిపిస్తోంది. అది కూడా రజినీకాంత్ రెమ్యూనరేషన్ గురించి. ఆసియాలోనే హయ్యెస్ట్ అంటున్నారు.

రజినీకాంత్- లోకేష్ కనకరాజు కాంబోలో కళానిధి మారన్ కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. జైలర్ సినిమాని కూడా కళానిధి మారన్ నిర్మించిందే. చిత్రం అనూహ్య లాభాలు తెచ్చిపెట్టినందుకు రజినీకాంత్ కు ఒక లగ్జరీ కారు, రూ.100 కోట్ల వరకు అదనంగా ఇచ్చారని చెప్పారు. మూవీ టీమ్ మొత్తానికి బంగారు నాణేలు కూడా అందజేశారు. ఇప్పుడు మళ్లీ రజినీతో కళానిధి మారన్ కూలీ చిత్రం చేస్తున్నారు. ఈసారి సినిమా రెమ్యూనరేషనే నెక్ట్స్ లెవల్లో ఇస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కోసం రజినీకాంత్ కు ఇస్తున్న రెమ్యూనరేషన్ తో దాదాపు 5 మంచి బడ్జెట్ చిత్రాలు నిర్మించవచ్చు అంటున్నారు.

కూలీ కోసం రజినీకాంత్ కు ఏకంగా రూ.260 కోట్ల నుంచి రూ.280 కోట్ల వరకు పారితోషకంగా ఇస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఇవి కేవలం గాసిప్స్ మాత్రమే. ఒకవేళ అదే గనుక నిజమైతే పాన్ ఇండియా లెవల్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరో కావడం కాదు.. ఏకంగా ఆసియా ఖండంలోనే అత్యధిక పారితోషకం అందుకున్న స్టార్ హీరోగా రజినీకాంత్ నిలుస్తారని చెప్తున్నారు. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతానికి ఈ వార్త చూసి రజినీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కూలీ చిత్రం జైలర్ కి మించి సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.

ఇంక కూలీ చిత్రం టైటిల్ టీజర్ చూసిన తర్వాత మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పైగా లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటికే కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్, విజయ్ సేతుపతి, కార్తీ ఉన్నారు. ఇప్పుడు రజినీకాంత్ ని కూడా లోకీ యూనిరవర్స్ లోకి తీసుకొస్తున్నారు అంటున్నారు. వీళ్లందరినీ ఒకే ఫ్రేమ్ లో చూస్తే మాములుగా ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. కూలీ సినిమా కోసం రజినీకాంత్ 260 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి